Home /News /international /

SRI LANKA BOMB BLAST SRI LANKA STOPS VISA ON ARRIVAL TO 39 COUNTRIES DUE TO TERROR ATTACKS NK

తండ్రి మసాలా వ్యాపారి... కొడుకులు ఉగ్రవాదులు... శ్రీలంక పేలుళ్లలో ఆశ్చర్యకర విషయాలు

శ్రీలంకలో పేలుళ్లు జరిగిన చర్చి (File)

శ్రీలంకలో పేలుళ్లు జరిగిన చర్చి (File)

Sri Lanka Bomb Blast : శ్రీలంకలో పేలుళ్లపై దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఏ చిన్న అనుమానం వచ్చినా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

శ్రీలంకలో ఆదివారం జరిగిన బాంబు పేలుళ్లపై జరుపుతున్న దర్యాప్తులో ఆశ్చర్యకర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ చేసిన ఇద్దరు ఉగ్రవాదుల తండ్రి మహ్మద్ యూసఫ్ ఇబ్రహీం... శ్రీలంకలో పెద్ద ఎత్తున మసాలా వ్యాపారం చేస్తున్నాడు. ఆయన్ని అరెస్టు చేసిన పోలీసులు... ప్రశ్నించగా కొత్త విషయాలు తెలిశాయి. మహ్మదే తన కొడుకులను ఆత్మాహుతి దాడులకు ప్రేరేపించాడని తేలింది. ఇల్హమ్ అహ్మద్ ఇబ్రహీం, ఇమ్సత్ అహ్మద్ ఇబ్రహీంలకు ఆత్మాహుతి దాడులకు కావాల్సిన డబ్బును ఇచ్చిన తండ్రి... పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు పోగుచేశాడు. అవి ఎంత శక్తిమంతమైనవంటే... మహ్మద్ ఇంటిని తనిఖీ చేస్తుంటే పేలుడు సంభవించింది. ఆ ఘటనలో ముగ్గురు పోలీసులు చనిపోయారు.

శ్రీలంకలో కర్ఫ్యూని అక్కడక్కడా తొలగించిన ప్రభుత్వం... ముమ్మర దర్యాప్తు జరిపిస్తోంది. ఉగ్రవాదుల కోసం వేటను ఉద్ధృతం చేశారు. సైన్యం, లంక సీఐడీ, ఉగ్రవాద దర్యాప్తు బృందాలు వివిధ ప్రాంతాల్లో దాడులు కొనసాగిస్తున్నాయి. తాజాగా 16 మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించాయి. ఇలా ఇప్పటివరకూ 78 మంది పోలీస్ కస్టడీలో ఉన్నారు. పేలుళ్లు జరుగుతాయని ముందే తెలిసినా చర్యలు తీసుకోనందుకు బాధ్యతగా ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో తన పదవికి రాజీనామా చేశారు. తనను క్షమించమని ప్రజలను కోరారు. ప్రధానగా 10 రోజులకు ముందే పేలుళ్లు జరుగుతాయని భారత నిఘా వర్గాలు హెచ్చరించినా తేలిగ్గా తీసుకోవడం వల్ల... శ్రీలంక చరిత్రలో ఇదో అతి పెద్ద మాననిగాయంగా మారింది. కాగా ఈ పేలుళ్లలో చనిపోయిన భారతీయుల సంఖ్య 11కి చేరింది.

బాంబు పేలుళ్లతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న శ్రీలంక ప్రభుత్వం గురువారం నుంచీ చర్చిలను మూసివేసింది. తిరిగి ఎప్పుడు తెరిచేదీ త్వరలో ప్రకటిస్తామంది. అలాగే... అరైవల్ వీసాల జారీ నిలిపివేసింది. నిజానికి మే 1 నుంచీ 39 దేశాల ప్రజలకు అరైవల్ వీసాలు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం పరిస్థితి బాలేకపోవడంతో వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు శ్రీలంక టూరిజం మంత్రి జాన్ అమరతుంగ. ఒకవేళ అరైవల్ వీసాలు ఇచ్చినా ఆ దేశం వెళ్లేందుకు పర్యాటకులు సిద్ధపడట్లేదు. ఆల్రెడీ అక్కడ ఉన్నవారు సైతం తమ తమ దేశాలకు వెళ్లిపోయారు. ఈస్టర్ ముందు వరకూ పర్యాటకులతో కళకళలాడిన శ్రీలంక ఇప్పుడు బోసిపోతోంది.

చర్చిలు, హోటళ్లపై ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడుల్లో ఇప్పటివరకూ 253 మంది చనిపోగా, 400 మంది దాకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మరిన్ని దాడులు జరగొచ్చన్న హెచ్చరికలతో ఆందోళనకర వాతావరణం ఉంది.

 

ఇవి కూడా చదవండి :

పవన్ కళ్యాణ్ బాటలో నాగబాబు... జబర్దస్త్ విషయంలో ఏమన్నారంటే...

మాకొద్దీ ఎన్నికల బెట్టింగ్ బాబోయ్... టెన్షన్ తట్టుకోలేకపోతున్న ప్రజలు...

టార్గెట్ టీడీపీ... ఏపీలో ఓన్లీ వైసీపీ... కేసీఆర్‌తో జగన్ ఏం చర్చించబోతున్నారు...

ఈవీఎంలపై ఎందుకింత చర్చ... ప్రజలకు లేని టెన్షన్ పార్టీలకు అవసరమా...
First published:

Tags: International, Sri Lanka, Sri Lanka Blasts, World

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు