నట్ ఎలర్జీ ఉందా... టాయిలెట్‌లో కూర్చోండి... ఇండియన్స్‌కి ఎమిరేట్స్ ఫ్లైట్ సిబ్బంది వింత సూచన

Emirates Flight : ప్రపంచంలో అత్యుత్తమమైన ఫ్లైట్ సర్వీస్ తమదేనని చెప్పుకుంటోంది ఎమిరేట్స్ మేనేజ్‌మెంట్. కానీ, ఈ ఇండియన్స్‌కి జరిగిన అవమానం తెలుసుకుంటే, ఎమిరేట్స్ సిబ్బంది అంత అవమానకరంగా మాట్లాడతారా అని అనిపించకమానదు.

news18-telugu
Updated: February 3, 2019, 3:46 PM IST
నట్ ఎలర్జీ ఉందా... టాయిలెట్‌లో కూర్చోండి... ఇండియన్స్‌కి ఎమిరేట్స్ ఫ్లైట్ సిబ్బంది వింత సూచన
ఎమిరేట్స్ ఫ్లైట్ (Image : Twitter)
news18-telugu
Updated: February 3, 2019, 3:46 PM IST
షన్నెన్ సహోతా(24), సుదీప్ సహోతా(33) ఇద్దరూ భారతీయులే. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ ఎయిర్‌పోర్ట్‌ నుంచీ దుబాయ్ వెళ్లేందుకు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కారు. ఫ్లైట్ ఎక్కే ముందే, తమకు జీడిపప్పులంటే పడవనీ, తమకు "నట్ ఎలర్జీ" ఉందని చెప్పారు. అలాంటి ఆహార పదార్థాలు తమకు పెట్టవద్దనీ, జీడిపప్పు లేకుండా ఉండే ఆహార పదార్థాలు ఉంటేనే తాము ఫ్లైట్ ఎక్కుతామని అధికారులకు చెప్పారు. అంతకుముందు టికెట్ బుకింగ్, చెకింగ్ సమయంలో కూడా ఇదే విషయాన్ని వాళ్లు గుర్తు చేశారు. ఆందోళన చెందవద్దన్న అధికారులు... ఎలాటి ఆహారం కావాలంటే అలాంటిదే ఇస్తామని చెప్పారట. తీరా ఫ్లైట్ ఎక్కాక... అందులో సిబ్బంది సెర్వ్ చేసే ఆహార పదార్థాలన్నింటిలోనూ జీడిపప్పు, బాదం పప్పు, ఇతరత్రా నట్స్ కచ్చితంగా ఉంటున్నాయి. దీనిపై కోపం వచ్చిన ఆ ఇద్దరూ... తమకు నట్ ఎలర్జీ ఉందని చెప్పినా... మళ్లీ మళ్లీ నట్స్ ఉన్న పదార్థాలే ఎందుకు తెస్తున్నారని ఒకింత ఫైర్ అయ్యారు. దానికి ఫ్లైట్ సిబ్బంది ఇచ్చిన సలహా... వాళ్లిద్దరూ షాక్ అయ్యేలా చేసింది.

మీకు నట్ ఎలర్జీ ఉంటే... టాయిలెట్‌లోకి వెళ్లి... కుషన్లు, పిల్లోలతో కూర్చోండి అని సలహా ఇచ్చారట ఫ్లైట్ సిబ్బంది. చిర్రెత్తుకొచ్చిన షన్నెన్ సహోతా, సుదీప్ సహోతా... ఫ్లైట్ సిబ్బంది తీరును నిరసిస్తూ... విమానం దిగే వరకూ 7 గంటలపాటూ... విమానం వెనక సీట్లకు వెళ్లి... మొహాలపై దుప్పట్లు వేసుకొని ఉండిపోయారట. తమ పేరెంట్స్ 60వ బర్త్‌డే జరుపుదామని దుబాయ్ వెళ్తున్న తమకు ఆ రోజు మూడ్ అప్‌సెట్ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు వాళ్లిద్దరూ.

దీనిపై స్పందించిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ మాట మార్చినట్లు తెలుస్తోంది. ప్రయాణికులందరికీ అనుకూలమైన ఆహార పదార్థాలనే అందిస్తామన్న ఎయిర్‌లైన్స్... నట్స్ (జీడిపప్పులు, బాదం, పిస్తా లాంటివి) లేని ఆహార పదార్థాలను అందిస్తామన్న గ్యారెంటీ మాత్రం ఇవ్వట్లేదని తెలిపింది. పైగా... వాళ్లకు నట్ ఎలర్జీ ఉన్నట్లుగా తమకు ఎక్కడా రికార్డుల్లో రాసి ఇవ్వలేదని మేనేజ్‌మెంట్ తెలిపింది.

 

Video: ఓటేయలేదని ఇంటికి నిప్పు.. ఓడిన అభ్యర్థి దౌర్జన్యం
First published: February 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...