Home /News /international /

SOUDI CROWN PRINCE WANTED TO KILL LATE SOUDI KING WITH POISON RING EVK

Saudi Crown : నాటి రాజును విష‌పు ఉంగ‌రంతో చంపాల‌నుకొన్నారు.. సౌదీ రాజుపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌

యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ (ఫోటో సోర్స్ ఏఫ్‌పీ, ఫైల్‌)

యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ (ఫోటో సోర్స్ ఏఫ్‌పీ, ఫైల్‌)

Saudi Crown : యునైటెడ్‌తో కలిసి ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలను పర్యవేక్షించడంలో సహాయం చేసిన మాజీ సీనియర్ సౌదీ భద్రతా అధికారి స్టేట్స్, "60 మినిట్స్"కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుత సౌదీ యువరాజు మహమ్మ ద్‌ బిన్‌ సల్మా న్‌(ఎంబీఎస్‌)పై సంచలన ఆరోపణలు చేశారు.

ఇంకా చదవండి ...
    యునైటెడ్‌(United) తో కలిసి ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలను పర్యవేక్షించడంలో సహాయం చేసిన మాజీ సీనియర్ సౌదీ భద్రతా అధికారి స్టేట్స్, "60 మినిట్స్"కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుత సౌదీ యువరాజు మహమ్మ ద్‌ బిన్‌ సల్మా న్‌(ఎంబీఎస్‌)పై సంచలన ఆరోపణలు చేశారు. గతంలో సౌదీ తరపున అమెరికా యాంటీ టెర్రర్‌ ఆపరేషన్స్‌లో పాల్గొన్న సాద్ అల్-జబ్రీ ఆదివారం ప్రసారమైన CBS న్యూస్ ప్రోగ్రామ్‌లో ఈ ఆరోప‌ణ‌లు చేశారు. 2014లో బిన్‌ సల్మాన్‌కు సౌదీ ప్రభుత్వంలో ఎటువంటి పదవీ ఇవ్వలేదు. ఆ సమయంలో అతని తం డ్రి సల్మాన్‌ బిన్‌ అబ్దులజీజ్‌ అల్‌ సౌద్‌ యువరాజుగా (Crow Prince)గా ఉండేవారు. అయినా కూడా ఎంబీఎస్‌కు న్యా యస్థానంలో గేటు కీపర్‌గా ఉండాల్సి వచ్చింద‌ని పేర్కొన్నాడు. దీంతో ఎంబీఎస్‌ (MBS) తీవ్ర అసం తృప్తికి లోన‌య్యేవాడ‌ని ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు.

    విష‌పు ఉంగ‌రంతో..
    ఆ స‌మ‌యంలో అత‌ని సోద‌రుడైన అప్ప‌టి ఇంటీరియర్‌ మినిస్టర్‌ ప్రిన్స్‌ మహమ్మ ద్‌ బిన్‌ నయీఫ్‌తో ఎంబీఎస్ భేటి అయ్యారిని.. వారిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ఈ చ‌ర్చ‌ల్లో ఎంబీఎస్‌ మాట్లాడుతూ రష్యా (Russia) నుంచి విషపూరిత ఉంగరం (Poisson Ring) తెప్పించి రాజు అబ్దుల్లాని చంపాలనుందని అన్న‌ట్టు ఆయ‌న ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

    Sudan Protest : ప్ర‌ధానిని అరెస్టు చేసిన సైన్యం.. అక్క‌డ ఏం జ‌రుగుతోంది!


    కేవలం ఒక్క సారి రాజు అబ్దుల్లాకి షేక్‌ హ్యాండ్‌  ఇస్తే చాలు ఆ తర్వా త విష ప్రభావంతో రాజు చనిపోతాడని.. అప్పుడు తన తం డ్రి సల్మా న్‌ బిన్‌ అబ్దులజీజ్‌ రాజు అవుతాడని వ్యా ఖ్యానించిన‌ట్టు సాద్ అల్-జబ్రీ పేర్కొన్నాడు.

    న‌న్ను చంపే వ‌ర‌కు ఊరుకోడు..
    సాద్‌ ప్రస్తుతం సౌదీ అరేబియా నుంచి పారిపోయి.. కెనడాలో ఆశ్రయం పొందుతున్నాడు. సాద్‌ పిల్లలు ఇద్దరు సౌదీప్రభుత్వం వద్ద బందీలుగా ఉన్నారు. తనని చంపే వరకు ఎంబీఎస్‌ ఊరుకోరని సాద్‌ సీబీఎస్‌ న్యూ స్‌ ఛానెల్‌ ఎదుట ఆం దోళన వ్యక్తం చేశాడు.

    వీడియో ఉంది..
    ఈ విషయాన్ని సౌదీ ఇంటెలిజెన్స్‌ (Intelligence) తీవ్రంగా పరిగణించింది. ఆ తర్వాత రాజకుటుంబలో పెద్ద‌లు ఈ వివాదాన్ని పరిష్కరించ‌ర‌ని తెలిపాడు. ఎంబీఎస్‌-నయీఫ్‌ భేటీకి సంబంధించిన వీడియో తన వద్ద ఉందని సాద్‌ పేర్కొ న‌డం విశేషం.. తన ప్రాణాలకు హాని జరిగితే ఆ వీడియోను విడుదల చేస్తానని ఆయ‌న‌ పేర్కొన్నాడు. 2015 కింగ్ అబ్దుల్లా సహజ కారణాలతో మరణించారు. ఆ తర్వా త సల్మాన్‌బిన్‌ అబ్దులజీజ్‌ రాజుగా ఎంపికయ్యారు. ఆ తర్వా త క్రౌన్‌ ప్రిన్స్‌ అయిన నయీఫ్‌ను 2017లో పక్కకు తప్పించి బిన్‌ సల్మాన్‌ ఆ పదవిలోకి వచ్చాడు. నాటి నుంచి సౌదీ అరేబియా అప్రకటిత రాజుగా వ్యవహరిస్తున్నాడు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: International news, Russia, Soudi arebia

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు