Home /News /international /

SRI LANKA BOMBER WAITED AT HOTEL BUFFET THEN UNLEASHED DEVASTATION MS

SRILANKA BLASTS : సిన్నమాన్ హోటల్లో ఆత్మాహుతి దాడి ఎలా జరిగింది.. ప్రత్యక్ష సాక్షుల మాటల్లో..

కొలంబోలో పేలుళ్లు జరిగిన ప్రాంతంలో చిత్రం

కొలంబోలో పేలుళ్లు జరిగిన ప్రాంతంలో చిత్రం

ఆత్మాహుతిలో అతనితో పాటు ఆ సమయంలో అక్కడ ఉన్న చాలామంది చనిపోయినట్టు సిన్నమాన్ హోటల్ మేనేజర్ తెలిపారు. ఈ ఘటనలో మరో 20మంది తీవ్రంగా గాయపడగా.. వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు.

    శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్లతో ఆ దేశం చివురుటాకులా వణికిపోతోంది. LTTE అంతర్యుద్దం తర్వాత దేశంలో శాంతిభద్రతల సమస్య లేదని భావిస్తున్నవేళ.. ఉగ్రవాదులు పెను సవాల్ విసిరారు. వరుసగా 8 చోట్ల బాంబులు పేల్చి 215 పైచిలుకు మందిని బలిగొన్నారు. ఇందులో 35మంది విదేశీయులు కూడా ఉన్నారు. పేలుళ్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక్కో విషయం బయటపడుతోంది. పేలుళ్లలో ఎక్కువగా ఆత్మాహుతి దాడులే ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో సిన్నమాన్ గ్రాండ్ హోటల్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడి గురించి అక్కడి ప్రత్యక్ష సాక్షులు కొన్ని వివరాలు మీడియాతో పంచుకున్నారు.

    సిన్నమాన్ గ్రాండ్ హోటల్‌లో ఈస్టర్ సండే కోసం మహమ్మద్ అజమ్ మహమ్మద్ అనే వ్యక్తి కూడా రిజిస్టర్ చేయించుకున్నాడు. ఆదివారం అందరి లాగే సాధారణ పౌరుడిగా హోటల్లోకి ప్రవేశించాడు. అప్పుడు సమయం 8.30గంటలు.. హోటల్ చాలా రద్దీగా ఉంది. హోటల్లోకి ప్రవేశించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బఫే వద్దకు వెళ్లి ప్లేటు తీసుకుని క్యూ లైన్‌లో నిలుచున్నాడు. అలా కొద్దిసేపటికే తన నడుముకు అమర్చుకున్న బాంబును పేల్చుకుని.. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.
    సిన్నమాన్ హోటల్ మేనేజర్


    ఆత్మాహుతిలో అతనితో పాటు ఆ సమయంలో అక్కడ ఉన్న చాలామంది చనిపోయినట్టు హోటల్ మేనేజర్ తెలిపారు. ఈ ఘటనలో మరో 20మంది తీవ్రంగా గాయపడగా.. వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. పేలుడు జరిగిన సిన్నమాన్ హోటల్‌కు ప్రధాని కార్యాలయం సమీపంలోనే ఉండటం గమనార్హం. సిన్నమాన్ గ్రాండ్ హోటల్లో ఆత్మాహుతి జరిగిన సమయంలోనే షాంగ్రీ-లా, కింగ్స్‌బరీ హోటల్స్ సహా పలు చర్చిల్లోనూ పేలుళ్లు సంభవించాయి. అన్నింటిలో సెయింట్ ఆంథోని, కేథలిక్ చర్చిల వద్ద జరిగిన పేలుళ్లు ఎక్కువ ప్రభావం చూపించాయి. పేలుడు ధాటికి చర్చిల పైకప్పులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇప్పటికైతే పేలుళ్లలో 215మంది మృతి చెందినట్టు సమాచారం అందుతున్నప్పటికీ.. పేలుళ్ల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
    First published:

    Tags: Sri Lanka, Terror attack, Terrorism

    తదుపరి వార్తలు