news18-telugu
Updated: November 9, 2020, 8:35 AM IST
అబ్బనీ తియ్యనీ దెబ్బ.. చెంప దెబ్బల గేమ్ (credit - youtube)
A Game to Slap: ఈ ప్రపంచంలో ఎన్నో రకాల గేమ్స్ ఉన్నాయి. వాటిలో చెంప దెబ్బల గేమ్ ఒకటి. ఇది రష్యాలో ఫేమస్ కాని గేమ్. ఇది ప్రమాదకరమైన గేమ్ కాబట్టి... తక్కువ మందే ఆడుతారు. అందుకే ఇది ఫేమస్ కాలేదు. ఈ గేమ్ ఎవర్ని బడితే వాళ్లను ఆడనివ్వరు. పాల్గొనేవారు కొద్దిగానైనా బలంగా ఉండాలి. సినిమాల్లో చూపించినట్లు హీరో చెంపపై కొట్టగానే... కింద పడి... గిరిగిరా తిరిగి... మళ్లీ పైకి లేచి... మళ్లీ కొట్టించుకునేలా ఉండకూడదు. గేమ్ రూల్స్ ఎలా ఉంటాయంటే... పాల్గొనే ఇద్దరు వ్యక్తులు... ఎదురెదురుగా నిల్చోవాలి. చెంపలపై చేతులు పెట్టుకోకుండా... రెడీ అన్నట్లు ఉండాలి. చెంప దెబ్బ కొట్టే వ్యక్తి ముందుగా... తన ప్రత్యర్థిని కళ్లలో కళ్లు పెట్టి చూడాలి. అంటే కొట్టేందుకు రెడీ అయినట్లు అర్థం. ఆ సమయంలో... ప్రత్యర్థి తన చెంపను రెడీగా పెట్టాలే తప్ప... తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదు. అదీ మరి రూల్ అంటే.
ఈ గేమ్‌లో ఒకరి తర్వాత ఒకరు చెంపలపై కొట్టించుకుంటూనే ఉంటారు. ఇద్దరిలో ఎవరో ఒకరు... ఏదో ఒక స్టేజ్‌లో "వామ్మో... ఇంకొద్దు... నావల్ల కాదు" అనే పరిస్థితి వస్తుంది కదా... అప్పటివరకూ కొట్టుకుంటారు. అలా ఎవరో ఒకరు బతిమలాడటంతో... ఈ గేమ్ ముగుస్తుంది. కొట్టొద్దు అన్న వ్యక్తి ఓడిపోయినట్లే. బాక్సింగ్‌లో ఎలాగైతే రిఫరీ ఉంటారో... ఈ గేమ్‌లో కూడా ఒకరుంటారు. ప్లేయర్లు ఎప్పుడు కొట్టుకోవాలో, ఎప్పుడు ఆపాలో డిసైడ్ చేస్తారు.
ఈ గేమ్‌లో పాయింట్ల వంటివి ఏవీ ఉండవు. ఒకరి తర్వాత ఒకరు కొట్టించుకోవడమే. టైమ్ లిమిట్ కూడా ఉండదు. ఒక వ్యక్తి కొట్టాక... అవతలి వ్యక్తి... ఆ చెంప దెబ్బ తిని... కాసేపు ఆపసోపాలు పడి... తిరిగి కోలుకొని... తనను కొట్టిన వ్యక్తి చెంపను చెళ్లు మనిపిస్తాడు. అలా ఇద్దరికీ కోలుకునే ఛాన్స్ ఇస్తారు. దీన్ని స్థానికంగా బార్రికో గేమ్ అంటున్నారు. గత మార్చిలో క్రాస్ నాయెస్క్లోని సైబీరియన్ పవర్ షో ఈవెంట్లో ఈ చెంప దెబ్బలాట జరిగింది. అందులో వాసిలీ కామొటె స్కీ విజేతగా నిలిచాడు. అతను పొందిన గ్రాండ్ ప్రైజ్ రూ.32,000. వీడియో చూడండి.
"వీడియో చూశారుగా... అలా మీరు మాత్రం ట్రై చెయ్యకండి. ముందే చెప్పినట్లు ఇదో ప్రమాదకరమైన గేమ్. తేడా వస్తే... కంటికో, ముక్కుకో... ఇంకేదైనా అవయవానికో ప్రమాదం కలగొచ్చు" అంటున్నారు నిపుణులు.
Published by:
Krishna Kumar N
First published:
November 9, 2020, 8:35 AM IST