హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

గే తమ్ముడి దంపతుల బిడ్డకు జన్మనిచ్చిన అక్క.. వారి కోరిక తీర్చేందుకు..

గే తమ్ముడి దంపతుల బిడ్డకు జన్మనిచ్చిన అక్క.. వారి కోరిక తీర్చేందుకు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అక్కాతమ్ముడు, అన్నాచెల్లళ్ల మధ్య ఉండే బంధం ఎంత విలువనైదో అందరికి తెలిసిందే. వారి మధ్య ఉన్న ప్రేమ నిజంగా వెలకట్టలేనిదనే చెప్పాలి.

అక్కాతమ్ముడు, అన్నాచెల్లళ్ల మధ్య ఉండే బంధం ఎంత విలువనైదో అందరికి తెలిసిందే. వారి మధ్య ఉన్న ప్రేమ నిజంగా వెలకట్టలేనిదనే చెప్పాలి. ఇది అనేక సార్లు వివిధ రూపాల్లో వ్యక్తం అవుతూ ఉంటుంది. తాజాగా ఓ మహిళ తన గే తమ్ముడి కోసం ఎవరూ చేయని పనికి పూనుకుంది. తమ్ముడి కోసం తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా సరోగసి ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వివరాలు.. ఇంగ్లాడ్‌లోని మాంచెస్టర్‌కు చెందిన ఆంథోనీ డీగన్, రే విలియమ్స్ ఇద్దరు స్వలింగ సంపర్కులు. ఈ గే దంపతులు ఎంతో కాలంగా ఓ బిడ్డ కావాలని అనుకుంటున్నారు. సరోగసి ద్వారా బిడ్డకు పొందాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే యూకేలోని పలు స్వచ్చంద సంస్థలు ఏర్పాటు చేసిన సరోగసి కార్యక్రమాలకు హాజరవుతూ.. అన్వేషణ సాగించారు. అయితే ఏడాది పాటు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. అయితే ఆ గే జంటను అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. అంథోని సోదరి ట్రేసీ హల్స్‌కు ఈ విషయం తెలియడంతో.. సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిచ్చేందుకు ముందుకు వచ్చింది.

అయితే ట్రేసీ తీసుకున్న నిర్ణయానికి ఆమె భర్త అడ్డు చెప్పాడు. ట్రేసీ వయసు 40 ఏళ్లు దాటడం.. ఆమె ఇది వరకే ఆరుగురు పిల్లలకు తల్లి కావడంతో అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే ట్రేసీ మాత్రం తన తమ్ముడి కోరికను తీర్చాలని గట్టిగా ఫిక్స్ అయింది. అంథోనితో పాటు అతని భాగస్వామికి సాయం చేయడం కోసం.. సరోగసి ద్వారా బిడ్డను కనేందుకు సిద్దమైంది. దీంతో ఆ గే జంట సరోగసి ప్రక్రియ ఖర్చుల నిమిత్తం దాదాపు 36 వేల పౌండ్ల(36.8లక్షల) రుణం తీసుకున్నారు.

ఇక, ఇద్దరు వీర్యాన్ని దానం చేసినప్పటికీ.. పుట్టబోయే బిడ్డకు బయోలాజికల్ తండ్రి ఎవరనే విషయాన్ని తెలసుకోకూడదని గే దంపతులు డిసైడ్ అయ్యారు. సరోగసి ద్వారా గర్భం దాల్చిన ట్రేసీ 2020 అక్టోబర్ 12న మగ బిడ్డకు జన్మనిచ్చింది.

దీంతో అంథోని, రే దంపతులు ఆనందలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించి అంథోని మాట్లాడుతూ.. తన సోదరి ట్రేసీకి థ్యాంక్స్ చెప్పాడు. తాను, ట్రేసీ మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటామని తెలిపాడు. ట్రేసీ తన కోసం ఈ సాయం చేయడం తమ మధ్య బంధాన్ని మరింతగా పెంచిందన్నాడు. తన జీవితంలో ప్రత్యేకమైన క్షణాలను అందించిందని చెప్పాడు. ఆమె చేసిన సాయం వెలకట్టలేనిదని అన్నాడు.

Published by:Sumanth Kanukula
First published:

Tags: International news, Uk

ఉత్తమ కథలు