ఇది శీతాకాలం (Winter). మన దేశంలో జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో విపరీతంగా మంచు (Snowfall) కురుస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మంచుతో కప్పబడ్డాయి. ఏటా చలికాలంలో అక్కడ హిమపాతం సహజమే. ఆ మంచు అందాలను తిలకించడానికి పర్యాటకులు క్యూకడుతుంటారు. మనకు తెలిసి.. శీతల ప్రాంతాల్లో మాత్రమే మంచు కురుస్తుంది. కాస్త వేడిగా ఉండే.. దక్షిణ భారతంలో ఎక్కడా మంచు పడదు. ఇక ఏడారి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. మండే ఎండలతో అక్కడ నీరు కూడా దొరకని పరిస్థితులు ఉంటాయి. అలాంటి ఎడారి ప్రాంతాల్లో మంచు పడితే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఇదేంటని అవాక్కవుతారు. ఇప్పుడు సహార ఏడారిలో ఇదే వాతావరణం (Snow fall in sahara desert) కనిపిస్తోంది. సహార ఎడారి (Sahara Desert) లోని పలు ప్రాంతాలు మంచులో మునిగిపోయాయి.
Chain Smoking Chimp : ఈ చింపాంజీ అప్పట్లో రోజుకి 40 సిగరెట్లు కాల్చేది..కానీ ఇప్పుడు
సహార.. ప్రపంచంలోనే అతి పెద్ద ఏడారి. ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. అల్జీరియా, చాద్, ఈజిప్ట్, లిబియా, మాలి, మారిటానియా, మొరకో, నైజర్, సూడాన్, ట్యునీషియా దేశాల్లో 9 లక్షల చ.కి.మీ. వీస్తీర్ణంలో వ్యాపించి ఉంది. సహార ఏడారిలో అధిక వేడి వాతావరణం ఉంటుంది. నీటి కొరత కూడా చాలా ఎక్కువ. రాత్రిళ్లు మాత్రం కాస్త చల్లగా ఉంటాయి. కానీ ఎడారిలో హిమపాతం గురించి మనం ఎప్పుడూ వినలేదు. ఐతే కొన్నేళ్లుగా ఇలాంటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా సహార ఏడారిలో మరోసారి మంచు కురిసింది. జనవరి 18న అల్జీరియాలోని ఐన్‌సెఫ్రాలో మైనస్ 2 డిగ్రీల ఉష్ణోగ్రత (Ain sefra snowfall) నమోదయింది. ఎప్పుడు 58 డిగ్రీలుంటే ఆ ప్రాంతంలో మంచు కురవడంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
Hamsters : కరోనా భయంతో చిట్టెలుకలని చంపాలని నిర్ణయించిన ప్రభుత్వం
అల్జీరియాలోని సహార ఏడారిలో ఇసుక మంచుతో కప్పబడి.. తెల్లగా కనువిందు చేస్తోంది. ఇసుక తిన్నెలు మంచు కొండల్లా మారిపోయాయి. ఆ ఫొటోలను ఫోటోగ్రాఫర్ కరీమ్ బోచెట్టా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇందులో ఇసుక మంచుతో పూర్తి కప్పబడి కనిపించింది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్థానిక ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం.. గత 42 ఏళ్లలో సహార ఎడారిలో మంచు కురవడం ఇది ఐదోసారి. ఇంతకు ముందు 2021, 2018, 2016, 1979లో మంచు కురిసింది. ఐన్ సెఫ్రా సహారా ఎడారికి ప్రవేశ ద్వారం. ఇది సముద్రానికి దాదాపు మూడు వేల అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడి నుంచే ఏడారి ప్రారంభమవుతుంది. వాతావరణంలో నిరంతర మార్పుల కారణంగా ఈ ప్రాంతంలో మంచుపడుతోంది.
వామ్మో ఎంత పెద్ద సైకిల్.. కారు కంటే దీని ఖరీదే ఎక్కువ..
ఎప్పుడు వేడిగా ఉండే ప్రాంతంలో ఇప్పుడు మంచు కురుస్తుండటంతో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. చాలా మంది దీనిని విధ్వంసానికి సంకేతంగా చెప్పారు. ప్రపంచం అంతమవుతుందని భావిస్తున్నారు. వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా.. హిమానీనదాలు చాలా వేగంగా కరిగిపోతున్నాయి. అందువల్లే ఎడారి ప్రాంతాల్లోనూ మంచు కురుస్తోంది. ఇదంతా ప్రపంచ అంతానికి సంకేతమని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. సహార ఎడారిలో మంచు కురిసిన ఫొటోలను చూసి కొందరు ఆశ్చర్యపతుంటే.. మరికొందరు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందోనని ఇప్పటి నుంచే టెన్షన్ పడుతున్నారు.
మరో ఎడారి దేశం సౌదీలోనూ ఇటీవల మంచు కురిసింది. సౌదీ అరేబియాలోని బదర్ నగరంలో ఉన్న ఎడారిపై విపరీతంగా మంచు కురుస్తోంది. బంగారు రంగులో కనిపించే ఎడారి.. వడగళ్ల వాన కురిసిన తర్వాత తెల్లగా మారిపోయింది. ఆ మంచు అందాల్లో ప్రజలు సరదాగా గడుపుతున్నారు. సౌదీ అరేబియాలోని తబుక్‌లో ఉన్న జబల్ అల్-లాజ్, జబల్ అల్-తాహిర్, జబల్ అల్కాన్ పర్వతాల్లో ఏటా 2-3 వారాల పాటు మంచు కురుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.