చచ్చినట్లు నాకే ఓటేయాలి... అమెరికన్లను భయపెడుతున్న ట్రంప్..

Donald Trump : అమెరికన్లకు ఉద్యోగాలు రావాలంటే కచ్చితంగా తననే గెలిపించాలని 2016లో ట్రంప్ ప్రచారం సాగించి విజయం సాధించారు. ఇప్పుడు 2020 టార్గెట్‌గా ఆయన... ఆర్థిక మాంద్యం అంశాన్ని లేవనెత్తారు. అమెరికన్లకు తానే దిక్కంటున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 18, 2019, 7:19 AM IST
చచ్చినట్లు నాకే ఓటేయాలి... అమెరికన్లను భయపెడుతున్న ట్రంప్..
డోనాల్డ్ ట్రంప్ (Getty Images)
  • Share this:
Donald Trump : 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండటంతో... అక్కడి రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్... వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ... వాటిపై అందరూ చర్చించుకునేలా చేస్తూ... ప్రజల నోట్లో తన పేరు నానేలా చేసుకుంటున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... "మీరంతా టీడీపీకే ఓటేయాలి. మీ కోసం ఎన్నో చేశాం. టీడీపీని గెలిపించడం మీ బాధ్యత" అంటూ... "నాకు కాక ఎవరికి వేస్తారు" అని నిలదీస్తూ ప్రచారం సాగించారు. ఫలితం ఏం జరిగిందో అందరికీ తెలుసు. ట్రంప్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. అమెరికన్లకు తానే దిక్కనీ, తనను గెలిపించకపోతే... అమెరికా పని అయిపోతుందనీ, ఆర్థిక మాద్యం వచ్చి... ప్రజలంతా రోడ్డున పడతారనీ, అమెరికా మరిన్ని అప్పుల్లో కూరుకుపోయి దివాళా తీస్తుందనీ రకరకాల కామెంట్లతో ప్రజలను భయపెడుతున్నారు.

ట్రంప్ మాటల్ని అలా ఉంచితే... మరోసారి ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాద్యం వచ్చేస్తుందేమోనన్న టెన్షన్‌లో ఉన్నాయి. ఇండియాలో కూడా ఈ టెన్షన్ ఉంది. మన పారిశ్రామిక వృద్ధి రేటు పడిపోతోంది. ఇది ప్రమాదకర సంకేతం. ముందుగానే మేల్కొనకపోతే... ఉన్న ఉద్యోగాలు కూడా పోయి... నిరుద్యోగం ఎక్కువై... దేశ ఆర్థిక వ్యవస్థ పతనమయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ విషయంలో మన కంటే అమెరికాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. 2008లో ఇలాగే అమెరికాలో మాంద్యం వచ్చి... ఆ ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపైనా పడింది. ఇప్పుడు మళ్లీ ట్రంప్ మాంద్యం మాట ఎత్తడంతో... అమెరికాలో కలకలం రేగింది.

చెప్పాలంటే... ఆమెరికాలో ట్రంప్ పాలన అంత గొప్పగా ఏమీ లేదు. నిరుద్యోగం పెరిగింది, అప్పులు పెరిగాయి, వృద్ధి రేటు పడిపోయింది. ఓవరాల్‌గా అమెరికా పరిస్థితి ఏడ్చినట్లుంది. అందుకే ఓటర్లు... ట్రంప్‌ని చూసి తమ ఖర్మ అనుకుంటున్నారు. ఏదో చేస్తాడని గెలిపిస్తే... అడ్డంగా ముంచేస్తున్నాడని మండిపడుతున్నారు. ట్రంప్ మాత్రం... తన తప్పేమీ లేదనీ... అంతా ఫెడరల్ రిజర్వ్ (అమెరికా RBI) తీసుకున్న నిర్ణయాల వల్లే ఇలా అవుతోందని చాడీలు చెబుతున్నారు. పైగా అమెరికా మీడియా కావాలని తనను టార్గెట్ చేస్తోందనీ, అబద్ధాలు చెబుతోందని ఫైర్ అవుతున్నారు.

సహజంగానే బిజినెస్ పర్సనైన ట్రంప్... వాణిజ్యపరమైన అంశాల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీని వల్ల అమెరికా వాణిజ్యం నెమ్మదించింది. చైనా లాంటి దేశాలు... ఆమెరికాకు దూరమవుతున్నాయి. దీనంతటికీ ట్రంపే కారణం అంటున్నారు అక్కడి రాజకీయ విశ్లేషకులు. బలమైన ఆర్థిక సంస్కరణలు తీసుకురాకపోతే... అమెరికాకు మాంద్యం కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

First published: August 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు