Home /News /international /

SOME BIRDS IN AMERICA ARE DYING OF AN ELUSIVE DISEASE VB

Washington: అంతు చిక్కని వ్యాధితో పక్షులు మృత్యువాత.. కరోనా వైరస్ కారణంగానే చనిపోతున్నాయా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Washington: కరోనాతో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. మరికొంత మంది ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్ వేవ్ తగ్గుతున్న క్రమంలో పక్షలను వైరస్ వెంటాడుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    కరోనా వైరస్ గత సంవత్సరం మార్చి నుంచి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. మనుషులపైనే కాకుండా జంతువులకు కూడా ఈ వైరస్ సోకుతోంది. తాజాగా అమెరికాలో పక్షులు ఓ వింత వ్యాధితో మరణించడం జరుగుతోంది. అయితే ఇది దేని వల్ల అనేది మాత్రం స్పష్టంగా తెలియదు. మొదట 2021 ఏప్రిల్లో ఓ పక్షికి తన కను గుడ్డు ఉబ్బి, స్తాధీనం తప్పి ప్రాణాలను కోల్పోయినట్లు అక్కడి వైద్యులు గుర్తించారు. వ్యాధి ఏంటనేది మాత్రం ఇంత వరకు తెలియదు. ఇప్పటికే కరోనా వైరస్ అనేది గాలిలో కలిసి పోయింది. ఇది పక్షలను కూడా వెంటాడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. పక్షులు ఇలా అంతుచిక్కని వ్యాధితో మరణించడం ఇంత వరకు చూడలేదని వాషింగ్టన్‌లోని జంతు సంరక్షణ కేంద్రం డైరెక్టర్‌ పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    కరోనాతో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. మరికొంత మంది ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్ వేవ్ తగ్గుతున్న క్రమంలో పక్షలను వైరస్ వెంటాడుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే అమెరికాలో కొన్ని పక్షులు అంతుచిక్కని వ్యాధితో చనిపోతున్నాయి. కండ్లు ఉబ్బి, స్వాధీనం తప్పి ప్రాణాలు కోల్పోతున్నాయి. దీనికి కారణం ఏంటనేది తెలియడం లేదు. ఇలాంటి లక్షణాలతో చనిపోయిన పక్షిని మొదట ఏప్రిల్‌లో గుర్తించారు.

    జూన్‌లో పక్షుల మరణాలు పెరిగాయి. మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు వేల సంఖ్యలో నమోదయ్యాయి. కరోనా నుంచి మానవాళి ఇప్పుడిప్పుడే కోలుకొంటుండగా తాజాగా పక్షుల్లో కూడా ఓ మహమ్మారి మొదలైందని అనుమానిస్తున్నారు. పక్షులు ఇలా చనిపోవడం ఎన్నడూ చూడలేదని వాషింగ్టన్‌లోని జంతు సంరక్షణ కేంద్రం డైరెక్టర్‌ జిమ్‌ మోన్‌స్మా చెప్పారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Birds, USA, Washington

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు