Home /News /international /

SRI LANKA CANCELS SCHOOL EXAMS OVER PAPER SHORTAGE PVN

Sri Lanka Crisis : పేపర్ కొనడానికి డబ్బుల్లేక..శ్రీలంకలో స్కూల్ ఎగ్జామ్స్ రద్దు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Paper Shortage In Sri Lanka : విదేశీ మారకద్రవ్యం, ఇంధన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి భారత్ శ్రీలంకకు గత నెలలో 500 మిలియన్ డాలర్ల రుణాన్ని అందించింది. పొరుగు దేశాలకు పరస్పర సహకారం అందించే విషయంలో భారత్‌ ఎప్పుడూ ముందుంటుందని రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు భారత్ అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు లంక ఆర్ధికశాఖ మంత్రి.

ఇంకా చదవండి ...
Sri Lanka Exams Cancelled : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అత్యంత తీవ్ర స్థాయికి చేరింది. ఆర్థిక సంక్షోభం, విదేశీ మారక నిల్వలు నిండుకోవడంతో ప్రస్తుతం ఆ దేశం అప్పులతో నెట్టుకువస్తోంది. ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శ్రీలంకలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయంటే..బడుల్లో పరీక్షలు నిర్వహించడానికి కనీసం పేపర్‌, ఇంక్‌ ను కూడా దిగుమతి చేసుకోలేని పరిస్థితి. శ్రీలంకలో దిగుమతులకు డాలర్ల కొరత ఏర్పడింది. ఫలితంగా అనేక దిగుమతులపై భారీ ప్రభావం పడింది. అన్నింటికీ మించి పేపర్ల కొరత తీవ్రంగా ఉంది. పేపర్‌ కొరత కారణంగా శ్రీలంక పశ్చిమ ప్రావిన్స్‌ లో స్కూల్ పరీక్షలను రద్దు చేసింది అక్కడి ప్రభుత్వం. సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది. "విదేశీ మారకద్రవ్యం లేకపోవడం కారణంగా ప్రింటింగ్​ చేసేందుకు పేపర్లు, ఇంకును కొనుగోలు చేయలేకపోయాం. అందువల్ల స్కూళ్లు పరీక్షలను నిర్వహించలేవు, అని పశ్చిమ ప్రాంతంలోని విద్యాశాఖ విభాగం వెల్లడించింది.

శ్రీలంకలో పేపర్లతో పాటు ఆహారం, ఇంధనం, ఫార్మాపైనా ఆర్థిక సంక్షోభం ఎఫెక్ట్​ పడింది. ఇక నానాటికీ పెరుగుతున్న నిత్యావసర ధరలతో ప్రజలు విలవిలాడుతున్నారు. పాలు, పాల పౌడర్లు, చక్కెర, రైస్​ను కొనుగోలు చేసేందుకు ప్రజలు సూపర్​మార్కెట్ల వద్ద భారీగా క్యూ కడుతున్నారు. క్లిష్టపరిస్థితుల నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్​) సాయం కోరింది శ్రీలంక ప్రభుత్వం. శ్రీలంక అభ్యర్థనను పరిశీలిస్తున్నట్టు ఐఎంఎఫ్​ తెలిపింది. ఈ ఏడాదిలో శ్రీలంక 6.9బిలియన్​ డాలర్ల అప్పును చెల్లించాల్సి ఉండగా.. దేశంలో విదేశీ మారకద్రవ్యం ఫిబ్రవరి చివరి నాటికి 2.3బిలియన్​ డాలర్లే ఉంది.

ALSO READ COVID-19 : చైనాలో కరోనా మరణ మృదంగం..ఏడాది తర్వాత మళ్లీ

విదేశీ మారకద్రవ్యం, ఇంధన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి భారత్ శ్రీలంకకు గత నెలలో 500 మిలియన్ డాలర్ల రుణాన్ని అందించింది. పొరుగు దేశాలకు పరస్పర సహకారం అందించే విషయంలో భారత్‌ ఎప్పుడూ ముందుంటుందని రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు భారత్ అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు లంక ఆర్ధికశాఖ మంత్రి. ఎంతో కాలంగా పరిష్కారానికి నోచుకోని మత్స్యకారుల సమస్యపై కూడా మోడీ, బాసిల్‌ రాజపక్సే రెండు రోజుల క్రితం ఫోన్ లో విస్తృతంగా చర్చించారు. లంక, భారత్‌ మత్య్సకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలనే విషయంపై ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మత్స్యకారుల మానవత్వం, జీవనోపాధి, అమలు, సముద్ర జీవావరణ శాస్త్రం, అరెస్టయిన మత్స్యకారులతో పాటు వారి పడవలను ముందస్తుగా విడుదల చేయడం వంటి సంక్లిష్టమైన అనేక అంశాలను గుర్తించారు. వాటన్నింటికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనవలసిన అత్యవసర అవసరాన్ని కూడా ఇద్దరు ప్రముఖులు అంగీకరించినట్లుగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Exams postponed, Financial problem, Srilanka

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు