ఆశ్చర్యం... అక్వేరియంలో ఒంటరి ‘మగ’ అక్టోపస్‌‌కు పిల్లలు...

అక్వేరియంలో ఒంటరితనాన్ని తట్టుకోలేక లింగం మార్చుకుని, పిల్లలకు జన్మనిచ్చిన మగ అక్టోపస్... ఆశ్చర్యకర పరిణామంపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 8, 2018, 6:36 PM IST
ఆశ్చర్యం... అక్వేరియంలో ఒంటరి ‘మగ’ అక్టోపస్‌‌కు పిల్లలు...
అక్టోపస్ నమూనా చిత్రం (Photo: Wikipedia)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 8, 2018, 6:36 PM IST
అప్పుడప్పుడూ కొన్ని వింతలూ, విశేషాలు జరుగుతూ జనం దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటుటాయి. తాజాగా జార్జియాలో ఇలాంటి వింత సంఘటనే ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. జార్జియాలోని యూజీఏ మెరైన్ ఎడ్యూకేషన్ సెంటర్ అండ్ అక్వేరియంలో ఓ మగ అక్టోపస్ కోసం సెపరేట్ క్యాబిన్ ఏర్పాటు చేశారు. అయితే అక్వేరియం చూడడానికి వచ్చిన ఓ వ్యక్తిని అక్టోపస్ ఎందుకో తేడాగా అనిపించింది. తీక్షణంగా చూడగా అక్టోపస్ కింద కొన్ని పిల్లలు కనిపించాయి అయితే వివరాల బోర్డు మీద ‘మగ అక్టోపస్’ అని రాసి ఉండడంతో అతను ఆశ్చర్యపోయి అధికారులకు సమాచారం అందించాడు. వాళ్లు అక్టోపస్‌ను పరీక్షించగా... మగ అక్టోపస్‌ కొన్ని వేల పిల్లలను పెట్టినట్టు ఖరారు చేశారు.

నిజానికి అక్టోపస్‌ల పునరుత్పత్తి విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆడ అక్టోపస్‌తో సంపర్కం చేసిన తర్వాత కెమికల్ రియాక్షన్స్ కారణంగా మగ అక్టోపస్‌లు చనిపోతాయి. ఆడ అక్టోపస్‌లు మాత్రం పది వేల నుంచి 70 వేల దాకా గుడ్లను శరీరంలో 160 రోజులు పాటు దాచుకుని పొదుగుతాయి. నీటి సాంద్రతను బట్టి అక్టోపస్‌ల పొదుగు కాలం పెరుగుతుంది. గర్భంతో ఉన్నంతకాలం ఆడ ఆక్టోపస్ ఏమీ తినకుండా ఉపవాసం చేస్తుంది. గుడ్లు పొదిగి, పిల్లలు బయటికి వచ్చిన తర్వాత చనిపోతుంది. కానీ విచిత్రంగా అక్వేరియంలోని అక్టోపస్ ఒంటరితనాన్ని తట్టుకోలేక సహజంగా లింగం మార్చుకుని, పిల్లలకు జన్మనివ్వడం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. పిల్లలను బయటికి తీసిన అధికారులు, నర్సరీ ట్యాంక్స్‌లో పరిరక్షిస్తున్నారు. అక్టోపస్ లింగాన్ని ఎలా మార్చుకుందనే విషయంపై అధ్యయనం చేస్తున్నారు శాస్త్రవేత్తలు.


First published: November 8, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...