Home /News /international /

SINGAPORE COVID 19 PATIENTS WHO REMAIN UNVACCINATED BY CHOICE WILL HAVE TO PAY FOR THEIR HOSPITALISATION BILLS FROM DECEMBER 8 SSR

Unvaccinated Covid Patients: కరోనా సోకి వ్యాక్సిన్ తీసుకోని వారికి షాకిచ్చిన సింగపూర్ ప్రభుత్వం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసిన కోవిడ్-19 మహమ్మారి పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. దేశ ప్రజలను కాపాడుకునేందుకు శ్రమించిన దేశాల్లో సింగపూర్ ఒకటి.

    సింగపూర్: ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసిన కోవిడ్-19 మహమ్మారి పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. దేశ ప్రజలను కాపాడుకునేందుకు శ్రమించిన దేశాల్లో సింగపూర్ ఒకటి. వైరస్ బారిన పడిన వారిని వెంటనే గుర్తించడం, ఇతరులకు వ్యాపించే లోపు కోవిడ్-19 సోకిన వ్యక్తిని సకాలంలో గుర్తించి ఐసోలేషన్‌కు తరలించి చికిత్సనందించడంతో సింగపూర్ ఆ మహమ్మారి బారిన పడినప్పటికీ తట్టుకోగలిగింది. తమ దేశ ప్రజల్లో కోవిడ్-19 బారిన పడిన వారి చికిత్సకు అయిన ఖర్చంతా అక్కడి ప్రభుత్వమే భరించింది. వ్యాక్సినేషన్‌లో కూడా సింగపూర్ ఆ దేశ ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తోంది. కానీ.. కోవిడ్-19 సోకిన వారిలో కొందరు వ్యాక్సిన్ తీసుకునేందుకు ఇప్పటికీ ముందుకు రాకపోవడం పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో.. ఆ దేశ ప్రభుత్వం ఇలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆ దేశ వైద్యఆరోగ్య శాఖ మంత్రి వాంగ్ ఏ కుంగ్ కీలక ప్రకటన చేశారు.

    సోమవారం నాడు ఆయన మాట్లాడుతూ.. కోవిడ్-19 బారిన పడి ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోని వారి మెడికల్ బిల్లులను చెల్లించకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అయితే.. ఈ విషయంలో సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికీ అలాంటి వారి కోసం నెల రోజుల గడువు ఇచ్చింది. అప్పటికీ వ్యాక్సిన్ తీసుకోకపోతే డిసెంబర్ 8 నుంచి కోవిడ్-19 బాధితులు వారి చికిత్సకు అయ్యే ఖర్చు వాళ్లే చెల్లించాల్సి ఉంటుందని సింగపూర్ వైద్యఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.

    ఇది కూడా చదవండి: ఆఫ్ఘన్‌లో 7 నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికల కోసం తెరుచుకున్న పాఠశాలలు

    ఆసుపత్రుల్లో కోవిడ్-19కు చికిత్స పొందుతున్న వారిలో చాలామంది వ్యాక్సిన్ తీసుకోలేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇకనైనా అలాంటి వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు. ఇక దేశ పౌరుల విషయానికొస్తే.. ఫస్ట్ డోస్ తీసుకున్న వారు డిసెంబర్ 31 లోపు వైరస్ బారిన పడితే ఆ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోందని, వాళ్లు కూడా నిర్ణీత సమయంలో సెకండ్ డోస్ తీసుకోని పక్షంలో వాళ్లే హాస్పిటల్ ఖర్చులను కట్టుకోవాల్సి ఉంటుందని సింగపూర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. సింగపూర్‌లో కరోనా కేసులు ఇప్పటికీ కొంత కలవరపాటుకు గురిచేస్తుండటం గమనార్హం.

    ఇది కూడా చదవండి: US: 20 నెలల తర్వాత సరిహద్దులు తెరిచిన అమెరికా -విదేశీ ప్రయాణాలకు అనుమతి -భారతీయులకు ఊరట

    నవంబర్ 7న సింగపూర్‌లో కొత్తగా 2,553 కరోనా కేసులు, 17 మంది కరోనా కారణంగా మరణించడం అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. సింగపూర్‌లో ఐదు నుంచి 11 ఏళ్ల వయసున్న పిల్లలకు కూడా త్వరలో ఫైజర్-బయోన్‌టెక్ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్లు ఆ దేశ వైద్యఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. నవంబర్ రెండో వారం నుంచి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశముందని తెలిపారు. ఫైజర్ క్లినికల్ ట్రయల్స్‌లో యుక్త వయసులో ఉన్న వారికి ఇస్తున్న వ్యాక్సిన్ డోసేజ్‌లో One-Third ఐదు నుంచి 11 ఏళ్ల లోపు పిల్లలకు ఇవ్వొచ్చని ప్రతిపాదించడం, ఆ ప్రతిపాదనకు యూఎస్ ఎఫ్‌డీఏ ఆమోదం తెలపడంతో సింగపూర్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. సదరు వయసు ఉన్న చిన్నారులకు రెండు వేరువేరు డోసుల్లో వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. నాలుగేళ్లు అంతకంటే తక్కువ వయసున్న చిన్నారులకు కూడా వ్యాక్సిన్ ఇచ్చే సాధ్యాసాధ్యాలపై సింగపూర్ దృష్టి సారించింది. ఇదిలా ఉండగా.. సింగపూర్‌లో కొందరు చిన్నారులు కరోనా సంబంధిత ‘MIS-C’ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. సింగపూర్‌లో.. సంవత్సరం వ్యవధిలో దాదాపు 150 నుంచి 200 మంది చిన్నారులు ఈ వైరస్ బారిన పడినట్లు తెలిసింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Corona Vaccine, Covid, Covid patients, Singapore

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు