హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Singapore: భారతీయులకు సింగపూర్​ గుడ్​న్యూస్​.. ఆ దేశానికి వెళ్లడానికి విమాన సర్వీసుల పునరుద్దరణ

Singapore: భారతీయులకు సింగపూర్​ గుడ్​న్యూస్​.. ఆ దేశానికి వెళ్లడానికి విమాన సర్వీసుల పునరుద్దరణ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా భారత్​లో కూడా తగ్గుముఖం పట్టడంతో రవాణా ఆంక్షలను దేశాలు సడలిస్తున్నాయి. అందులో భాగంగానే భారత ప్రజలకు సింగపూర్ (Singapore)​ గుడ్​న్యూస్​ చెప్పింది. సింగపూర్‌కు అక్టోబర్ 26 నుంచి భారత్ ప్రయాణికులను అనుమతించనున్నారు.

కరోనా (corona) ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే. చాలా దేశాలు లాక్​డౌన్​ను పెట్టాయి. కరోనా తగ్గుముఖం పట్టాక ఆంక్షలు సడలించాయి. అయితే కోవిడ్ తీవ్రత ఎక్కువున్న దేశాలపై మాత్రం కొన్ని దేశాలు ఆంక్షలు సడలించలేదు. అందులో భారత్​పై కూడా చాలా దేశాలు కఠిన ఆంక్షలు (Strict sanctions) విధించాయి. ఇండియన్స్​ తమ దేశాలకు రాకుండా అంతర్జాతీయ విమానాలను (International flights) రద్దు చేశాయి. దీంతో ఆయా దేశాలకు భారత పౌరుల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే భారత్​లో కూడా తగ్గుముఖం పట్టడంతో రవాణా ఆంక్షలను దేశాలు సడలిస్తున్నాయి. అందులో భాగంగానే భారత ప్రజలకు సింగపూర్ (Singapore)​ గుడ్​న్యూస్​ చెప్పింది. సింగపూర్‌కు అక్టోబర్ 26 నుంచి భారత్ ప్రయాణికులను అనుమతించనున్నారు. భారత్‎తోపాటు బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక నుంచి వచ్చేవారిని కూడా అనుమతించనున్నారు. అక్టోబర్ 26 రాత్రి 11.59 గంటల నుంచి సింగపూర్‌లోకి ప్రవేశించడానికి అనుమతి ఇస్తున్నట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. కానీ ప్రయాణికులు గత 14 రోజుల్లో ఎక్కడ ఉన్నారో చెప్పాలి.

ప్రయాణికులు క్వారంటైన్ నియమాలను తప్పకుండా పాటించాలి. 10 రోజులు హోం క్వారంటైన్‎లో ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గతంలో సింగపూర్ (Singapore)​ మరో 15 దేశాల నుంచి పూర్తిగా టీకాలు వేసిన ప్రయాణికులకు అనుమతి ఇచ్చింది.

2021 నవంబర్ 21 వరకు..

వాటిలో ఇండోనేషియా (Indonesia), మలేషియా (Malaysia), వియత్నాం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United arb emirates) ఉన్నాయి. స్థానిక గృహాల్లో పని చేయడానికి టీకాలు వేయించుకున్న వారినే అనుమతించింది. కోవిడ్-19పై బహుళ-మంత్రిత్వ శాఖ టాస్క్‌ఫోర్స్ తీసుకున్న అనేక కొత్త చర్యలను కూడా ప్రకటించింది. ప్రస్తుతం అమలులో ఉన్న కఠినమైన ఆంక్షలను పొడిగించారు. 2021 నవంబర్ 21 వరకు ఒక నెల పాటు పొడిగించారు. జనవరి 1, 2022 నుండి పూర్తిగా టీకాలు వేసుకున్న వారు లేదా గత 270 రోజులలో కోవిడ్-19 నుండి కోలుకున్న ఉద్యోగులు (employees) మాత్రమే కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. టీకా (vaccine) వేయించుకోని ఉద్యోగులు కోవిడ్ నెగటివ్ (covid negative) అని ధ్రువపత్రం (certificate) చూపించాలని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి:  26 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌ ఇన్‌ఫ్లూయన్సర్ల డేటా లీక్​.. గుర్తించిన సెక్యూరిటీ పరిశోధకులు

అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు..

భారతదేశంలో సీనియర్ (Singapore)​ విమానయాన మంత్రిత్వ శాఖ (Aviation ministry) అధికారి ఒకరు అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలను తక్షణమే ఎత్తివేసే అవకాశం లేదని చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలు (International passengers flights) నిలిపివేశారు. అంతర్జాతీయ విమానాలను నడపడానికి భారతదేశం 25 కంటే ఎక్కువ దేశాలతో ఎయిర్ బబుల్ (air bubble) ఏర్పాట్లను కలిగి ఉంది


NFL​​లో 183 నాన్ ఎగ్జిక్యూటివ్​ పోస్టులకు నోటిఫికేషన్.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలివే!

First published:

Tags: Corona, Flight, India, International news, Passengers, Singapore

ఉత్తమ కథలు