Krishna Kumar NKrishna Kumar N
|
news18-telugu
Updated: August 21, 2019, 11:46 AM IST
కింకాజౌ (Image : YT - Inside Edition)
ఫ్లోరిడాలోని ఓ ఇంటి నుంచీ అటవీ అధికారులకు కాల్ వచ్చింది. వాట్ హ్యాప్పెండ్ అని అడిగారు. ఏదో వింత జీవి... తన ఇంట్లోకి చొరబడి... తనపై దాడి చేసిందని చెప్పాడు అతను. నిజమా... వెంటనే వస్తున్నాం... అని అడ్రెస్ తెలుసుకొని... అతని ఇంటికి వెళ్లారు. ఇంటి డోర్... ఏదో పందికొక్కు కొరికేసినట్లుగా ఉంది. అధికారులను చూసిన బాధితుడు... సార్... ఈ డోర్‌ని ఇలా కొరికేసింది ఆ జంతువే అన్నాడు. అవునా... అంత దారుణంగా ఉందా అది... అంటూ అధికారులు... గన్స్ బయటకు తీశారు. వెంటనే అతను... గన్స్ అవసరం లేదు సార్... నేను దాన్ని తెలివిగా బంధించగలిగాను. బట్... అప్పటికే అది నాపై దాడి చేసి... ఇదిగో ఇలా రక్కేసింది... అంటూ అతను ఆ జీవి చేసిన దారుణాన్ని చూపించాడు. కాస్త ఊపిరి పీల్చుకున్న అధికారులు... గన్స్ లోపల పెట్టుకొని... ఇంట్లోకి బయల్దేరారు.
వాళ్లను ఇంట్లోకి తీసుకెళ్లిన అతను... సార్... దాన్ని బాత్రూంలో బంధించాను అని చెప్పాడు. ఆ బాత్రూంకి కిటికీ ఉండటంతో... వాళ్లు ఆ కిటికీ లోంచీ ఆ వింత జీవి ఏంటా అని చూశారు. అరే... ఇది కింకాజౌ అన్నాడో అధికారి. కింకాజౌవ్వా... అదేంటి సార్ అని అడిగాడు బాధితుడు. ఇది అరుదైన జంతువు. దాదాపు రక్కూన్ (ఎలుక, ఉడుతను పోలిన జంతువు) లాంటిది. ఇక్కడ చుట్టుపక్కల అడవి ఏదీ లేదు కదా... ఇది నీ ఇంట్లోకే ఎందుకొచ్చింది? అని ఆశ్చర్యపోయారు అధికారులు. అందుకు కారణం నేనే సార్ అంటూ వారికి ఓ కథ చెప్పాడు.
"నేను నిన్న ఫ్లోరిడా లేక్ వర్త్ బీచ్‌కి వెళ్లాను. అక్కడ ఈ జంతువు కనిపించింది. జాలి పడి దీనికి పుచ్చకాయ ముక్క ఇచ్చాను. ఆ తర్వాత నా దారిన నేను ఇంటికి వచ్చేశాను. ఐతే... ఇది నన్ను ఫాలో అయినట్లుంది. అందుకే ఇవాళ నా ఇంట్లోకి వచ్చేసింది" అన్నాడు. సరిపోయింది... అంటూ అధికారులు... కిటికీ ద్వారా... ఆ జంతువుకి... మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. తర్వాత దాన్ని బోనులో బంధించి... తమతో తీసుకెళ్లారు. అది అరుదైన జీవి అనీ... అసలు ఎక్కడి నుంచీ వచ్చిందో తెలుసుకుంటామనీ... ధైర్యం చెప్పి... అక్కడి నుంచీ బయల్దేరారు.
Published by:
Krishna Kumar N
First published:
August 21, 2019, 11:46 AM IST