హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Squid Game cryptocurrency: "స్క్విడ్‌ గేమ్" క్రిప్టో క‌రెన్సీ పేరుతో భారీ మోసం.. పెట్టుబ‌డిదారుల‌కు రూ.25 కోట్లు టోక‌రా

Squid Game cryptocurrency: "స్క్విడ్‌ గేమ్" క్రిప్టో క‌రెన్సీ పేరుతో భారీ మోసం.. పెట్టుబ‌డిదారుల‌కు రూ.25 కోట్లు టోక‌రా

(ప్ర‌తీకాత్మక చిత్రం)

(ప్ర‌తీకాత్మక చిత్రం)

Squid Game cryptocurrency: ఏదైనా కాస్త పాపుల‌ర్ అయితే చాలు దాని పేరుమీద జ‌నాల‌ను మోసం చేయ‌డం సాధార‌ణ‌మైపోయింది. అంత‌ర్జాతీయంగా స్క్విడ్ గేమ్ (Squid Game) వెబ్ సిరీస్ ఎంతో పేరు తెచ్చుకొంది. ఇదే అద‌నుగా ఆ పేరుతో క్రిప్టో క‌రెన్సీని రూపొందించి కొద‌రు జ‌నాల నుంచి భారీగా డ‌బ్బులు సేక‌రించారు. ఇప్ప‌డు ఆ క్రిప్టో క‌రెన్సీ విలువ జీరోగా మార‌డంతో మోస‌పోవ‌డం జ‌నం వంతైంది.

ఇంకా చదవండి ...

  ఏదైనా కాస్త పాపుల‌ర్ అయితే చాలు దాని పేరుమీద జ‌నాల‌ను మోసం చేయ‌డం సాధార‌ణ‌మైపోయింది. అంత‌ర్జాతీయంగా స్క్విడ్ గేమ్ (Squid Game) వెబ్ సిరీస్ ఎంతో పేరు తెచ్చుకొంది. చాలా మందిని ఆక‌ట్టుకొంటూ విజ‌య‌వంతంగా ఎంతో మందికి రీచ్ అవుతోంది. ఇదే అద‌నుగా కొంద‌రు నేర‌గాళ్లు 'స్క్విడ్‌ క్రిప్టోకరెన్సీ'  (Squid Game cryptocurrency) పేరుతో ఏర్పాటైన క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. ప్రారంభించిన వారంలోనే కరెన్సీ భారీ ఎత్తున లాభాల్ని తెచ్చి పెట్టినా.. ఇప్పుడు భారీగా నష్టపోతున్నారు. ఈ క్రిప్టో క‌రెన్సీ (Crypto Currency) విలువ ఇప్పుడు జీరోగా మారింది. దీంతో దాదాపు రూ.25కోట్ల మేర పెట్టుబ‌డి దారులు న‌ష్ట‌పోయారు.

  ఏం జ‌రిగింది..

  - అంత‌ర్జాతీయంగా ప్ర‌స్తుతం స్క్విడ్‌ గేమ్‌ (Squid Game) కు ప్రజాద‌ర‌ణ బాగుంది.

  - దీంతో కొంద‌రు స్క్విడ్ గేమ్ క్రిప్టో క‌రెన్సీనీ ఏర్పాటు చేశారు. ఇందులో పెట్టుబడి పెడితే లాభాల్ని అర్జించవచ్చిన ఊదరగొట్టారు.

  Squid Game : ఎందుకింత క్రేజ్‌.. ఏముందీ ఈ "స్క్విడ్ గేమ్‌"లో..


  - పలువురు భారీగా పెట్టుబడులు పెట్టారు. ప్లాన్‌ ప్రకారం ఇన్‌స్టంట్‌ గా కాయిన్‌ వ్యాల్యూని పెంచారు. ఆ వ్యాల్యూ పెరగడంతో పెట్టుబడులు ఎక్కువయ్యాయి.

  - అంతే అదును చూసిన మోసగాళ్లు మొత్తం డబ్బును కాజేసి కరెన్సీ వ్యాల్యూని జీరోకి తగ్గించారు. దీంతో పెట్టుబ‌డి దారులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు.

  మోసం విలువ రూ.25 కోట్లు

  చాలా మంది మార్కెట్ నిపుణులు క్రిప్టో కరెన్సీ (Crypto Currency) పేరుతో జరుగుతున్న మోసాల్ని గుర్తించాలని హెచ్చరిస‍్తున్నారు. స్క్విడ్‌ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ గరిష్టంగా $2,861 చేరిన తరువాత ఆ వ్యాల్యూ కాస్తా సడెన్‌ $0కి పడిపోయింది. దీంతో పెట్టుబడిదారులు సుమారు రూ.25.3కోట్లు నష్టపోయారు. అస‌లు కాయిన్‌ మార్కెట్‌ క్యాప్‌ లెక్కల ప్రకారం స్క్విడ్‌ క్రిప్టో కరెన్సీ విలువ అక్టోబర్‌ 26న $0.01236 నుంచి అక్టోబర్‌ 29కి $4.5 కి చేరింది. దీంతో కేవలం 100 గంటల్లో మదుపర్లు రూ.1000 నుంచి రూ.3,43,850 లక్షల వరకు సంపాదించారు.

  Food Crisis : ఆహార సంక్షోభంలోకి ఆ రెండు దేశాలు.. ఇప్పుడు ఏం చేయ‌నున్నాయి


  ఆ లాభాలు ఎక్కువయ్యేసరికి పెట్టుబడుల్ని భారీగా పెంచారు. కానీ ఇప్పుడు ఆ కరెన్సీ వ్యాల్యూ జీరో (Value Zero)కి పడిపోవడంతో పెట్టుబడిదారులు భారీగా నష్టపోయారు.

  ఎలా చేశారు..

  సెప్టెంబర్‌ 17న విడుదలై 90 దేశాల్లో విడుద‌ల అయిన స్క్విడ్ గేమ్ సిరీస్‌ (Series)ను వారం రోజుల్లోనే 3.26 బిలియన్‌ మినిట్స్‌ వీక్షించారని ఫోర్బ్స్ లెక్క‌లు చెబుతున్నాయి. ఇదే అద‌నుగా భావించిన కొంద‌రు SquidGame.cash పేరుతో వెబ్‌సైట్‌ను తెరిచారు. ఇందులో పెట్టుబ‌డి పెడితే భారీగా లాభాలు వ‌స్తాయ‌ని ఊద‌ర‌గొట్టారు. దీంతో జ‌నం పెట్టుబ‌డి పెట్ట‌డం న‌ష్ట‌పోవ‌డం జ‌రిగింది.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Cryptocurrency, ONLINE CYBER FRAUD

  ఉత్తమ కథలు