డోర్ తెరిచాడు... పాము కాటేసింది... అసలేం జరిగిందంటే...

Snake Attack : ఎక్కడైనా ఇళ్లలోకి వచ్చిన పాములు ఏ మూలో నక్కి ఉండటం మనం చూశాం. ఈ ఘటనలో మాత్రం పాము పైన దాక్కొని కాటేయడం చిత్రమైన విషయం.

Krishna Kumar N | news18-telugu
Updated: May 8, 2019, 10:40 AM IST
డోర్ తెరిచాడు... పాము కాటేసింది... అసలేం జరిగిందంటే...
హేవుడ్‌పై కాటు వేసిన పాము
Krishna Kumar N | news18-telugu
Updated: May 8, 2019, 10:40 AM IST
ఒక్లహామాలో జరిగిందీ ఘటన. ఆ కుర్రాడి ముఖంపై పొడవాటి పాము కాటేసింది. తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లిన జెరెల్ హేవుడ్... క్యాజువల్‌గా ఫ్రంట్ డోర్ తెరిచాడు. అప్పటికే... డోర్ పైన ఉన్న ట్యూబ్‌లైట్‌కి చుట్టుకొని ఉన్న ఆ పాము... డోర్ తెరచుకోవడంతో అలర్ట్ అయ్యింది. ఎవరో తనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనుకొని... రివర్స్ ఎటాక్ చేసింది. సరిగ్గా కంటి భాగంలో పాము కాటు వేసింది. ఊహించని ఈ పరిణామానికి హేవుడ్ షాకయ్యాడు. అమ్మో... పాము కాటేసేసింది... దేవుడా అని అరుస్తూ... అదే పామును దాటుకుంటూ... తన ఫ్రెండ్ ఇంట్లోకి వేగంగా వెళ్లాడు. ఇంటి డోర్ బెల్‌ దగ్గర అమర్చిన కెమెరాలో పాము కాటు వేసిన సీన్ రికార్డైంది.


అలర్టైన అతని ఫ్రెండ్ వెంటనే హేవుడ్‌ని దగ్గర్లోని హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. ఈ కంగారులో ఇంట్లోకి చొరబడినది ఏ పామో గమనించలేదు. లక్కేంటంటే అది విషపూరితమైన పాము కాదట. అందువల్ల హేవుడ్‌కి పెద్ద ప్రమాదం ఏమీ కలగలేదు. కుట్లు కూడా అవసరం లేదన్న డాక్టర్లు... అదృష్టవంతుడంటూ నవ్వేశారు. 
Loading...
ఇవి కూడా చదవండి :

బీజేపీ గెలిచినా... కేంద్రంలో అధికారంలోకి రాదా...? ఆ 21 పార్టీల ప్లాన్ ఏంటి...?

3 నెలల్లో 17 మంది ఖైదీల విడుదల... కిమ్ కర్దాషియన్ చెబితే ట్రంప్ వినాల్సిందేనా...

యూపీలో బీజేపీకి షాక్ తప్పదా... మారుతున్న పరిస్థితులు... పెరుగుతున్న పార్టీల వ్యతిరేకత...

దగ్గరవుతున్న బీజేపీ, వైసీపీ ... ఫలితాల తర్వాత పొత్తు..? ప్రత్యేక హోదా అటకెక్కినట్లేనా.. ?
First published: May 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...