హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

తల్లికి లేఖ రాసి కొడుకు.. అది చేరడానికి పట్టిన సమయం 76 సంవత్సరాలు.. ఎక్కడంటే..

తల్లికి లేఖ రాసి కొడుకు.. అది చేరడానికి పట్టిన సమయం 76 సంవత్సరాలు.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Letter: జర్మనీలో ఉద్యోగం చేస్తూ తన క్షేమం గురించి ఓ లేఖ రాసి తల్లికి పంపారు. ఆ సమయంలో ఈ ఉత్తరం అతని ఇంటికి చేరలేదు.

  కొన్ని విషయాలు వినడానికి ఆశ్చర్యం కలిగిస్తాయి. నిజంగా ఇలా జరుగుతుందా ? అందులోనూ అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇలా జరుగుతుందా ? అని వార్త గురించి తెలుసుకున్న తరువాత చాలామంది ఆశ్చర్యపోతుంటారు. కానీ ఇలాంటి సంఘటనలకు.. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధికి నోచుకోని దేశాలు అనే తేడా ఉండదు. తాజాగా ఓ యువకుడు రాసిన లేఖ అతడి తల్లికి చేరేందుకు ఏకంగా 76 సంవత్సరాలు పట్టిందనే విషయం చెబితే ఎవరైనా నమ్ముతారా ? కానీ ఇది నిజం. ఈ ఘటన చోటు చేసుకుంది ఎక్కడో కాదు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే అమెరికాలో. వివరాల్లోకి వెళితే.. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో US ఆర్మీ సార్జెంట్ జాన్ గోన్సాల్వేస్ తన తల్లికి లేఖ రాశారు. 1945 డిసెంబరు 6న 22 ఏళ్ల వయసులో లేఖ రాశారు.

  జర్మనీలో ఉద్యోగం చేస్తూ తన క్షేమం గురించి ఓ లేఖ రాసి తల్లికి పంపారు. ఆ సమయంలో ఈ ఉత్తరం అతని ఇంటికి చేరలేదు. విదేశాలలో ఉద్యోగం చేస్తున్న కుమారుడు లేఖ రాస్తే.. అది అతడి తల్లికి ఓదార్పునిస్తుంది. జర్మనీ నుంచి అమెరికాలోని పిట్స్‌బర్గ్‌కు లేఖ రావడానికి 76 ఏళ్లు పట్టింది. బాధాకరమైన విషయమేమిటంటే.. ఆ ఉత్తరం వచ్చే సమయానికి అది రాసిన వ్యక్తిగానీ, ఆ లేఖ చేరాల్సిన వ్యక్తి గానీ ఈ లోకంలో లేరు.

  యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్ సార్జెంట్ గోన్సాల్వ్స్ భార్య గురించి తెలుసుకుని.. ఆమెకు ఈ లేఖను అందజేశారు. ఈ లేఖ రాసిన సార్జెంట్ 2015 సంవత్సరంలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇక ఈ లేఖలో సార్జెంట్ తన తల్లికి ఏ రాశారని చూస్తే.. సార్జెంట్ తన క్షేమం గురించి తల్లికి తెలియజేశాడు. మీ నుంచి వచ్చిన లేఖ తనకు అందిందని.. అది తనకు ఆనందం కలిగించిందని పేర్కొన్నాడు.

  బంగాళదుంపలు కేజీ రూ. 200.. పచ్చిమిర్చి కిలో రూ.710.. ఎక్కడో అనుకునేరు.. మన పక్క దేశంలోనే..

  covid-19: అమెరికాలో అల్లకల్లోలం -కుప్పకూలనున్న ఆరోగ్య వ్యవస్థ!

  తాను కూడా ఇక్కడ బాగానే ఉన్నానని.. అంతా బాగానే ఉందని తల్లికి లేఖలో తెలియజేవాడు. త్వరలోనే నిన్ను చూడాలని అనుకుంటున్నానని ఆకాంక్షించాడు. ఇక సార్జెంట్ భార్య ఏంజెలీనా ఈ లేఖను తెరిచినప్పుడు.. ఆమె దీన్ని నమ్మలేకపోయింది. ఈ లేఖ తన భర్త వివాహానికి 5 సంవత్సరాల ముందు ఆమె తల్లికి రాశారని తెలిపింది. అది ఇప్పుడు ఆమెకు అందింది. తన భర్త చాలా మంచి వ్యక్తి అని.. అందరూ ఇష్టపడే వారని చెప్పుకొచ్చింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Germany, Postal department, USA

  ఉత్తమ కథలు