చంద్రుడు, అంగారకుడిపై వ్యవసాయం.. టమాట, బఠాణీ సాగు..

వీటిలో పాలకూర మిగిలిన పంటలు బాగా పండాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మనుషుల ఆహార అవసరాలను తీర్చేవిధంగా పంట ఉత్పత్తులు ఉన్నాయని వెల్లడించారు.

news18-telugu
Updated: October 17, 2019, 3:55 PM IST
చంద్రుడు, అంగారకుడిపై వ్యవసాయం.. టమాట, బఠాణీ సాగు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చంద్రుడు, అంగరాకుడిపై వెళ్లేందుకు భారత్ సహా చాలా దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. స్పేస్ ఎక్స్ వంటి అంతరిక్ష పరిశోధనా సంస్థలైతే ఏకంగా మనుషులను పంపేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో చంద్రుడు, అంగారకుడిపై మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై భవిష్యత్‌లో మానవ స్థావరాలు ఏర్పాటైతే, వారికి కావాల్సిన ఆహార పదార్థాలు అక్కడే పండిచ్చుకోవచ్చట. భూమి మాదిరే అక్కడా పంటలను సాగుచేసుకోవచ్చని తెలిసింది. నెదర్లాండ్స్‌లోని వేజ్‌నింజన్ పరిశోధక విద్యాలయం పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది.

అంగారకుడు, చంద్రుడిపై ఉండే మట్టి తరహా నమూనాల్లో టమాటో, ముల్లంగి, బఠాణీలు, పాలకూర, క్వినోవా వంటి పది రకాల పంటలను ప్రయోగాత్మంగా సాగు చేశారు. వీటిలో పాలకూర మిగిలిన పంటలు బాగా పండాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మనుషుల ఆహార అవసరాలను తీర్చేవిధంగా పంట ఉత్పత్తులు ఉన్నాయని వెల్లడించారు. అంతేకాదు ఆ పంటల నుంచి వచ్చిన విత్తనాలు తిరిగి సాగుకు ఉపయోగపడేలా ఉన్నాయని పేర్కొన్నారు. పాలకూర మాత్రం ఆ మట్టిలో పెరగలేదని స్పష్టంచేశారు.
Published by: Shiva Kumar Addula
First published: October 17, 2019, 3:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading