హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Taiban: తాలిబన్ల అరాచకం.. మనిషిని హెలికాఫ్టర్‌కు వేలాడదీసి చక్కర్లు కొట్టారు.. వైరల్‌గా మారిన వీడియో..

Taiban: తాలిబన్ల అరాచకం.. మనిషిని హెలికాఫ్టర్‌కు వేలాడదీసి చక్కర్లు కొట్టారు.. వైరల్‌గా మారిన వీడియో..

(Image-Twitter)

(Image-Twitter)

ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్లు వెళ్లిన కొద్ది గంటల్లోనే.. అక్కడ తాలిబన్ల అరాచకం రాజ్యమేలుతున్నదని చెప్పడానికి సాక్ష్యంగా వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆఫ్ఘనిస్తాన్‌ను చేతుల్లోకి తీసుకన్న తాలిబన్లు వారి దురాగతాల కొనసాగిస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్(Afghanistan) నుంచి అమెరికా దళాలు పూర్తిగా వెనుదిరిగాయి. దీంతో తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు జరుపుకున్నారు. అయితే తాలిబన్లు పైకి శాంతి మంత్రం జపిస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. కాబూల్‌ను(Kabul) అక్రమించిన నాటి నుంచి తాలిబన్లు(Taliban) మరింతగా రెచ్చిపోతున్నారు. తమకు వ్యతిరేకంగా పనిచేసినవారి కోసం గాలింపు చేపట్టారు. వారిని హింసలకు గురిచేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా అఫ్గాన్‌లో మహిళలపై పలు ఆంక్షలు విధిస్తున్నారు. అఫ్గాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి.

అయితే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్లు వెళ్లిన కొద్ది గంటల్లోనే.. అక్కడ తాలిబన్ల అరాచకం రాజ్యమేలుతున్నదని చెప్పడానికి సాక్ష్యంగా వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తిని తాడు సాయంతో హెలికాఫ్టర్‌ నుంచి వేలాడదీశారు. కాందాహార్‌‌లో(Kandahar) ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా సమాచారం. చాలా మంది ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తాలిబాన్లు ఒక వ్యక్తిని చంపి కందహార్ ప్రాంతంలో అమెరికన్ బ్లాక్ హాక్ హెలికాప్టర్‌(US Black Hawk chopper) నుంచి వేలాడదీశాడని కొందరు జర్నలిస్టులు పేర్కొన్నారు. అయితే అలా వేలాడదీయబడిన వ్యక్తి ఎవరూ, అతను చనిపోయాడా..?, లేక ప్రాణాలతో ఉన్నాడా.. అనే విషయాలపై స్పష్టత లేదు. కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఆ వ్యక్తిని చంపిన తర్వాత అలా వేలాడదీశారని పేర్కొన్నాయి. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన లీజ్ వీలర్ అనే అమెరిన్ మహిళ.. దీనికి జో బైడెన్‌ కారణమని పేర్కొన్నారు.

Kamareddy: కామారెడ్డిలో వివాహిత గొంతు కోసిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. అసలు నిజాన్ని బయటపెట్టిన పోలీసులు..


ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి అరాచకాలు చాలానే చూడాల్సి వస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.Telangana: పెళ్లైన రెండో రోజే మృత్యు ఒడికి చేరిన నవ వధువు.. మృతదేహాన్ని మోసిన ఎమ్మెల్యే..

ఇక, ఆఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాలు పూర్తిస్థాయిలో వెనుతిరిగాయి. కొన్ని నెలలుగా ఆఫ్గానిస్థాన్ నుంచి తమ సేనలను, అక్కడ తమకు ఆశ్రయం ఇచ్చిన కొందరు ఆప్ఘన్ పౌరులను అమెరికా (United States)తరలిస్తున్న అగ్రరాజ్యం.. సోమవారం ఆ పనిని పూర్తి చేసినట్టు ప్రకటించింది. సోమవారం కాబూల్(Kabul) నుంచి చివరి విమానం బయలుదేరినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ అధిపతి జనరల్ ఫ్రాంక్ మెకెంజీ తెలిపారు.

First published:

Tags: Afghanistan, Taliban, Viral Video

ఉత్తమ కథలు