26/11 ముంబై ఉగ్రదాడులను (Mumbai Terror Attack) మనం ఎప్పటికీ మరచిపోలేం. భారత చరిత్రలోనే అదో చీకటి రోజు. 2008 నవంబరు 26న ఉగ్రవాదులు ముంబైలోని తాజ్ హోటల్‌లోకి చొరబడి కాల్పులతో విరుచుకుపడ్డారు. బాంబుల మోత మోగించారు. నాటి ఉగ్రదాడిలో 170 మంది వరకు మరణించారు.ఐతే అచ్చం ఇలాంటి ఘటనే ఆఫ్రికా దేశం సోమాలియా (Somalia Terror Attack)లో జరిగింది. శుక్రవారం రాత్రి సోమాలియా రాజధాని మోగాదిషులో ఉన్న హయత్ హోటల్ (Hayat Hotel Attack)లోకి ఉగ్రవాదులు చొరబడి నెత్తుటేరులు పారించారు. హోటల్‌లో ఉన్న అతిథులపై కాల్పులు జరిపి రక్తపాతం సృష్టించారు. ఉగ్రవాదుల దాడిలో 40 మంది మరణించారు. మరో 70 మందికి పైగా గాయపడ్డారు.
శుక్రవారం రాత్రి గెస్ట్‌ల రూపంలో హయత్‌లోకి అల్ షబాబ్ ఉగ్రవాదులు వచ్చారు. కాసేపటి తర్వాత ఓ సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడు. అనంతరం మరికొందరు ఉగ్రవాదులు తుపాకులతో కాల్పులు జరిపారు. హోటల్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని.. గదుల్లో ఉన్న అతిథులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. హయత్ హోటల్‌పై ఉగ్రదాడి జరిగిందన్న సమాచారం అందించిన వెంటనే.. భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. హోటల్‌లోకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ... మొదట ఉగ్రవాదులు పెద్ద ఎత్తున కాల్పులు జరపడంతో కాస్త వెనక్కి తగ్గారు. ఆ తర్వాత అదనపు బలగాలు కూడా రావడంతో.. సైనికులు హోటల్‌లోకి వెళ్లి.. ఉగ్రవాదులపై ఎదురు దాడి చేశారు. ఇలా ఈ ఆపరేషన్ 30 గంటల పాటు సాగింది.
పెళ్లి చేసుకోలేదు, మహిళలతో రిలేషన్ పెట్టుకోలేదు.. అయినా 48 మంది పిల్లలకు తండ్రి.. ఎలాగంటే
దాదాపు 30 గంటల తర్వాత సోమాలియా అధికారులు కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ ముగిసిందని.. హయత్ హోటల్‌లో ఉగ్రవాదులెవరూ లేరని.. వారందరినీ చంపేశామని తెలిపారు. అల్ షబాబ్ ఉగ్రదాడిలో మొత్తం 40 మంది మరణించారని, మరో 70 మందికి గాయాలయ్యాయని వెల్లడించారు. హయత్ హోటల్‌పై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేస్తూ.. 'మొగాదిషులోని హయత్ హోటల్‌పై దాడిని భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది. ఈ పిరికిపంద చర్య. ఉగ్రదాడిలో మరణించిన వారికి కుటంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం.'' అని పేర్కొన్నారు.
ఉగ్రవాద సంస్థ అల్-ఖైదాకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనుబంధ సంస్థలున్నాయి. అందులో అల్-షబాబ్ ఒకటి. ప్రధానంగా సోమాలియాలో ఉన్న ఈ సంస్థ పూర్తి పేరు హర్కత్ అల్-షబాబ్ అల్-ముజాహిదీన్. కెన్యాతో దేశం దక్షిణ సరిహద్దులో ఇది బలమైన ఉనికిని కలిగి ఉంది. అల్-షబాబ్ ఏకైక లక్ష్యం సోమాలి ప్రభుత్వాన్ని పడగొట్టడం. అల్-షబాబ్ సంస్థ సౌదీ అరేబియాకు వహాబీ ఇస్లాంను అనుసరిస్తుంది. దీనిని ఇస్లాం అత్యంత తీవ్రమైన రూపంగా పేర్కొంటారు. ఈక్రమంలో సోమాలియాలో అప్పుడప్పుడూ భీకర దాడులకు పాల్పడుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Somalia, Terror attack