వాల్‌మార్ట్‌తో ఆరేళ్ల యూట్యూబ్ స్టార్ డీల్!

రేయాన్ టాయ్స్ రివ్యూ ఛానెల్‌తో యూట్యూబ్ స్టార్‌గా మారిన ఆరేళ్ల బాలుడు ఇప్పుడు సొంత బ్రాండ్‌ని మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాడు. వాటిని ఏకంగా వాల్‌మార్ట్‌లో అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం.

news18-telugu
Updated: July 31, 2018, 12:36 PM IST
వాల్‌మార్ట్‌తో ఆరేళ్ల యూట్యూబ్ స్టార్ డీల్!
(Image Courtesy: Reuters)
  • Share this:
రేయాన్... యూట్యూబ్‌లో వీడియోలు చూసేవారికి ఈ పేరు సుపరిచితం. అతని వయస్సు ఆరేళ్లు. 'రేయాన్ టాయ్స్ రివ్యూ' పేరుతో నిర్వహిస్తున్న ఆ బాలుడు యూట్యూబ్ స్టార్. యూట్యూబ్ ఛానెల్‌కు కోటిన్నర మందికిపైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారంటే అతని టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అతని రివ్యూలతోనే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం టాయ్స్ కొంటూ ఉంటారు. ఇప్పుడు ఆ ఆరేళ్ల బాలుడు సొంతగా టాయ్స్ బ్రాండ్‌ని స్టార్ట్ చేయడం మరో విశేషం.

'రేయాన్స్ వాల్డ్' పేరుతో రేయాన్ బ్రాండ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు మార్కెట్లోకి రానున్నాయి. వీటిని అమ్మేందుకు ఏకంగా వాల్‌మార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. వచ్చే నెల నుంచి తమ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటాయని వాల్‌మార్ట్ ప్రకటించింది. అమెరికాలోని 2,500 వాల్‌మార్ట్ స్టోర్లతో పాటు Walmart.com వెబ్‌సైట్‌లో ఆగస్టు 6 నుంచి రేయాన్స్ వాల్డ్ ప్రొడక్ట్స్‌ని ఎక్స్‌క్లూజీవ్‌గా అమ్మనున్నారు. అక్టోబర్‌లో మిగతా రిటైలర్ల దగ్గర కూడా ఈ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి.

రేయాన్ యూట్యూబ్ ఛానెల్ పిల్లలతో పాటు పెద్దల్నీ అలరిస్తూ ఉంటుంది. బొమ్మలతో ఆడుకుంటూ వాటి రివ్యూ చెప్పే వీడియోలకు ప్రతీ నెల వంద కోట్లకు పైగా వ్యూస్ ఉంటాయి. ఆన్‌లైన్ వీడియో స్టార్లను తయారుచేస్తున్న Pocket.watch బొమ్మలు, దుస్తులు, ఇతర ప్రొడక్ట్స్‌కు సంబంధించి లైసెన్స్ బాధ్యతల్ని చూస్తోంది. రేయాన్స్ వాల్డ్ ప్రొడక్ట్స్ అన్నీ మూడేళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం రూపొందించారు.
Published by: Santhosh Kumar S
First published: July 31, 2018, 12:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading