హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

తల్లిదండ్రుల్ని వదిలేస్తే నెలకు రూ.21వేలు -యువత కోసం సర్కారు సరికొత్త పథకం -ఇవే అర్హతలు..

తల్లిదండ్రుల్ని వదిలేస్తే నెలకు రూ.21వేలు -యువత కోసం సర్కారు సరికొత్త పథకం -ఇవే అర్హతలు..

యువతకు కొత్త పథకం

యువతకు కొత్త పథకం

తల్లిదండ్రులకు బిడ్డలు భారమా? అంటే, కరోనా అనంతర ఆధునిక యుగంలో ఆల్మోస్ట్ అవుననే సమాధానం వినిపిస్తోంది. పేద ప్రజలకు కుటుంబ వ్యవస్థ మోయలేని భారంగా తయారైంది. కరోనా దెబ్బకు నిరుద్యోగ రేటు, అద్దెలు పెరిగడంతో మూడు పదులు దాటినా యువతరం తల్లిదండ్రులపై ఆధారపడుతున్నారు. దీంతో ప్రభుత్వమే పరిష్కార మార్గాలను అణ్వేషించి..

ఇంకా చదవండి ...

భారతీయులమైన మనకు కుటుంబ వ్యవస్థలోని కాంప్లెక్సిటీలు తెలియనివి కావు. సరదాగా చెప్పుకునే ఇంటింటి రామాయణంలో ఫ్యామిలీ డ్రామాకు కొదువ ఉండదు. ‘ఏళ్లొచ్చినా ఇంటిమీదే పడి తింటున్నారు..’అని పిల్లల్ని తిట్టిపోసే పేరెంట్స్ ఉన్నట్లే.. ‘ఈ ముసలోళ్లను చూసుకోవడం మా వల్ల కాదు బాబోయ్..’అనే యువత విరక్తి వాక్యాలూ మనకు కొత్తకాదు. అయితే, సమస్యgovt schలు ఎంత తీవ్రమైనవైనా తల్లికిబిడ్డ ఏనాడూ భారం కాదనుకునే ఫిలాసఫీ మనది. ఆక్రమంలో చాలా సార్లు తల్లిదండ్రులు, కొన్ని సార్లు పిల్లలూ గొప్ప గొప్ప త్యాగాలకు పోతుంటారు. మొత్తం విషయంలో ప్రభుత్వ జోక్యం అనే మాటే రాదు. కాగా, అభివృద్ధి చెందిన స్పెయిన్ దేశంలో మాత్రం సీన్ మరోలా ఉంది..

తల్లిదండ్రులకు బిడ్డలు భారమా? అంటే, కరోనా అనంతర ఆధునిక యుగంలో ఆల్మోస్ట్ అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రధానంగా యూరప్ దేశాల్లోని పేద ప్రజలకు కుటుంబ వ్యవస్థ మోయలేని భారంగా తయారైంది. కరోనా దెబ్బకు స్పెయిన్ లో నిరుద్యోగ రేటు అమాంతం పెరిగింది. మూడు పదుల వయసు దాటినా ఉద్యోగం లేక పిల్లలు పేరెంట్స్ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి. కొద్దో గొప్పో సంపాదించేవాళ్లు.. పెరిగిన అద్దెలు కట్టలేక భార్యాపిల్లలతో కలిసి తల్లిదండ్రుల పంచన చేరుతున్నారు. ఈ పరిణామాలు తల్లిదండ్రులకు మోయలేని భారంగా తయారైంది. దీంతో ప్రభుత్వమే పరిష్కార మార్గాలను అణ్వేషించి..

తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా, వారికి దూరంగా బతికే పిల్లలకు ప్రతినెలా 250 పౌండ్లు(మన కరెన్సీలో దాదాపు రూ.21వేలు) అందజేయాలని స్పెయిన్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దేశంలో తల్లిదండ్రులపై ఆధారపడుతోన్న యువత సంఖ్య పెరుగుతుండటం, కరోనా సంక్షోభం కారణంగా అద్దెలు కట్టలేని దుస్థితి దాపురించడం తదితర కారణాల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం యువత కోసం ప్రత్యేకంగా అద్దె పథకాన్ని రూపొందించింది.

స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ పథకం తీరుతెన్నులు, అర్హతల గురించి వివరించారు. తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండాలనుకునే యువతకు ప్రతినెలా 250పౌండ్లు డబ్బులిస్తామని, వాటిని అద్దె కోసం మాత్రమే ఖర్చు పెట్టాల్సి ఉంటుందని ప్రధాని చెప్పారు. నిరుద్యోగులు, వార్షిక ఆదాయం 23వేల పౌండ్లలోపు ఉన్న, 18 నుంచి 35 ఏళ్లలోపు వారు ఈ పథకానికి అర్హులు అవుతారని ప్రధాని వెల్లడించారు. తల్లిదండ్రుల్ని వదిలేసే పిల్లలకు ఇచ్చే అద్దె పథకానికి సంబంధించి త్వరలోనే మరింత లోతైన, స్పష్టమైన విధివిధానాలు ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

‘హౌజింగ్‌ ప్లాన్‌’పేరుతో స్పెయిన్ రూపొందించిన ఈ పథకం ఎలాంటి సత్ఫలితాన్నిస్తుందో చూడాలి. తల్లిదండ్రులకు భారం కాకుండా వాళ్ల నుంచి విడిగా బతికే యువతకు ఆర్థిక సహాయం అందిస్తామంటూ స్పెయిన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకంపై యూరప్ దేశాల్లో చర్చ మొదలైంది. కుటుంబాలకు సంబంధించి స్పెయిన్ లాంటి పరిస్థితులే ఇటలీ, గ్రీస్ లోనూ ఉన్నాయి. ఆ దేశాల సంగతి అలా ఉంటే, మన దేశంలో పెద్దలకు వృద్ధాప్య పెన్షన్లు, యువతకు నిరుద్యోగ భృతి లాంటి పథకాలు కుటుంబ వ్యవస్థను మరీ ఇబ్బందుల్లో పడేయకుండా కాపాడినట్లేకదా..

First published:

Tags: House, Spain

ఉత్తమ కథలు