కరనా వైరస్ (Corona Virus) కట్టడి విషయంలో ప్రతీ దేశం ఆయా దేశాల పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాయి. అయితే చైనా తీసుకొన్న నిర్ణయం పూర్తిగా ఫెయిల్ అవుతుందని దక్షిణాఫ్రికా అంటుంది. ముఖ్యంగా ఒమిక్రాన్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా చైనా జీరో కోవిడ్ ఫ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ విధానం పూర్తిగా సరైందని కాదని దక్షిణాఫ్రికా (South Africa) లోని సెం టర్ ఫర్ ఎపిడెమిక్ రెస్పా న్స్ అం డ్ ఇన్నో వేషన్ డైరెక్టర్, వైరాలజిస్ట్ ప్రొ.తులియో డి ఒలివెరా స్పష్టం చేశారు. ఒమిక్రాన్ విషయంలో ఈ విధానం పని చేయదని ఆయన అన్నారు. ఒలివెరా ఒమిక్రాన్ వేరియం ట్ను కనుగొన్న దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల టీంకు నాయకత్వం వహించారు.
China will have great difficulty with #omicron and zero covid policy. They may need@ to join the rest of the world with mitigation strategies. #China should not punish its public health officials or citizens or foreigns because a more transmissible variant…
— Tulio de Oliveira (@Tuliodna) December 25, 2021
ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. జీరో కొవిడ్ విధానం తో చైనాకు చాలా ఇబ్బం దులు ఎదురవుతాయని అన్నారు. వైరస్ కట్టడి చర్య ల కోసం ఇతర దేశాలతో కలిసిన పని చేయడానికి సిద్ధంగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చైనా ఒమిక్రాన్ సాగుతో అధికారులను, పౌరులను, విదేశీయులకు శిక్షించడం సరికాదని ఒలివర్ ట్విట్టర్ వేదిక రాసుకొచ్చారు.
Covid 19 Vaccine: బూస్టర్ డోస్ తీసుకోవాలంటే.. సెకండ్ డోస్ తర్వాత ఇంత గ్యాప్ తప్పనిసరి!
ఇటీవల చైనా (China) లోని జియాన్ నగరంలో ఒక్క రోజే 50కు పైగా కరోనా కేసులు బయటపడ్డాయి. అక్క డి అధికారులు 1.3 కోట్ల జనాభాకు లాక్‌డౌన్ విధించారు. ఫిబ్రవరి 4న బీజింగ్ వింటర్ ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇటీవలి రోజుల్లో ఆ చర్యలు ముమ్మరం చేయబడ్డాయి. 2019 చివరలో కోవిడ్ -19 మొదటిసారిగా కనుగొనబడిన తర్వాత 2020లో చైనా సెంట్రల్ సిటీ వుహాన్‌లో, చుట్టుపక్కల 11 మిలియన్లకు పైగా ప్రజలపై కఠినమైన లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి మళ్లి ఇప్పుడే జియాన్ కఠిన నిబంధనలు పాటిస్తోంది.
అంతే కాకుండా కరోనా కట్టడిలో విఫలయం అయ్యారని 26 మంది అధికారులపై వేటు వేసింది చైనా. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా సైంటిస్ట్ ఒలివర్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అంతే కాకుండా కరోనా కట్టడిలో విఫలయం అయ్యారని 26 మంది అధికారులపై వేటు వేసింది చైనా. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా సైంటిస్ట్ ఒలివర్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.