హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Kamala Harris: కమలా హ్యారిస్ పర్పుల్ డ్రెస్ పై అమెరికన్ టీవీ షో జోస్యం.. మళ్లీ నిజమైందా..?

Kamala Harris: కమలా హ్యారిస్ పర్పుల్ డ్రెస్ పై అమెరికన్ టీవీ షో జోస్యం.. మళ్లీ నిజమైందా..?

కమలా హ్యారిస్ (ఫైల్)

కమలా హ్యారిస్ (ఫైల్)

అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా కమలా హ్యారిస్ రికార్డు సృష్టించారు. అయితే ప్రమాణానికి ముందు కమలా హ్యారిస్ ఏ దుస్తులు ధరిస్తారనే విషయంపై పెద్ద చర్చే జరిగింది. భారత సంప్రదాయాన్ని గౌరవిస్తూ చీర ధరిస్తారని చాలా మంది భావించారు. కానీ ఆమె మాత్రం...

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :

అమెరికాలో నూతన పాలన మొదలైంది. అగ్రరాజ్యానికి 46వ అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలి కమలా హ్యారిస్ బుధవారం(జనవరి 20న) ప్రమాణస్వీకారం చేశారు. దీంతో అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా కమలా హ్యారిస్ రికార్డు సృష్టించారు. అయితే ప్రమాణానికి ముందు కమలా హ్యారిస్ ఏ దుస్తులు ధరిస్తారనే విషయంపై పెద్ద చర్చే జరిగింది. భారత సంప్రదాయాన్ని గౌరవిస్తూ చీర ధరిస్తారని చాలా మంది భావించారు. అయితే ఆమె పర్పుల్ కలర్ సూట్ (Purple Colour suit) తో పాటు ముత్యాల హారాన్ని ధరించి ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ విషయాన్ని అమెరికాలో పాపులర్ టీవీ షో అయిన సింప్సన్స్ ముందుగానే ఊహించింది. ఊదా రంగు దుస్తులతో ప్రమాణం చేస్తారని కార్టూన్ రూపంలో ముందుగానే ఊహించి కార్యక్రమంలో ప్రదర్శించారు.

పర్పుల్ డ్రెస్ తో హాజరైన కమలా అందరిపై నిశ్శబ్ద ముద్ర వేశారు. ఈ దుస్తులను ఇద్దరు ఆఫ్రికన్ అమెరికన్లు డిజైన్ చేశారు. అయితే రంగు ఎంపిక మాత్రం దాదాపు దశాబ్దం క్రితమే ఊహించారు నెటిజన్లు. సింప్సన్స్ షో గత ఏడాది నుంచి ట్రెండింగ్ అవుతోంది.. 2020లో చాలా సంఘటనలను సరిపోలే విధంగా ముందుగానే ఊహించింది. ఈ ఏడాది కమలా హ్యారిస్ దుస్తులను ఊహించి తన జ్యోస్యాన్ని కొనసాగిస్తోంది. క్రిస్టోఫర్ జాన్ రోజర్స్, సెర్గియో హడ్సన్ రూపొందించిన ఈ దుస్తులను ఆమె ధరించారు.

2000లో బార్ట్ టు ద ఫ్యూచర్ అనే సింప్సన్ ఎపిసోడ్ లో రాబోయే యూఎస్ అధ్యక్షురాలిగా లీసా సింప్సన్ ను చూపించింది. అంతేకాకుండా ట్రంప్ పరిపాలన, బడ్జెట్ క్రంచ్ లాంటి విషయాలపై ప్రస్తావించారు. అయితే పర్పుల్ డ్రెస్సే కమలా హ్యారిస్ ఎందుకు ధరించారు? దీనికి కారణం దశాబ్దాల కిందటే షిర్లే క్రిష్మోల్ అనే నల్లజాతీయురాలు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేశారు.

' isDesktop="true" id="732770" youtubeid="ZtparSnQhFc" category="international">

మహిళల ఓటు హక్కు కోసం పోరాటం, కాంగ్రెస్‌కు ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతి మహిళ షిర్లే క్రిష్మోల్ గుర్తింపు తెచ్చుకున్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన తొలి నల్లజాతి మహిళ అయిన షిర్లేనే తన రాజకీయ జీవితానికి స్ఫూర్తి అని కమలా హ్యారిస్ ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. అందుకే షిర్లే గుర్తుగా కమలా ఈ పర్పుల్ కలర్ దుస్తులను ధరించారు. అలాగే పర్పుల్ సాంప్రదాయకంగా అమెరికాలో ద్వైపాక్షికతకు చిహ్నంగా భావిస్తారు. డెమొక్రాటిక్ పార్టీ రంగు నీలం, రిపబ్లికన్ పార్టీ రంగు ఎరుపు కలయిక ఇది.మాజీ ప్రథమ మహిళలు హిల్లరీ క్లింటన్, మిషెల్ ఒబామా కూడా కమలాతో పాటు ఊదా రంగు దుస్తులు ధరించారు. దేశవ్యాప్తంగా చాలా మంది మహిళలు మూత్యాల హారాలను మెడలో ధరించి కమలాకు మద్దతు తెలిపారు. ప్రమాణ స్వీకరోత్సవానికి ముందు కమలా తన తల్లిని గుర్తు చేసుకున్నారు. తను ఈ స్థాయికి రావడానికి తన తల్లే కారణమని తెలిపారు.

First published:

Tags: Kamala Harris, Trending, Us news, Viral, Viral Videos

ఉత్తమ కథలు