హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

యూఎస్ లోని యూనివర్సీటీలో సిక్కు విద్యార్థికి ఘోర అవమానం.. వీడియో వైరల్..

యూఎస్ లోని యూనివర్సీటీలో సిక్కు విద్యార్థికి ఘోర అవమానం.. వీడియో వైరల్..

సిక్కు విద్యార్థిని అరెస్టు చేస్తున్న పోలీసులు

సిక్కు విద్యార్థిని అరెస్టు చేస్తున్న పోలీసులు

Viral Video: షార్లెట్ లో ఉన్న నార్త్ కరోలినా యూనివర్సీటిలో ఒక సిక్కు విద్యార్థిని అమెరికా పోలీసులు అరెస్టు చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Goa, India

అమెరికాలో కొన్నిసార్లు భారతీయుల పట్ల జాత్యహాంకార దాడులు జరుగుతున్నాయి. కావాలనే అమెరికా వాళ్లు మీ దేశానికి వెళ్లిపోవాలని, అనేక రకాలుగా దుర్భాషాలాడిన సంఘటనలు కూడా అనేకం వార్తలలో నిలిచాయి. కొన్నిసార్లు... భారతీయులనే టార్గెట్ గా చేసుకుని గన్ తో కాల్పులు జరుపుతు మారణ హోమానికి పాల్పడిన సంఘటనలు కొకొల్లలు. ఈ కోవకు చెందిన మరోక ఘటన వెలుగులోనికి వచ్చింది. తాజాగా, భారతీయ సిక్కు విద్యార్థికి అమెరికాలో ఘోర అవమానం జరిగింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. అమెరికాలోని (america) యూనైటేడ్ షార్లెట్ నార్త్ కరోలినా యూనివర్సీటిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక సిక్కు విద్యార్థి కిర్పాన్ ధరించి క్యాంపస్ వచ్చినందుకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే.. సిక్కులు వారి మతంలో కొన్నింటిని తప్పనిసరిగా పాటించాలని వారి గ్రంథాలతు బోధిస్తున్నాయి. ప్రధానంగా ప్రతి ఒక్క సిక్కు ఖల్సా యొక్క ఐదు చిహ్నాలను పాటించాలి. అవేంటంటే.. కేషోర్, పొడగాటి జుట్టు గడ్డం, కంగ,, కచ్ఛ, కిర్పాన్ , కడలను ధరించాలి. ఇక్కడ కిర్పాణ్ అంటే కత్తి అని అర్థం. అయితే.. కిర్ఫాన్ ధరించి క్యాంపస్ కు రావోద్దని అధికారులు సూచించారు. కానీ అతగాడు దాన్నిపాటించలేదు.

యూఎస్ లో ఉన్న తన పవిత్ర మతంలో సూచించిన విధంగా పాటించాడు. దీంతో అతగాడిని పోలీసులు సంకెళ్లు వేసి అరెస్టుచేశారు. (Sikh Student With Kirpan) దీనిపై దేశ వ్యాప్తంగా సిక్కులు తీవ్రంగా స్పందిస్తున్నారు. భారతదేశంలో అనేక మతాలు, కులాలు ఉన్నాయని, వారివారి పవిత్రమైన ఆచారాలు, విధానాలు పాటిస్తాయని అన్నారు. ఈ ఘటనను ఖండిస్తు, వెంటనే దీనిపై యూనివర్సీటి అధికారులు క్షమాపణలు చెప్పాలని పిలుపునిచ్చారు.

అమెరికాలో భారత రాయబారులు వెంటనే దీనిపై తగిన విధంగా చర్యలు తీసుకొవాలని సిక్కులకు చెందిన పలువురు నాయకులు కోరుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (Viral video)  మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. యూనివర్సీటి అధికారుల తీరుపై మండిపడుతున్నారు. వెంటనే సిక్కులందరికీ క్షమాపణలు చెప్పాలని కామెంట్ లు పెడుతున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: America, VIRAL NEWS, Viral Video

ఉత్తమ కథలు