Home /News /international /

SRI LANKA CRISIS ANGRY PROTESTERS TAKE OVER PRESIDENT GOTABAYA RAJAPASKA HOUSE TEAR GAS FIRED AT LEAST 30 INJURED SK

Srilanka Crisis: దేశాధ్యక్షుడి ఇంట్లోకి దూసుకెళ్లి.. స్విమ్మింగ్ పూల్‌లో ఈతకొట్టిన నిరసనకారులు.. వీడియోలు వైరల్

శ్రీలంక దేశాధ్యక్షుడి నివాసం

శ్రీలంక దేశాధ్యక్షుడి నివాసం

Sri Lanka Crisis: యుద్ధ నౌకలో గొటబాయ రాజపక్స దేశం నుంచి పారిపోయినట్లు సమాచారం అందుతోంది. కొలంబో పోర్టులో శ్రీలంక నేవల్ షిప్ గజబాహులోకి పెద్ద మొత్తంలో లగేజీ ఎక్కించారని.. అది గొటబాయకి సంబంధించిదే అయి ఉండవచ్చని స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది.

ఇంకా చదవండి ...
    శ్రీలంకలో (Srilanka Crisis)మళ్లీ తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక సంక్షోభాన్ని నిరసిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా లంక రాజధాని కొలంబో జనసంద్రమైంది. వేలాది మంది ఆందోళనకారులు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ (Gotabaya Rajapaksa) రాజపక్స నివాసాన్ని ముట్టడించారు. ఆందోళనకారులు భారీ సంఖ్యలో వస్తున్నారని తెలిసి.. ఆయన ఇంటి నుంచి పారిపోయారు. అనంతరం నిరసనకారులు ఆయన ఇంట్లోకి చొరబడి.. రచ్చ రచ్చ చేశారు. కొందరు ఆందోళణకారులు స్విమ్మింగ్ పూల్‌లోకి దిగి ఈత కొట్టారు.



    అధ్యక్ష భవనంలోని గదుల్లో ఆందోళనకారులు





    ఆందోళనకారులతో శ్రీలంక అధ్యక్ష భవనానికి వెళ్లే రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంతగా జనాలు తరలివచ్చారు. కొంత మంది అధ్యక్ష భవనంపైకి ఎక్కి.. శ్రీలంక జాతీయ జెండాను ఊపుతూ కనిపించారు.







    పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆందోళనకారులపైకి భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. కాల్పుల్లో 30 మంది ఆందోళనకారులు గాయపడ్డారు. శ్రీలంక వ్యాప్తంగా ఇదేరకమైన పరిస్థితులు నెలకొన్నాయి. కొలంబోతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించలేని అధ్యక్షుడు గొటబాయా.. వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పలువురు ఎంపీలు కూడా ఇదే కోరుతున్నారు. గద్దె దిగాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రధాన మంత్రి విక్రమ్ రణసింఘే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లంకలో తాజా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.



    మరోవైపు దేశాధ్యక్షుడు గొటబాయా ప్రస్తుతం ఎక్కడున్నారో అర్థం కావడం లేదు. భారీ సంఖ్యలో ఆందోళనకారులు అధ్యక్ష భవనం వైపు దూసుకొస్తున్నారని తెలిసి.. ఆయన తన నివాసాన్ని విడిచి పారిపోయారు. కొలంబలోని మిలటరీ క్యాంప్లో ఉన్న మొదట వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు యుద్ధ నౌకలో గొటబాయ రాజపక్స దేశం నుంచి పారిపోయినట్లు సమాచారం అందుతోంది. కొలంబో పోర్టులో శ్రీలంక నేవల్ షిప్ గజబాహులోకి పెద్ద మొత్తంలో లగేజీ ఎక్కించారని.. అది గొటబాయకి సంబంధించిదే అయి ఉండవచ్చని స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది. ఆ తర్వాత కాసేపటికే SLNS గజబాహు, SLNS సింధురాల కొలంబో పోర్టు నుంచి బయలుదేరి వెళ్లాయని.. వాటిలో గొటబాయ రాజపక్స ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: International, International news, Sri Lanka, Srilanka

    తదుపరి వార్తలు