Video : పోలీసుల్ని పరుగులు పెట్టించిన మొసలి పిల్ల

Viral Video : పెద్ద మొసలైతే... నీటి లోంచీ ఒడ్డుకు రాగానే... దిమ్మలా ఉండి.... దొరికిపోతుంది. అది పిల్ల మొసలి కావడంతో... రివర్సైంది.

news18-telugu
Updated: November 16, 2019, 12:14 PM IST
Video : పోలీసుల్ని పరుగులు పెట్టించిన మొసలి పిల్ల
పోలీసుల్ని పరుగులు పెట్టించిన మొసలి పిల్ల (credit - YT - Cape Coral Police Department)
  • Share this:
అమెరికా... ఫ్లోరిడా పోలీసులకు రెగ్యులర్‌గా మొసళ్లతో సమస్యలు వస్తూనే ఉంటాయి. తాజాగా ఓ ఇంటాయన పోలీసులకు కాల్ చేశాడు. తన కారు కింద ఓ మొసలి పిల్ల ఉందని చెప్పాడు. డోంట్ వర్రీ... దాన్ని పట్టేసుకుంటాం... అంటూ వచ్చిన పోలీసులు... ఎక్కడుంది... ఏదీ అంటూ హడావుడి చేశారు. కారు కిందకు లైటింగ్ వెయ్యగా... రెండు అడుగుల మొసలి పిల్ల (తోకతో కలిపి)... కనిపించింది. ఓస్... చిన్నదేగా... ఇట్టే పట్టేస్తాం... అంటూ... మొసలికి ఎదురుగా ఓ ఖాళీ పెయింట్ బకెట్‌ను పెట్టారు. కారు వెనక ఓ పోలీస్, కారు పక్కన మరో మహిళా పోలీస్... ఇద్దరూ రెండు సన్నటి కర్రలు పట్టుకొని... మొసలిని మెల్లగా... పెయింట్ బకెట్ వైపు నడిపించాలని ట్రై చేశారు. అది పిల్ల మొసలి కదా... చాలా చురుగ్గా ఉంది. ఒక్కసారి కారు కింద నుంచీ బయటకు వచ్చి... మహిళా పోలీసుపై ఉరికింది. అంతే... ప్రాణం పోయినట్లుగా... ఊపిరి ఆగినట్లుగా టెన్షన్ పడిన ఆమె... అక్కడి నుంచీ పరుగు పెట్టింది. మిగతా పోలీసులు కూడా చెల్లా చెదురుగా పారిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను... కేప్ కోరల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ స్వయంగా యూట్యూబ్‌లో షేర్ చేసింది.



కాసేపటి తర్వాత పోలీసులు మళ్లీ రిటర్న్ వచ్చారు. ఈసారి మొసలిని ముందుగా కారు నుంచీ బయటకు వచ్చేలా చేశారు. తర్వాత దాన్ని పట్టుకొని... దగ్గర్లోని అడవిలో ఉన్న నీటి కొలను దగ్గర వదిలేసినట్లు తెలిపారు. పోలీసులు షేర్ చేసిన పై వీడియోని చూసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

 


Pics : ఆగ్రా అందాల బ్యూటీ ఆషీ సింగ్ క్యూట్ స్టిల్స్




ఇవి కూడా చదవండి :Food : వెల్లుల్లి రొయ్యల కర్రీ... ట్రై చేశారా... చాలా ఈజీ...

టీ10 లీగ్‌లో సందడి చేసిన సన్నీలియోన్

వావ్... స్ట్రీట్ డాన్స్ ఇరగదీసిన నోరా ఫతేహి

పులి చర్మం డ్రెస్‌లో ఇలియానా... సోషల్ మీడియా షేక్...

టార్గెట్ రాహుల్... నేడు బీజేపీ దేశవ్యాప్త ఆందోళనలు

 
First published: November 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు