కారును కిచెన్‌లో పార్క్ చేసిన ఓనర్... తుఫాను వస్తోందని...

Hurricane Dorian : అమెరికాను వణికిస్తున్న డోరియన్ తుఫాను... ఫ్లోరిడా దాటి... ఉత్తర కరోలినాపై దూసుకెళ్లింది. ప్రస్తుతం అక్కడ భయానక పరిస్థితులున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: September 6, 2019, 9:50 AM IST
కారును కిచెన్‌లో పార్క్ చేసిన ఓనర్... తుఫాను వస్తోందని...
కిచెన్‌లో పార్క్ చేసిన కారు (Image : FB - Jess ika)
  • Share this:
రాకాసి తుఫాను డోరియన్... ఉత్తర అమెరికా... ఆగ్నేయ రాష్ట్రాలను వణికిస్తోంది. ఇప్పటికే ఫ్లోరిడా, సౌత్ కరోలినాపై ప్రభావం చూపిన తుఫాను... తాజాగా ఉత్తర కరోలినా తీరాన్ని తాకింది. ఆ సమయంలో... గంటకు 165 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. దక్షిణ, ఉత్తర కరోలినాలో... మొత్తం 2.65 లక్షల ఇళ్లు, వ్యాపార సంస్థలకు కరెంట్ సరఫరా లేదు. ప్రస్తుతానికి తుఫాను తీవ్రత తగ్గడంతో... దాన్ని కేటగిరీ 5 నుంచీ కేటగిరీ 2గా మార్చారు. ప్రస్తుతం అది తీరప్రాంతం గుండా పయనిస్తోంది. డోరియన్ కారణంగా... అమెరికాలో ఐదుగురు చనిపోయినట్లు తెలిసింది. ఐతే... ఉత్తర బహమాస్ దీవుల్లో దాదాపు 30 మంది చనిపోయారు. కొన్ని వందల మంది మిస్సింగ్ అయ్యారు. గతేడాది ఫ్లోరెన్స్ తుఫానుతో చెల్లాచెదురైన బహమాస్ ప్రజలు... ఈసారి డోరియన్ తుఫానుతో తమ ఇళ్లను కోల్పోయి రోడ్డున పడ్డారు.

కిచెన్‌లో పార్క్ చేసిన కారు (Image : FB - Jess ika)


డోరియన్ వస్తున్న కారణంగా... ఫ్లోరిడాలో ఓ దంపతులు... తమ కారును కిచెన్‌లో పార్క్ చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బలమైన గాలుల్లో తమ స్మార్ట్ కారు కొట్టుకుపోతుందేమోనని ఆ దంపతులు భయపడ్డారు. కారు కోసం గ్యారేజీ లేకపోవడంతో... దాన్ని బయట ఎక్కడ పార్క్ చేసినా... వరదల్లో వెళ్లిపోతుందేమో అనుకున్నారు. దాన్ని కాపాడుకోవడానికి కిచెన్ మాత్రమే సరైన ప్రదేశంగా భావించారు. కిచెన్‌లో కిటికీలన్నీ మూసేసి... కారును పార్క్ చేసి... ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది జెస్సికా. కిచెన్‌కి ఉన్న డోర్ల లోంచీ కారు లోపలికి వెళ్లలేదని ఆమె అనుకున్నా... ఆమె భర్త జాగ్రత్తగా డ్రైవ్ చేసి... కారును కిచెన్‌లో సెట్టయ్యేలా చేశాడు.

First published: September 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు