Home /News /international /

SHOCKING REPORT SAYS THAT OVER 300000 CHILDREN ABUSED IN ROMAN AATHOLIC CHURCH IN FRANCE FULL DETAILS HERE PRN GH

Shocking: చర్చిలో పాడుపని... 3లక్షల మంది చిన్నారులపై లైంగిక వేధింపులు... సంచలన నివేదికలో వెల్లడి

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Roman Catholic Church: ముక్కు పచ్చలారని పసిబిడ్డలను లైంగికంగా వేధించడమే తప్పు. అలాంటిది ఆ పాడుపని చర్చిలో చేస్తే.. దాన్ని మన్నించరాని నేరంగా పరిగణించవచ్చు. ప్రార్ధన చేయాల్సిన పవిత్రమైన చర్చిలో లైంగిక దాడులు జరగడం ఏంటని విస్తుపోకండి.

ఇంకా చదవండి ...
ముక్కు పచ్చలారని పసిబిడ్డలను లైంగికంగా వేధించడమే తప్పు. అలాంటిది ఆ పాడుపని చర్చిలో చేస్తే.. దాన్ని మన్నించరాని నేరంగా పరిగణించవచ్చు. ప్రార్ధన చేయాల్సిన పవిత్రమైన చర్చిలో లైంగిక దాడులు జరగడం ఏంటని విస్తుపోకండి. ఫ్రాన్స్‌ (France) లోని ఒక చర్చిలో తరచూ పిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతుంటాయి. ఈ దేశంలోని రోమన్ కాథలిక్ చర్చి (Roman Catholic Church)లో లైంగిక దాడులు జరగడం వల్ల అది ప్రపంచ దేశాల దృష్టిలో అప్రతిష్ట మూటగట్టుకుంది. ఈ క్రమంలో ఓ ఫ్రెంచ్ నివేదిక సంచలన నిజాలు బయట పెట్టింది. గడిచిన 70 ఏళ్లలో ఫ్రాన్స్‌లోని కాథలిక్ చర్చిలో 3,30,000 మంది పిల్లలు లైంగిక వేధింపులకు గురయ్యారని ఈ నివేదిక అంచనా వేసింది. ఈ నివేదికను ఒక ఇండిపెండెంట్ కమిషన్ రూపొందించింది.. ఈ నివేదికను కమిషన్ ప్రెసిడెంట్ జీన్-మార్క్ సావే జారీ చేశారు. శాస్త్రీయ పరిశోధన, ప్రీస్ట్ ల దాడులు, ఇతర మతాధికారులతో పాటు చర్చిలో పాల్గొన్న మతేతర వ్యక్తుల లైంగిక వేధింపుల ఆధారంగా బాధితుల సంఖ్యను నివేదిక అంచనా వేసిందని జీన్-మార్క్ తెలిపారు. బాధితుల్లో 80 శాతం మంది మగపిల్లలే ఉన్నారని వెల్లడించారు.

ఇండిపెండెంట్ కమిషన్ ఫ్రాన్స్‌లోని కాథలిక్ చర్చి గురించి 2,500 పేజీల నివేదికను ప్రిపేర్ చేసింది. ఈ నివేదికలో చర్చిలో జరిగిన సిగ్గుమాలిన చర్యల గురించి వివరించింది. నివేదిక ప్రకారం, 3,000 మంది పిల్లలను లైంగికంగా వేధించిన వారిలో మూడింట రెండు వంతుల మంది ప్రీస్ట్ (priests)లే ఉన్నారు. వీరు గతంలో చర్చిలో పనిచేశారు. క్రైస్తవ మతాధికారులతో పాటు ఇతర మతాధికారులు 2,16,000 మందిపై లైంగికంగా వేధించారని నివేదిక అంచనా వేసింది.

ఇది చదవండి: ఆ వీడియోలను అమ్ముకుని నెలకు రూ.30 లక్షలు సంపాదించిన భార్యాభర్తలు.. ఇప్పుడొచ్చిన సమస్యేంటంటే..


ఈ నివేదికను రెడీ చేయడానికి కమిషన్ 2 1/2 సంవత్సరాలు పనిచేసింది. బాధితులు, సాక్షుల మాటలు, చర్చి, కోర్టు, పోలీస్, 1950 కాలం నుంచి వచ్చిన వార్తా కథనాల ఆధారంగా కమిషన్ డేటాని సేకరించింది. అలాగే ఒక ఫోన్ నంబర్ ఏర్పాటు చేసింది. ఈ నంబర్ కి బాధితులు లేదా బాధితురాలను తెలిసిన వ్యక్తుల నుంచి 6,500 కాల్‌లు వచ్చాయి. లైంగిక దాడులను అరికట్టడానికి కమిషన్ 45 సిఫార్సులను జారీ చేసింది. ఇందులో క్రైస్తవ మతాధికారులకు, ఇతర మతాధికారులకు శిక్షణ ఇవ్వడం, చర్చిని పరిపాలించడానికి వాటికన్ ఉపయోగించే చట్టపరమైన కోడ్ కానన్ చట్టాన్ని సవరించడం వంటివి ఉన్నాయి. బాధితుల సంఘం 'పార్లర్ ఎట్ రివివ్రే' ( బహిరంగంగా మాట్లాడండి, మళ్లీ జీవించండి) అధిపతి అయిన ఒలివియర్ సావిగ్నాక్ ఫ్రెంచ్ నివేదిక విచారణకు సహాయపడ్డారు.

ఇది చదవండి: మహిళలను ఆ ప్రదేశంలో ఫొటోలు, వీడియోలు తీస్తే జైలుకే.. వివరాలిలా..


ఈ వేధింపులలో బాధితులైన వారు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటున్నారని మార్క్ సావే విచారం వ్యక్తం చేశారు. బాధితుల్లో దాదాపు 60% మంది పురుషులు, మహిళలు వారి లైంగిక జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. 2000 వరకు చర్చి అవలంభించిన తీరును అతను తిట్టి పోశారు. బాధితుల పట్ల ఎలాంటి సానుభూతి చూపించకుండా, వారి మాటలు నమ్మకుండా చర్చి నిర్వాహకులు, పోలీసులు తప్పు చేశారని మార్క్ సావే అసహనం వ్యక్తం చేశారు. ఇంకా సజీవంగా ఉన్న నేరస్తులపై 40కి పైగా కేసులు ఉన్నాయి. ఈ కేసులను చర్చి అధికారులకు ఫార్వర్డ్ చేస్తామని ఆయన తెలిపారు. మరో 22 కేసుల్లో బాధితులకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

ఇది చదవండి: మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర కార్టూన్స్ గీసి ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన స్వీడిష్ ఆర్టిస్ట్ దుర్మరణం..గత ఏడాది ప్రేనాట్ అనే ఒక ప్రీస్ట్ ని మైనర్లను లైంగికంగా వేధించిన కేసులో దోషిగా నిర్ధారించింది కోర్టు. విచారణలో అతడు 75 మంది అబ్బాయిలపై లైంగిక దాడి చేసినట్లు అంగీకరించాడు. దాంతో కోర్టు అతడికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఇతడి బాధితుల్లో ఒకరు మాట్లాడుతూ.. తాజా నివేదిక ఫ్రెంచ్ చర్చి వ్యవస్థను సమూలంగా మార్చేందుకు సహాయ పడుతుందన్నారు. బాధితులపై జరిగిన నేరాలను గుర్తించడమే కాదు వారికి పరిహారం కూడా చెల్లించాల్సిన బాధ్యత చర్చికి ఉందని అభిప్రాయపడ్డారు. చర్చిలో జరిగే లైంగిక వేధింపులను నివారించేందుకు పోప్ ఫ్రాన్సిస్ మే 2019 లో కొత్త చర్చి చట్టాన్ని జారీ చేశారు. ఈ చట్టం చర్చిలో ఉన్నత అధికారులు తప్పు చేస్తే.. వాటిని వెంటనే ఫిర్యాదు చేసే హక్కుని ఇతర మతాధికారులకు కల్పిస్తుంది.
Published by:Purna Chandra
First published:

Tags: Child rape, France

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు