Space Events : 2022లో కొన్ని ఖగోళ అద్భుతాలు చూసే అవకాశం కలిగింది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన కొన్ని అంతరక్షిత ఇమేజ్‌లు ఆశ్చర్యపరిచాయి. DART మిషన్ ఒక గ్రహశకలాన్ని కొత్త కక్ష్యలోకి తీసుకెళ్లింది. ఆర్టెమిస్ I చంద్రుడిపైకి వెళ్లే ప్రయత్నాలను మరోసారి రుజువు చేసింది. చైనా కొత్త అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడం పూర్తి చేసింది. SpaceX 12 నెలల్లో 61 రాకెట్లను ప్రయోగించింది. అదే విధంగా ఉక్రెయిన్ దండయాత్రతో రష్యా అంతరిక్ష ప్రయోగాలు తగ్గిపోయాయి. అయితే 2023లో మరిన్ని ప్రయోగాలకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉన్నాయి. చాలా ఖగోళ వింతలను మానవులు చూసే అవకాశం ఉంది. ఇలాంటి ఈవెంట్‌లను మిస్ కాకుండా.. ఏ తేదీల్లో ఏవి చోటు చేసుకునే అవకాశం ఉందో తెలుసుకోండి..
మార్చి: లూనార్ ల్యాండర్
వ్యోమగాములు, కార్గోను కక్ష్యలోకి తీసుకువెళ్లడానికి అంతరిక్ష నౌకలను నిర్మించడం కోసం NASA ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడింది. చంద్రునికి సమీపంలో ఉన్న స్క్రోటర్స్ వ్యాలీకి ల్యాండర్‌ను పంపడానికి NASA తన వాణిజ్య భాగస్వామి అయిన ఇట్యుటివ్ మిషన్స్‌ను ఎంపిక చేసింది. IM-1 మిషన్ సమయంలో.. NOVA-C అని పేర్కొనే ల్యాండర్ రాకెట్ ఎగ్జాస్ట్, అంతరిక్ష వాతావరణం చంద్రుని ఉపరితలంపై ఎలా ప్రభావం చూపుతుందో అధ్యయనం చేస్తుంది. ఈ మిషన్ ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగిస్తారు. ఇది మార్చ్ 2023లో చోటు చేసుకోనుంది.
మార్చి: ఐస్ మైనింగ్ మెషిన్
చంద్రుని ఉపరితలంపై టూల్స్, ప్రయోగాలను అందించడానికి NASA మరొక వాణిజ్య భాగస్వామి అయిన ఆస్ట్రోబోటిక్‌ను ఎన్నుకుంది. పెరెగ్రైన్-1 మిషన్ 2023 మొదటి త్రైమాసికంలో ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి యునైటెడ్ లాంచ్ అలయన్స్ వల్కాన్ సెంటార్ రాకెట్‌లో ప్రయాణిస్తుంది. పెరెగ్రైన్ అనేది ఆస్ట్రోబోటిక్ ల్యాండర్‌కు ముందు ప్రయోగం. దీని ద్వారా NASA వారి VIPER రోవర్‌ను చంద్రునిపై మంచు డ్రిల్ చేయడానికి పంపుతుంది. U.S. స్పేస్ ఏజెన్సీకి చెందిన పరికరాలను ఇది తీసుకువెళుతుంది. 2024 లక్ష్యంగా పెట్టుకున్న సిబ్బంది
స్పేస్ ఎక్స్ స్టార్ షిప్:
400 అడుగుల పొడవుతో SpaceX స్టార్‌షిప్ పూర్తిగా రీ యూజ్ చేసే స్టెయిన్‌లెస్ స్టీల్ కాంట్రాప్షన్. NASA మెగా మూన్ రాకెట్ కంటే రెండు రెట్లు ఎక్కువ ప్రయోగ శక్తిని కలిగి ఉంటుంది. స్టార్‌షిప్ అనేది ఒక సూపర్-హెవీ-క్లాస్ రాకెట్, స్పేస్‌షిప్. ఇది NASA తన భవిష్యత్ మూన్ ఆర్బిట్ స్థావరం నుంచి చంద్రుని ఉపరితలం వరకు వ్యోమగాములను షట్లింగ్ చేయడానికి ఉపయోగించాలని యోచిస్తోంది. అంగారక గ్రహంపై ఒక స్థావరాన్ని నిర్మించడానికి స్టార్‌షిప్‌ల సముదాయాన్ని ఉపయోగించాలనే ఎలోన్ మస్క్ ఆలోచనకు ఇది అదనపు ఆలోచన.
ఏప్రిల్: మూన్ బౌండ్
అన్ని క్రూలెస్ మూన్ మిషన్‌లు ఫ్లోరిడా స్పేస్ కోస్ట్ నుండే బయలుదేరవు. జపనీస్ స్పేస్ ఏజెన్సీ అకా JAXA, ఒక చిన్న ఎక్స్‌ప్లోరర్‌తో అడ్వాన్స్‌డ్ ప్రిసిషన్ ల్యాండింగ్‌ను ప్రదర్శించడానికి చంద్ర ఉపరితలంపైకి తన సొంత ల్యాండర్‌ను పంపుతుంది. ఈ SLIM మిషన్ స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్‌కి సంక్షిప్తంగా, వివిధ పేలోడ్‌లను మోసుకెళ్లే రైడ్‌షేర్ ఫ్లైట్. జపాన్‌లోని తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించాలని భావిస్తున్నారు.
ఇండియా మూన్ మిషన్ 2023:
2019లో చంద్రయాన్-2 మిషన్ విఫలమైంది. చంద్రుని దక్షిణ ధ్రువంలోని ఎత్తైన ప్రాంతాలకు ల్యాండర్, రోవర్‌ను పంపడానికి భారతదేశ అంతరిక్ష సంస్థ మళ్లీ ప్రయత్నిస్తుంది. 2023 మధ్యలో షెడ్యూల్ చంద్రయాన్-3 మిషన్ చేపట్టనుంది. తొలుత విఫలమైన రోవర్‌ను ఉపయోగించాలని యోచిస్తోంది. శ్రీహరికోటలోని లాంచ్ ప్యాడ్ నుంచి LVM 3 హెవీ-లిఫ్ట్ రాకెట్ ద్వారా ప్రయోగం జరుగుతుంది.
జూన్: NASA మూన్ రోవర్
తన కాంట్రాక్టర్ అయిన ఇంట్యుటివ్ మెషీన్స్‌కి సంవత్సరం తర్వాత చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గరకు రోవర్‌ని పంపే అదనపు బాధ్యత NASA అప్పగించింది. IM-2 లేదా ప్రైమ్-1గా పేర్కొనే ఈ మిషన్ డ్రిల్ మాస్ స్పెక్ట్రోమీటర్‌ను ల్యాండ్ చేయడం, పరీక్షించడం ప్రధానం. ఇది ఒక పదార్థంలోని కణాల రకాలను గుర్తించే పరికరం. ప్రస్తుతం ప్రణాళిక ప్రకారం మరో అంతరిక్ష నౌక, NASA లూనార్ ట్రైల్‌బ్లేజర్ ఈ నౌకలో ప్రయాణించనుంది. చిన్న ఉపగ్రహం చంద్రుని కక్ష్యలో చంద్రుని నీటి స్థానాలను మ్యాప్ చేస్తుంది. ఈ మిషన్ స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌లో జూన్ కంటే ముందుగా ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి మొదలవుతుంది.
జులై:
1991లో కుప్పకూలిన మాజీ సోవియట్ యూనియన్ చంద్రునిపైకి అనేక రోబోటిక్ అంతరిక్ష నౌకలను పంపింది. అయితే రాబోయే లూనా 25 సోవియట్ అనంతర రష్యన్ చరిత్రలో మొదటి చంద్ర మిషన్ అవుతుంది. రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ ల్యాండర్‌ను చంద్రుని దక్షిణ ధ్రువంలోని ఒక ప్రాంతానికి పంపాలనుకుంటోంది. ఇది చంద్రుని నేల మరియు వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. ల్యాండింగ్ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. కజకిస్తాన్‌లోని వోస్టోచ్నీ కాస్మోడ్రోమ్ లాంచ్ ప్యాడ్ నుంచి సోయుజ్-2 రాకెట్ ద్వారా ప్రయోగించనుంది.
అక్టోబర్: NASA మెటల్ ఆస్ట్రాయిడ్
మార్స, బృహస్పతి మధ్య గ్రహశకలం బెల్ట్‌లో, ఎక్కువగా లోహంతో తయారైన వస్తువు ఉంది. దాన్ని గ్రహం మిగిలిపోయిన కోర్, సైక్ అని పిలుస్తారు. అదే పేరుతో NASA అధ్యయనం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్పేస్‌క్రాఫ్ట్ సాఫ్ట్‌వేర్ ఆలస్యంగా వచ్చినందున 2022లో షెడ్యూల్ చేయాల్సిన ప్రయోగం వాయిదా పడింది. ఈ మిషన్ ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ హెవీ రాకెట్ నుంచి ప్రారంభం అవుతుంది. మొదట అనుకున్నదానికంటే మూడేళ్ల తర్వాత 2029లో గ్రహశకలం చుట్టూ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది.
మిషన్ టూ జ్యూపిటర్
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ జ్యూపిటర్ పైకి ఒక మిషన్ చేపట్టనుంది. ESA దక్షిణ అమెరికా ఖండంలోని ఫ్రెంచ్ గయానాలోని తన అంతరిక్ష నౌకాశ్రయం నుంచి Ariane 5 రాకెట్‌లో అంతరిక్ష నౌకను ప్రయోగించాలనుకుంటోంది. ఏడేళ్ల అంతరిక్ష యాత్ర తర్వాత ఇది 2031లో జ్యూపిటర్ చుట్టూ ప్రదక్షిణ చేయడానికి భూమి, వీనస్ నుంచి గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుంటుంది.
Astro wealth : ఈ మూడు రాశుల వారికి ఏడాదంతా తిరగులేని అదృష్టం..పట్టిందల్లా బంగారమే
2023లో ఇతర మిషన్స్:
2023 జూన్‌లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ బెపి-కొలంబో మిషన్ దాని మూడో మెర్క్యురీ ఫ్లైబైని ప్రయోగించే యోచనలో ఉంది. ఆగస్ట్ 21న NASAకి చెందిన పార్కర్ సోలార్ ప్రోబ్ తన సూర్య-అధ్యయన మిషన్‌లో ఆరో వీనస్‌ను ప్రయోగిస్తుంది. సెప్టెంబరు 24న NASAకు చెందిన OSIRIS-రెక్స్ మిషన్ కార్బన్ ఆధారిత గ్రహశకలం బెన్నూకు సుదీర్ఘ ప్రయాణం తర్వాత భూమికి తిరిగి వస్తుంది. అక్టోబర్‌లో నమూనాలను సేకరించిన అంతరిక్ష నౌక సాల్ట్ లేక్ సిటీకి పశ్చిమాన ఉన్న ఉటా టెస్ట్ అండ్ ట్రైనింగ్ రేంజ్‌లో ల్యాండ్ అవుతుందని భావిస్తున్నారు.
2023లో జరిగే వింతలు:
* జనవరి 4వ తేదీన భూమి సూర్యుడికి అత్యంత దగ్గరగా వస్తుంది.
* ఫిబ్రవరి 1 స్పేస్ షటిల్ కొలంబియా డిజాస్టర్‌కు 20 సంవత్సరాలు పూర్తవుతుంది.
* మార్చి 20న వసంతకాలం ప్రారంభమై పగలు రాత్రి సమానంగా ఉండడం గమనించవచ్చు.
* ఏప్రిల్ 20న మొదటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఏప్రిల్ 22 నుంచి 23 మధ్య ఉల్కలు పడటం ఎక్కువగా ఉంటుంది. సుమారు గంటకు 18 వరకు ఆకాశంలో మనం చూడవచ్చు.
* మే 5-6 మధ్య ఈట ఆక్వారిడ్స్ ఉల్కలు అధికంగా ఉంటాయి.
* జూన్ 21న ఉత్తర గోళంలో వేసవికాలం ప్రారంభం. * జులై 6న భూమి సూర్యుడికి అత్యంత దూరంగా వెళుతుంది.
* జులై 30-31 మధ్య సదరన్ డెల్టా ఆక్వారిడ్ ఉల్కలు అధికంగా ఉంటాయి.
* ఆగస్టు 12, 13 మధ్య పర్సిడ్స్ ఉల్కలు ప్రభావం చూపిస్తాయి.
* సెప్టెంబర్ 23న శరదృతువు ప్రారంభమై పగలు రాత్రి సమానంగా ఉంటాయి.
* అక్టోబర్ 14న రెండో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. * నవంబర్ 17- 18 మధ్య లియోనిడ్స్ ఉల్కలు అధికంగా ఉంటాయి.
* డిసెంబర్ 2-3 మధ్య ఆండ్రో మెడిడ్స్ ఉల్కలు కనిపిస్తాయి.
* డిసెంబర్ 13, 14 మధ్య జెమినిడ్స్ ఉల్కలు అధికంగా ఉంటాయి.
* డిసెంబర్ 21న శీతాకాలం ప్రారంభమవుతుంది. * డిసెంబర్ 22, 23 మధ్య ఉర్సిడ్స్ అధికంగా కనిపిస్తాయి.
ఉల్కలు చూడాలనుకునే వారికి ఈ సంవత్సరం మంచి అవకాశం దక్కుతుంది. ఆకాశంలో అద్భుతాలు జరుగుతాయి. చంద్రుడు ప్రకాశవంతంగా వెలుగుతూ కొత్త తరహాగా కనిపిస్తూ ఉంటాడు. వెలుతురికి దూరంగా సిటీ బయటకు వచ్చి చూస్తే ఈ ఉల్కలు రాలడం మనం గమనించవచ్చు. సూర్యుని చుట్టూ తిరిగే మంచుతో కూడిన తోకచుక్కలు లేదా రాతి గ్రహశకలాలు వదిలిపెట్టిన శిథిలాలు క్షేత్రాలలోకి మన భూ గ్రహం చేరినప్పుడు ఉల్కాపాతం సంభవిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.