హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

అప్పటికే ముగ్గురు ఆడపిల్లలు.. ఈసారి మగపిల్లాడు పుడతాడని గర్భిణి తలలో మేకు దించిన నకిలీ బాబా

అప్పటికే ముగ్గురు ఆడపిల్లలు.. ఈసారి మగపిల్లాడు పుడతాడని గర్భిణి తలలో మేకు దించిన నకిలీ బాబా

మహిళ తలలో మేకు

మహిళ తలలో మేకు

Pakistan: తలలో మేకు కొట్టుకుంటే మగ బిడ్డ పుడతానని ఆ బాబా నమ్మించాడు. చెప్పినట్లుగానే.. ఆమె తల భాగంలో రెండు అంగుళాల మేర మేకును దించాడు. మేకు పుర్రె లోపలికి వెళ్లిపోవడంతో తీవ్ర రక్తస్రావమైంది.

నేటి కాలంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. వంటింటి నుంచి బయటకు రాలేని స్థితి నుంచి ఇప్పుడు అంతరిక్షానికి నిచ్చెనలు వేసే స్థాయికి ఎదిగారు. ఎక్కడా తగ్గడం లేదు. పురుషులతో పోటీ పడుతూ సత్తాచాటుతున్నారు. అలాంటి కాలంలోనూ ఇంకా కొన్ని చోట్ల ఆడవారిపై వివక్ష కొనసాగుతోంది. అసలు ఆడ పిల్లలే వద్దనుకుంటున్న తల్లిదండ్రులు.. మనలో ఎందరో ఉన్నారు. మగ పిల్లాడే కావాలని ఏవేవో మందులు తింటూ.. పూజలు చేస్తున్న.. తల్లులు ఇంకా ఉన్నారు. ఇలానే భూతవైద్యుడిని నమ్ముకొని ఓ మహిళ ప్రాణాలకు మీదకు తెచ్చుకుంది. మగ పిల్లాడు పుట్టాలని తలలో మేకు కొట్టుకుంది. ఈ షాకింగ్ ఘటన పాకిస్తాన్‌లో చోటచేసుకుంది.

పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారం.. పెషావర్‌కు చెందిన ఓ మహిళకు ఇప్పటికే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మగ పిల్లాడి కోసం ఆ దంపతులు చాల ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. కానీ ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారు. కొన్ని నెలల క్రితం ఆమె మరోసారి గర్భం దాల్చింది. ఈ సారి మగ పిల్లాడు పుట్టకుండా విడాకులు ఇస్తానని ఆమె భర్త బెదిరించాడు. మళ్లీ ఆడబిడ్డే పుడుతుందేమోనని ఆ గర్భిణి భయపడిపోయింది. ఈ క్రమంలోనే స్థానికంగా ఉండే ఓ భూతవైద్యుడిని ఆమె ఆశ్రయించింది. తలలో మేకు కొట్టుకుంటే మగ బిడ్డ పుడతానని ఆ బాబా నమ్మించాడు. చెప్పినట్లుగానే.. ఆమె తల భాగంలో రెండు అంగుళాల మేర మేకును దించాడు. మేకు పుర్రె లోపలికి వెళ్లిపోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. బయటకు తీసేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. చివరకు పెషావర్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లింది. డాక్టర్లు ఆపరేషన్ చేసి మేకను బయటకు తీశారు. ఆమె తలలో మేకు ఉన్న స్కానింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

J-17 Fighters: పాక్ అమ్ములపొదిలో కొత్త యుద్ధ విమానాలు.. భారత్‌ను ఎదుర్కొనేందుకేనా..?

తలలో మేకు ఎలా దిగిందని అడిగితే.. తానే కొట్టుకున్నానని మొదట్లో ఆ మహిళ స్వయంగా చెప్పింది. కానీ ఆ తర్వాత నిజం ఒప్పుకుంది. ఓ భూత వైద్యుడే మేకు కొట్టాడని వివరించింది. ఈ వ్యవహారంపై పెషావర్‌లోని లేడీ రీడిండ్ ఆస్పత్రి వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చే సరికే ఆమె ఆస్పత్రి నుంచి వెళ్లిపోయింది. ఆమెను గుర్తించేందుకు పోలీసులు చాలా కష్టపడ్డారు. ఎలాగోలా అడ్రస్ కనుక్కొని.. ఆ భూత వైద్యుడి గురించి తెలుసుకున్నారు. ఐతే పోలీసులు తన గురించి పోలీసులు వెతుకుతున్నారని తెలిసి అతడు పారిపోయాడు. పరారీలో ఉన్న భూత వైద్యుడి కోసం గాలిస్తున్నట్లు పెషావర్ పోలీసులు తెలిపారు.

Pakistan Drone: అమృత్‌సర్‌లో డ్రోన్ బాంబు దాడి.. తిప్పికొట్టిన బీఎస్ఎఫ్ -Punjab పోల్స్ వేళ

పాకిస్తాన్‌లోని వాయువ్య గిరిజన ప్రాంతాల్లో భూత వైద్యులు ఎక్కువగా ఉంటారు. ఇస్లాంలోని సూఫీ సిద్ధాంతాన్ని వీళ్లు ఆచరిస్తారు. దక్షిణాసియాలోని కొన్ని పేద దేశాల్లో.. అమ్మాయి కంటే అబ్బాయే కావాలని ఎక్కువ మంది తల్లిదండ్రులు కోరుకుంటారు. సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆడపిల్ల కంటే మగపిల్లాడే మంచిదని ఇప్పటికీ కొందరు భావిస్తారు. ఈ క్రమంలోనే ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. మనదేశంలోనూ చాలా మంది మగ పిల్లాడి కోసం నాటు మందులు తింటున్నారని అప్పుడప్పుడూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని.. తల్లిదండ్రలుకు వారు భారం కాబోరని విద్యావేత్తలు చెబుతున్నారు. తల్లిదండ్రులు ఆలోచనా విధానంలో ఇప్పటికైనా మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

First published:

Tags: International news, Pakistan

ఉత్తమ కథలు