రష్యా (Russia) లో ఘోర ప్రమాదం జరిగింది. సైబీరియా (Siberia) ప్రాంతంలో ఉన్న లిస్ట్వజ్నాయ బొగ్గు గనిలో ( Listvyazhnaya coal mine) భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 52 మంది మరణించారు. వీరిలో కార్మికులతో పాటు సహాయక చర్యలకు కోసం వచ్చిన రెస్క్యూ వర్కర్స్ (Rescue workers) కూడా ఉన్నారు. ఐతే 260 మందిని మాత్రం సురక్షితంగా కాపాడగలిగారు. భూమి 250 లోతులో ఉన్న బొగ్గు గనిలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. సహాయక సిబ్బంది 11 మృతదేహాలను వెలికితీశారు. మిగతా వారి ఆచూకీ తెలియలేదు. వారంతా చనిపోయినట్లుగా రష్యా అధికారులు ప్రకటించారు. ఎందుకంటే బొగ్గు గనిలో అత్యంత హానికరమైన మిథేన్ (Methane), కార్బన్ మోనాక్షైడ్ (Carbon monoxide ) వ్యాపించాయి. వాటి వల్లే గనిలో పేలుడు జరిగింది. ఈ నేపథ్యంలోనే బొగ్గు గనిలో సహాయక చర్యలను నిలిపివేసినట్లు అధికారు తెలిపారు. 52 మంది మరణించినట్లు ప్రకటించారు.
అతడికి ఓ రాయి దొరికింది.. అదే అతడి జీవితాన్ని మార్చేసింది.. ఇంతకు ఏంటి దీని ప్రత్యేకత అంటే
గనిలో పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. లోపల దట్టమైన పొగలు అలుముకున్నాయి. కొందరు మంటల్లో కాలిపోయి మరణిస్తే.. మరికొందరు ఆ పొగలతో ఊపిరాడక కన్నుమూశారు. బొగ్గు గని వెంటిలేషన్ షాప్ట్స్ నుంచి పెద్ద ఎత్తున పొగలు బయటకు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చూస్తుండగానే ఘోరం జరిగిపోయిందని, లోపల చిక్కుకున్న వారిని కాపాడలకపోయామని కన్నీరు పెట్టుకున్నారు.
Pakistan: పైసలు లేవు.. పన్నులు కట్టండి.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
''గనిలో నిప్పు రవ్వ కారణంగా మిథేన్ గ్యాస్ మండి పేలుడు సంభవించినట్లుగా అనిపిస్తోంది. గని లోపల ఉన్న కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నించాయి. కానీ గని లోపల హానికర వాయువులు, మంటల కారణంగా అందరినీ కాపాడడం సాధ్యపడలేదు.'' అని రష్యా డిప్యూటీ ప్రాసిక్యూటర్ జనరల్ దిమిత్రి డెమెషిన్ తెలిపారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బొగ్గు గని యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే బొగ్గు గని డైరెక్టర్‌తో పాటు ఆయన డిప్యూటీ, సైట్ మేనేజర్‌ను కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coal Mine, Explosion, Fire Accident, Russia