Mars : హడలెత్తించిన స్పేస్ ఎక్స్ మార్స్ ప్రయోగం... టెక్సాస్‌లో కలకలం

SpaceX : సాధారణంగా... అంతరిక్ష ప్రయోగాలు చేసే వేదికలు... ప్రజా నివాసాలకు దూరంగా ఉంటాయి. స్పేస్ ఎక్స్ సంస్థ మాత్రం... ప్రజలకు దగ్గర్లోనే ప్రయోగ కేంద్రాన్ని నిర్మించి... కలకలం రేపుతూ... కలవరం కలిగిస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 28, 2019, 2:15 PM IST
Mars : హడలెత్తించిన స్పేస్ ఎక్స్ మార్స్ ప్రయోగం... టెక్సాస్‌లో కలకలం
గాల్లోకి లేచిన ప్రోటోటైప్ (Image : Twitter - SpaceX)
  • Share this:
Mars : ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాల సంస్థ స్పేస్ ఎక్స్... మంగళవారం మార్స్ రాకెట్ ప్రోటోటైప్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించింది. టెక్సాస్‌లో జరిగిన ఈ ప్రయోగం... అక్కడి స్థానికులకు నిద్రలేకుండా చేసింది. స్టార్ హోపర్‌గా పిలిచే ప్రోటోటైప్... బ్రౌన్‌విల్లేలో... లాంచ్ ప్యాడ్ నుంచీ నెమ్మదిగా గాల్లోకి లేచింది. 500 అడుగుల ఎత్తుకు దూసుకెళ్లింది. ఆ తర్వాత... 650 అడుగుల ఎత్తువరకూ... స్వయంగా ఎగరగలిగింది. నెక్ట్స్ జనరేషన్ రాప్టర్ ఇంజిన్ కలిగిన ఆ ప్రోటోటైప్... మొత్తానికి సక్సెస్ అయినట్లే కనిపించింది. ఆ రాప్టర్‌ను... స్పేస్ ఎక్స్ సంస్థ చీఫ్ ఎలన్ మస్క్... స్టార్ షిప్ రాకెట్‌ కోసం తయారుచేయించారు. ఆ రాకెట్... స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే పెద్దది. మార్స్ చెంతకు మనుషుల్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఎలన్ మస్క్... అందుకోసం బలమైన బలమైన రాప్టర్ ఇంజిన్లను తయారుచేయిస్తున్నారు.



స్పేస్ ఎక్స్ ప్రయోగ కేంద్రానికి మైలు దూరంలో ఉన్న గ్రామంలో... దాదాపు డజన్ మంది నివసిస్తున్నారు. స్థానిక అధికారులు వాళ్లందర్నీ అక్కడి నుంచీ వెళ్లిపోమని హడావుడి చేశారు. పెద్ద ఎత్తున పోలీస్ సైరన్లు మోగించారు. ఇదంతా రాకెట్ ప్రోటోటైప్ ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందే జరిగింది. ఐతే... స్థానికులు పోలీసుల మాట వినలేదు. అప్పటికప్పుడు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోమంటే... ఎక్కడికి వెళ్తామని ఎదురు ప్రశ్నించారు. ఏం జరిగినా సరే... ఇళ్లను వదిలేది లేదంటూ... ఇళ్లలోనే డోర్లూ, కిటికీలూ మూసుకొని ఉండిపోయారు. లక్కీగా ప్రయోగం తలకిందులు కాకపోవడంతో... ఎవరికీ ఏ హానీ జరగలేదు.

తమ ఇళ్లకు దగ్గర్లోనే స్పేస్ ఎక్స్ సంస్థ ఉండటం స్థానికులకు తలనొప్పిగా మారింది. అంతరిక్ష ప్రయోగాలు జరుపుతున్న ప్రతిసారీ దగ్గర్లోని సముద్రానికి వెళ్లకుండా... బీచ్ మూసేస్తుండటంపై ఎప్పటి నుంచో అభ్యంతరాలు వినిపిస్తున్నాయి.



ఇవి కూడా చదవండి :

సింధు బయోపిక్‌లో నా రోల్‌ని అక్షయ్ కుమార్ చేస్తే బాగుంటుంది : పుల్లెల గోపీచంద్

Health : దురద ఎందుకు వస్తుంది? ఇవీ సైంటిఫిక్ కారణాలు?

Health : పొట్టను తగ్గించే ఇంటి చిట్కాలు... ఇలా చెయ్యండి

Published by: Krishna Kumar N
First published: August 28, 2019, 2:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading