హద్దు దాటిన రష్యా మిలిటరీ విమానాలపై దక్షిణకొరియా కాల్పులు

హద్దు దాటిన రష్యా మిలిటరీ విమానాలపై దక్షిణకొరియా కాల్పులు

ప్రతీకాత్మక చిత్రం

తమ గగనతలంలోకి ప్రవేశించిన రష్యా మిలిటరీ విమానాలను హెచ్చరిస్తూ దక్షిణకొరియా మిలిటరీ దళాలు వందలాది సార్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

  • Share this:
    తమ శత్రుదేశాలైన ఉత్తరకొరియా, చైనాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న రష్యాపై దక్షిణ కొరియా సంచలన ఆరోపణలు చేసింది. మొట్ట మొదటి సారిగా రష్యా మిలిటరీ విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశించినట్లు ఆరోపించింది. ఈ మేరకు రష్యా మిలిటరీ తీరుపై సియోల్‌లోని దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ మండిపడింది. మంగళవారంనాడు గగనతల హద్దులను ఉల్లంఘించిన రష్యా మిలిటరీ విమానానికి హెచ్చరికలు చేస్తూ...వందల సంఖ్యలో కాల్పులు జరిపినట్లు వెల్లడించింది.

    చైనాకు చెందిన రెండు బాంబర్స్‌తో పాటుగా రష్యా‌కు చెందిన రెండు బాంబర్ జెట్స్ దక్షిణ కొరియా గగనతలంలోకి ప్రవేశించాయన్నది ద.కొరియా ఆరోపణ. అయితే తాము దక్షిణ కొరియా గగనతలంలోకి ప్రవేశించామన్న ఆరోపణలను రష్యా తోసిపుచ్చింది. దక్షిణ కొరియా రక్షణ విమాన పైలెట్లే అతిగా ప్రవర్తించారని రష్యా మిలిటరీ ఆరోపించింది.
    First published: