ఇమ్రాన్ ఖాన్ సభలో పాక్ వ్యతిరేక నినాదాలు

వాషింగ్టన్‌లో ప్రవాస పాకిస్థానీయులనుద్దేశించి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగిస్తుండగా...బలూచిస్థాన్ మద్దతుదారులు పాక్ వ్యతిరేక నినాదాలు చేశారు. బలూచిస్థాన్‌కు స్వేచ్ఛను ప్రసాదించాలంటూ నినాదాలు చేశారు.

news18-telugu
Updated: July 22, 2019, 11:46 AM IST
ఇమ్రాన్ ఖాన్ సభలో పాక్ వ్యతిరేక నినాదాలు
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(File)
  • Share this:
అమెరికాలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారిక పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌లోని ఓ ఇండోర్ స్టేడియంలో ఇమ్రాన్ ఖాన్ ప్రవాస పాకిస్థానీయులనుద్దేశించి ప్రసంగించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాన్ని అడ్డుకున్న కొందరు బలూచిస్థాన్ యువకులు..లేచి నిల్చొని పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు చేయడం కలకలం సృష్టించింది. బలూచిస్థాన్‌కు స్వేచ్ఛను ఇవ్వాలంటూ వారు నినాదాలు చేశారు. దాదాపు రెండున్నర నిమిషాల తర్వాత స్థానిక భద్రతా సిబ్బంది నిరసనకారులను బలవంతంగా బయటకు పంపారు. కొందరు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు నిరసనకారుల నినాదాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.


బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ ఆర్మీ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక బలూచిస్థాన్ దేశం కోసం అమెరికాలో నివసిస్తున్న ఆ ప్రాంతానికి చెందిన యువకులు గత కొంతకాలంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటన నేపథ్యంలో మరోసారి తమ నిరసన తెలిపారు.

First published: July 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...