ఇది కూడా చదవండి: వేగంగా వెళ్తున్న కారు అద్దంపై పాము ప్రత్యక్షం.. వైపర్ తో తొలగించేందుకు ప్రయత్నం.. చివరకు..
అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్న ’శ్రీలంక పార్లమెంట్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం‘ షెడ్యూల్ రద్దయింది. భారత్ తో సంబంధాలు దెబ్బతినకుండా ఉండేందుకే శ్రీలంక ఈ కీలక నిర్ణయం తీసుకుని ఉంటుందని అంతర్జాతీయ మీడియా ప్రత్యేక కథనాలను ప్రచురించింది. ( ఇది కూడా చదవండి: పాకిస్తాన్ ఓవరాక్షన్.. ప్రధాని మోదీ విమానానికి నో ఎంట్రీ ) ప్రపంచ దేశాలకు కొవిడ్ వ్యాక్సిన్ ను ఉదారంగా భారత్ ఎగుమతి చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది వారాల క్రితం శ్రీలంకకు కూడా ఐదు లక్షల డోసుల కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా సరఫరా చేసింది. ప్రాణాంతక వ్యాధికి సంజీవనిలా మారిన ఆ వ్యాక్సిన్ వల్ల శ్రీలంక భారీగానే లాభపడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ లో భారత్ తో సంబంధాలు దెబ్బతినకుండా ఉండేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ పర్యటన విషయంలో ఆ కీలక మార్పును చేసిందని మీడియా వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఏడాదిన్నర క్రితం పాకిస్తాన్ మీదుగా భారత ప్రధాని మోదీ విమానం వెళ్లేందుకు ఆ దేశం అభ్యంతరం చెప్పిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: స్నేహితుడి పెళ్లికి వెరైటీ బహుమతిని ఇచ్చిన యువకులు.. గిఫ్ట్ బాక్సులో ఏముందో చూసి పెళ్లికి వచ్చిన వాళ్లంతా..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Imran khan, India, International news, Narendra modi, Pakistan, Sri Lanka