హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Sri Lanka Crisis : శ్రీలంకలో ఆహార సంక్షోభ విలయం.. రైతులకు సర్కారు కీలక విన్నపం..

Sri Lanka Crisis : శ్రీలంకలో ఆహార సంక్షోభ విలయం.. రైతులకు సర్కారు కీలక విన్నపం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శ్రీలకలో ఆహార సంక్షోభం తలెత్తింది. ధాన్యం నిల్వలు అడుగంటిన దరిమిలా దేశంలోని రైతాంగానికి ప్రభుత్వం కీలక విన్నపం చేసింది. వివరాలివే..

భారత్ పొరుగుదేశం శ్రీలంకలో సంక్షోభ (Sri Lanka Crisis)  విలయం కొనసాగుతున్నది. కొత్త ప్రధాని రాకతో రాజకీయ సంక్షోభానికి తెరపడినా.. ఆర్థిక పరిస్థితి చక్కబడే సూచనలు ఇప్పట్లో కనిపించడంలేదు. దీనికితోడు దేశంలో ఆహార సంక్షోభం తలెత్తింది. ధాన్యం నిల్వలు అడుగంటిన దరిమిలా దేశంలోని రైతాంగానికి ప్రభుత్వం కీలక విన్నపం చేసింది. వివరాలివే..

పొరుగు దేశం శ్రీలంక.. చరిత్రలో ఎరుగనటువంటి ఆర్థిక మాంద్యంలో అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే అక్కడి అధ్యక్షుడు కూడా రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తోంది కొత్త ప్రభుత్వం. ఇలాంటి సమయంలో రానున్న కొద్దిరోజుల్లో దేశంలో విపరీతమైన ఆహార కొరత ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే రైతులంతా ముందుకొచ్చి ఎక్కువగా ఆహార పదార్థాల పంటలు వేయాలని, వరి పండించాలని శ్రీలంక ప్రభుత్వం కోరింది. ‘‘ఆహార పరిస్థితులు దారుణంగా తయారవుతున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే రైతులంతా మళ్లీ పొలాల వైపు అడుగులు వేయాలని, ఎక్కువగా పండించాలని కోరుతున్నాం’’ అని వ్యవసాయ శాఖ మంత్రి మహింద అమరవీర తెలిపారు.

మరోవైపు, ద్వీప దేశంలో ఇంధన కొరతను తగ్గించేందుకు 40వేల మెట్రిక్‌ టన్నుల డీజిల్‌ను సరఫరా చేసినట్లు భారత్‌ మంగళవారం తెలిపింది. విదేశీ మారకద్రవ్య నిలువ అడుగుంటడంతో.. కరెన్సీ విలువ తగ్గింది. ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఈ క్రమంలో ఇంధనం దిగుమతి చేసుకునేందుకు సహాయం అందించేందుకు భారత్‌ గత నెలలో శ్రీలంకకు అదనంగా 500 మిలియన్‌ డాలర్ల క్రెడిట్‌ లైన్‌ను పొడగించింది. ఈ మేరకు ఫ్రిబవరి 2, 2022న పెట్రోలియం ఉత్పత్తుల కోసం కొనుగోలు భారత్‌ క్రెడిట్‌ ఒప్పందంపై సంతకాలు చేశాయి.

Published by:Madhu Kota
First published:

Tags: Food crisis, India, Sri Lanka

ఉత్తమ కథలు