తల్లిదండ్రుల సమాధి వద్ద నివాళి అర్పిస్తుండగా షాక్... ఎవరో ఆమెను భూమిలోకి లాగేస్తున్న ఫీలింగ్..

బాధితురాలు శ్మశానవాటిక నిర్వాహకులపై 5 మిలియన్ డాలర్ల నష్ట పరిహారం కోసం కోర్టుకు వెళ్లింది. తనకు తగిలిన గాయాలతో పాటు తాను అనుభవించిన మనోవేదనకుగాను డబ్బులు చెల్లించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

news18-telugu
Updated: March 18, 2019, 7:37 PM IST
తల్లిదండ్రుల సమాధి వద్ద నివాళి అర్పిస్తుండగా షాక్... ఎవరో ఆమెను భూమిలోకి లాగేస్తున్న ఫీలింగ్..
శ్మశానం ప్రతీకాత్మక చిత్రం (Image: Reuters)
  • Share this:
మీరు హార్రర్ సినిమాలు చూస్తుంటారా? అందులో శ్మశాన వాటికలో నుంచి చేతులు బయటకు రావడం, అక్కడ నివాళి అర్పించేందుకు వచ్చిన వారి కాళ్లు పట్టుకుని భూమిలోపలికి లాగేయడం లాంటి సీన్లు గుర్తున్నాయా? సినిమా రీల్స్‌లో ఇలాంటివి చూస్తుంటారు కానీ, ఆమెకు రియల్ లైఫ్‌లోనే ఇలాంటి ఘటన ఒకటి ఎదురైంది. అయితే, చేతులు బయటకు వచ్చి, ఆమెను భూమిలోపలికి లాక్కెళ్లేంత నాటకీయత లేకపోయినా.. హారర్ సినిమాకు ఏమాత్రం తీసిపోని భయం ఆమెను వెంటాడింది. అమెరికాలోని లాండ్ ఐలాండ్ శ్మశానవాటికలో ఉన్న తన తల్లిదండ్రుల సమాధుల వద్దకు ఓ యువతి వచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం. తన పేరెంట్స్‌ గురొస్తే వారి సమాధుల వద్దకు వచ్చింది.

ఆ యువతి శ్మశానవాటికలో ఉన్న సమాధుల మధ్యలో నుంచి తన తల్లిదండ్రులు ఉన్న సమాధి వద్దకు వెళ్లింది. సమాధి వద్ద కాళ్ల వైపు నిలబడి ప్రార్థన చేస్తోంది. అంతలో పెద్ద శబ్దం. అంతే ఆమె గుండె ధడేల్మంది. ఆమె కాళ్ల కింద భూమి కంపించింది. ఆమె నిలబడిన చోట పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆమె అందులో కూరుకుపోతోంది. మొదట మోకాళ్లు, మెల్లమెల్లగా నడుం వరకు దిగిపోయింది. ఓ వైపు తల్లిదండ్రుల సమాధిని గట్టిగా పట్టుకుని ఆమె కేకలు వేస్తోంది. అయితే, ఆ మిట్ట మధ్యాహ్నం సమయంలో ఆమె ఆర్తనాదాలు వినే వారే లేరు. చివరకు కొద్దిసేపటి తర్వాత ఆమెలో కొంచెం ధైర్యం వచ్చింది. మెల్లగా బయటకు వచ్చింది.

ఇప్పుడు బాధితురాలు శ్మశానవాటిక నిర్వాహకులపై 5 మిలియన్ డాలర్ల నష్ట పరిహారం కోసం కోర్టుకు వెళ్లింది. తనకు తగిలిన గాయాలతో పాటు తాను అనుభవించిన మనోవేదనకుగాను డబ్బులు చెల్లించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే, సమాధి తవ్విన వారు మట్టి సరిగా పూడ్చకపోవడం వల్ల అక్కడ డొల్లగా ఉందని, మనిషి నిలబడగానే, పెద్ద గొయ్యి ఏర్పడిందని నిర్వాహకులు చెబుతున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: March 18, 2019, 7:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading