Home /News /international /

Omicron photo: ఒమిక్రాన్ వేరియంట్​​ ఫస్ట్​ ఫొటో విడుదల.. డెల్టా కంటే మరీ దారుణంగా ఉందే.. ఎలా ఉందో మీరూ చూడండి

Omicron photo: ఒమిక్రాన్ వేరియంట్​​ ఫస్ట్​ ఫొటో విడుదల.. డెల్టా కంటే మరీ దారుణంగా ఉందే.. ఎలా ఉందో మీరూ చూడండి

corona

corona

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన  కరోనా వైరస్ కొత్త వేరియంట్​ ఒమిక్రాన్ (Omicron variant) రూపాంతరం చెంది పలు దేశాలను కలవరపెడుతోంది. తాజాగా రోమ్‌లోని ప్రతిష్టాత్మకమైన బాంబినో గెసో చిల్డ్రన్స్ హాస్పిటల్‌ ఒమిక్రాన్‌ మొదటి ఫోటోను విడుదల చేసింది.

ఇంకా చదవండి ...
    దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన  కరోనా వైరస్ కొత్త వేరియంట్​ ఒమిక్రాన్ (Omicron variant) రూపాంతరం చెంది పలు దేశాలను కలవరపెడుతోంది. ఒమిక్రాన్ ట్రాన్స్మిసిబిలిటీని వ్యాక్సిన్‌లు ఏమాత్రం తట్టుకుంటాయో ప్రస్తుతానికైతే తెలియదు. ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్.. ఇప్పటికే ఆ దేశాన్ని గడగడలాడిస్తోంది. అయితే ఈ కేసులు పలు దేశాల్లోనూ గుర్తించడంతో ప్రపంచదేశాలకు వణుకు మొదలైంది. గతంలో వచ్చిన అన్ని కరోనా వైరస్​ల కంటే సెకండ్​ వేవ్​లో భారత్​లో అల్లకల్లోలం సృష్టించిన డెల్టా రకం (delta variant) అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో శాస్త్రవేత్తలు ఒమిక్రాన్​ వైరస్​పై పరిశోధనలు మొదలుపెట్టారు.

    ఈ కొత్త రకం వేరియంట్‌తో అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయాసియా దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) హెచ్చ‌రించింది. ఈ దేశాలు క‌రోనా వైర‌స్ వ్యాప్తిపై నిఘా పెంచాలని, వ్యాప్తి అడ్డుకొట్ట‌కు త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు చేప‌డితే మంచిద‌ని ఆగ్నేయాసియా ప్రాంత డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ సూచించారు. అయితే ఈ ఒమిక్రాన్​ వేరియంట్​ డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ( six times higher potential to spread ) శాస్త్రవేత్తలు తెలియజేయడం ఆందోళన కలిగిస్తోంది.తాజాగా రోమ్‌లోని ప్రతిష్టాత్మకమైన బాంబినో గెసో చిల్డ్రన్స్ హాస్పిటల్‌ ఒమిక్రాన్‌ మొదటి ఫోటోను విడుదల చేసింది. ఈ చిత్రం ఒక మ్యాప్‌లా కనిపిస్తోంది.

    భవిష్యత్తులో సోకే కొత్త వేరియంట్లకు కారణమవుతాయి.. 

    డెల్టా వేరియంట్‌ (delta variant)తో పోలిస్తే ఒమిక్రాన్‌లో ఎక్కువ మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కరోనా వైరస్‌లో వచ్చిన వేరియంట్లలో అన్నిటికన్నా ఎక్కువగా జన్యు ఉత్పరివర్తనలు జరిగిన వేరియంట్‌ ఒమిక్రాన్‌ అని వెల్లడించింది. ఒమిక్రాన్‌ ఉత్పరివర్తనలు మరింత ప్రమాదకరమైనవని రోమ్‌ (Rome) పరిశోధకుల బృందం తెలిపింది. అలాగే భవిష్యత్తులో సోకే కొత్త వేరియంట్లకు కారణమవుతాయని పరిశోధకుల బృందం పేర్కొంది.

    అయితే ఒమిక్రాన్‌తో వ్యాప్తి ప్రభావం పెరుగుతుందా లేదా వ్యాక్సిన్ల ప్రభావం తగ్గుతుందా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమని పరిశోధకులు పేర్కొన్నారు.



    కాగా డెల్టాతో సహా ఇతర వేరియంట్‌లతో పోల్చితే ఓమిక్రాన్ మరింతగా వ్యాపించగలదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. ఒమిక్రాన్.. ఇతర కోవిడ్‌ వేరియంట్‌ల కంటే భిన్న లక్షణాలు ఉన్నాయడానికి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని తెలిపింది.

    ఒమిక్రాన్​ వేరియంట్​ మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ (monoclonal antibody therapy)కి లేదా కాక్‌టెయిల్ ట్రీట్​మెంట్ (cocktail treatment) ​కు కూడా ప్రతిస్పందించకపోవచ్చని నిపుణులు తెలిపారు. ఇది రోగనిరోధక వ్యవస్థ నుంచి కూడా తప్పించుకోగలదని చెబుతున్నారు. దీనిపై వ్యాక్సిన్ ఏ మేరకు పనిచేస్తుందో ఇపుడే చెప్పలేమని అంటున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Omicron corona variant

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు