చైనీస్ యుద్ధ విమానాన్ని కూల్చేసిన తైవాన్, సోషల్ మీడియాలో పోటెత్తిన వీడియోలు

ఓ జెట్ కూలి, పెద్ద ఎత్తున పొగ వ్యాపించిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు పోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి.

news18-telugu
Updated: September 4, 2020, 4:25 PM IST
చైనీస్ యుద్ధ విమానాన్ని కూల్చేసిన తైవాన్, సోషల్ మీడియాలో పోటెత్తిన వీడియోలు
Sukhoi Su-35 | Credit: TASS
  • Share this:
China Jet: చైనాకు చెందిన సుఖోస్ సు - 35 ఫైటర్ జెట్‌ను తైవాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చేసినట్టు తైవాన్ సోషల్ మీడియా కోడై కూస్తోంది. దక్షిణ చైనా నుంచి తైవాన్ గగనతలంలోకి వెళ్లడానికి ప్రయత్నించిన చైనీస్ యుద్ధ విమానాన్ని కూల్చేశారని, అది గాంగ్‌క్సీ (దక్షిణ చైనాలో స్వయం ప్రతిపత్తి గల ఓ భాగం) అనే ప్రాంతంలో కూలినట్టు ది జ్యుయిష్ ప్రెస్ కథనంలో పేర్కొంది. ఓ జెట్ కూలి, పెద్ద ఎత్తున పొగ వ్యాపించిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు పోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే, ఆ వీడియో ఎక్కడిది అనే విషయం స్పష్టంగా తెలియలేదు. కానీ, తైవాన్ సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు చైనీస్ సుఖోయ్ సు - 35 ఫైటర్ జెట్‌ను తైవాన్ కూల్చేసిందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇది ఫేక్ వీడియో అని, తైవాన్ రక్షణ శాఖను ఉటంకిస్తూ ది డైలీ టెలిగ్రాఫ్ ఆసియా కరస్పాండెంట్ నికోలా స్మిత్ చెప్పారు.2015లో చేసుకున్న ఒప్పందం ప్రకారం చైనాకు సుఖోయ్ యుద్ధ విమానాలను సరఫరా చేసే కాంట్రాక్ట్‌ను రష్యా 2019లోనే పూర్తి చేసింది. ఈ కాంట్రాక్ట్ విలువ 2 బిలియన్ అమెరికా డాలర్లు. తైవాన్ సరిహద్దు ప్రాంతాల్లో మిలటరీ మిషన్ నిర్వహిస్తామంటూ గత నెలలో చైనా ప్రకటించింది. అయితే, అలాంటి చర్యలకు దిగితే తగిన సమాధానం చెబుతామని తైవాన్ కూడా హెచ్చరించింది. గత ప్రకటనల నేపథ్యంలో చైనీస్ సుఖోయ్ జెట్ కూలడంతో అది తైవాన్ కూల్చినట్టు నెటిజన్లు భావిస్తున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 4, 2020, 4:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading