• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • SPIDERMAN YOUNG GIRL LARA MASON CREATES SURREAL SPIDER MAN CAKE NETIZENS ENJOY WATHING MAKING VIDEOS NK GH

Spiderman: కొరుక్కు తినేయాలనిపించే స్పైడర్‌మ్యాన్... వైరల్ వీడియోలు

Spiderman: కొరుక్కు తినేయాలనిపించే స్పైడర్‌మ్యాన్... వైరల్ వీడియోలు

Spiderman: కొరుక్కు తినేయాలనిపించే స్పైడర్‌మ్యాన్... వైరల్ వీడియోలు (image credit - instagram)

Spiderman: ఇప్పటివరకూ మనం ఎన్నో రకాల స్పైడర్‌మ్యాన్లను చూశాం. ఇది మరో రకం. చాలా ప్రత్యేకమైనది. సూపర్‌మేన్లు, సూపర్ ఉమన్లకే కాదు... అందరికీ నచ్చేస్తోంది. ఆ వైరల్ వీడియోలు చూద్దాం.

  • Share this:
Spiderman: స్పైడ‌ర్‌మ్యాన్ గురించి ప్రపంచంలో తెలియ‌నివారంటూ లేరంటే నమ్మాల్సిందే. అందులోనూ పిల్లలకైతే `స్పైడ‌ర్‌మ్యాన్` మాట వినగానే ఎక్కడలేని హుషారు వ‌చ్చేస్తుంది. మార్కెట్లో ఆ క్యారెక్టర్‌ను నమ్ముకొని ఎంతో బిజినెస్ జరుగుతోంది. అందుకే పిల్లలు వాడే ప్రతి వస్తువూ స్పైడ‌ర్‌మ్యాన్ బొమ్మతో వ‌చ్చేస్తున్నాయి. ఈ పాపులారిటీని కొత్త పద్ధతిలో క్యాష్ చేసుకుంటోంది ఓ యువతి. ఆమె నిజ‌మైన స్పైడ‌ర్‌మ్యాన్‌లా కనిపించే కేక్‌ను త‌యారుచేసింది. తలకిందులుగా వేలాడుతున్న స్పైడర్‌ మ్యాన్ కేకును అద్భుతంగా రూపొందించింది లారా మేస‌న్. దీన్ని తయారు చేసే పద్ధతిని, ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఇప్పుడు ఇది వైరల్‌ అవుతోంది.

ఇంట‌ర్నెట్‌లో హోమ్ బేక‌ర్స్ చేసే చాలా ర‌కాల కేకుల‌ వీడియోలు నెటిజన్లను అలరిస్తున్నాయి. లారా మేస‌న్ చేసిన ఈ స్పైడర్‌మ్యాన్ కేకు కూడా ఇలాంటి వాటిలో ఒకటిగా మారింది. మొద‌టిసారి దీన్ని చూసేవారు.. ఇది ఒక కేకు అంటే నమ్మలేరు. అంత వాస్తవికత ఉట్టిపడేలా దీన్ని తయారుచేసింది లారా. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.



ఈ వీడియోకి ఇన్‌స్టాగ్రామ్‌లో వేల‌ల్లో లైక్‌లు, వంద‌ల్లో కామెంట్‌లు వస్తున్నాయి. లారా పనితనాన్ని ఇన్‌స్టా యూజర్లు మెచ్చుకుంటున్నారు. సూప‌ర్-డూప‌ర్‌ స్పైడ‌ర్ మ్యాన్ అంటూ కామెంట్లతో ప్రశంసలు కురిపిస్తున్నారు.






ఈ వీడియోను తాను నిర్వహిస్తున్న cakeanything_laramason ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది లారా మేస‌న్. మొదటి వీడియోలో కేకును రూపొందించిన విధానం తెలిపింది. ముందు లేయ‌ర్లుగా ఉన్న కేక్‌ రూపాన్ని చెక్కుతూ కనిపించింది. బేస్ సిద్ధం చేసిన తరువాత చాక్లెట్, క్రీమ్‌తో స్పైడర్‌ మ్యాన్ కేకుకు తుదిరూపం ఇచ్చింది. ఫినిషింగ్ కోసం చాక్లెట్ ఫ్రోస్టింగ్‌ని వినియోగించింది.

ఇది కూడా చదవండి: Anti-Inflammatory Foods: శరీరంలో వేడి పెరుగుతోందా... ఈ ఆహారం తీసుకోండి

తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వినూత్నంగా రూపొందించిన కేకుల తయారీ వీడియోలు ఎన్నో ఉన్నాయి. మే 5న పోస్ట్ చేసిన తాజా వీడియోకి ఇప్పటికే 31 వేలకు పైగా లైకులు వచ్చాయి. ఈ వీడియోలో కేకు బేస్‌ను మాత్రమే సిద్ధం చేసింది. పూర్తయిన కేకును మరో పోస్ట్‌లో షేర్ చేసింది.
Published by:Krishna Kumar N
First published:

అగ్ర కథనాలు