Isis : వాళ్లు ఎక్కడ ఉన్న వెతికి చంపుతాం.. ఐసిస్ వార్నింగ్..

ప్రతీకాత్మక చిత్రం

Isis Warning : ఆఫ్గాన్ పరిమాణాల తర్వాత ఐసిస్ ఉగ్రవాదులు మరింత రెచ్చిపోతున్నారు.ఓవైపు తాలిబాన్లు సైతం చెప్పింది ఒకటైతే చేసేది మరోకటిలా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆఫ్గానిస్తాన్‌లోని షియా ముస్లింలను టార్గెట్ చేశారు..వారు దేశంలో ఎక్కడున్న వెతికి చంపుతామంటూ హెచ్చరికలు జారీ చేయడం ఆందోళన కల్గిస్తోంది.

 • Share this:
  ఐసిస్‌ (Isis) ఉగ్రవాద సంస్థ నడుపుతున్న పత్రిక అల్-నబ ప్రకటనలో తెలిపిన ప్రకారం.. 'షియా ( shiya ) ముస్లింలు ప్రమాదకరమైన వారని, వాళ్లు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించింది.బాగ్దాద్ నుంచి ఖోరాసన్ వరకు, షియా ముస్లింలు ఉంటున్న ప్రతిచోటా దాడులు జరుగుతాయని ఆ ప్రకటనలో తెలిపింది. ఖమా ప్రెస్ ప్రకారం, ఐసిస్‌ చర్యలు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో ( afganistana ) శాంతికి అతి పెద్ద ముప్పుగా మారాయి. ఆఫ్గనిస్తాన్‌లోని కాందహార్ ప్రావిన్స్‌లోని షియా మసీదును శుక్రవారం పేల్చివేసిన తర్వాత ఈ హెచ్చరికలు ( warning) జారీ చేసింది. కాగా ఈ దాడిలో 80 మందికి పైగా గాయపడగా, 60 మంది మరణించారు.

  కాగా ఈ దాడి తామే చేసినట్లు ఐఎస్ కే ప్రకటించింది. అక్టొబర్ 8న ఆప్ఘానిస్తాన్‌లోని కుండుజ్ లోని షియా మసీదుపై జరిగిన మరో తీవ్రవాద దాడిలో 100మందికి పైగా మరణించగా అనేక మంది గాయపడ్డారు.

  ఇది చదవండి : చైనా సరిహద్దు వెంట భారత్ హై అలర్ట్.. ఆ దేశ కదలికలను పసిగట్టెందుకు ఆధునిక డ్రోన్


  మరోవైపు బగ్లాదేశ్‌లో ( Bangladesh ) మైనారీటిలుగా ఉన్న హిందువులపై గత రెండు రోజుల క్రితం కూడా దాడులు కొనసాగాయి. హిందువులు ఏర్పాటుచేసిన ఓ మంటపంలో.. ఖురాన్‌ను అవమానించారని వైరల్ పోస్టు సోషల్ మీడియాలో ( socila media ) రావడంతో ఆగ్రహించిన ముస్లింలు వారిపై దాడులకు దిగి మంటపాలను ధ్వంసం చేశారు. అల్లరిమూకలను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు ఆందోళనకారులు మరణించారు.

  దసరా చివరి రోజున బేగంగంజ్‌ పట్టణంలో ప్రార్థనలు ముగించుకుని వస్తున్న వందలాది మంది ముస్లింలు.. అక్కడున్న దుర్గామాత మంటపంలోకి ఒక్కసారిగా చొరబడ్డారు. మంటపాన్ని ధ్వంసం చేయడంతో పాటు ఆలయ కమిటీ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడ్ని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. మరో భక్తుడ్నీ హత్య ( murder ) చేసి పక్కనున్న చెరువులో పడేశారు. శనివారం ఉదయం ఘటనా స్థలిని పరిశీలిస్తున్న పోలీసులు చెరువులో పడి ఉన్న ఈ మృతదేహాన్ని కనుగొన్నారు.

  ఇది చదవండి : ఆ గ్రామ ప్రజలకు కంటిమీద కునుకు కరువు.. ఎటువైపు నుంచి దాడి జరుగుతుందో తెలియక భయం భయం


  ఈ అల్లర్లలో మరణించిన వారి సంఖ్య మొత్తంగా 6కు చేరింది.నౌఖాలీ జిల్లాలో ఇస్కాన్ దేవాలయంపై దుండగులు దాడి చేసి విధ్వంసానికి దిగారు. దసరా సందర్భంగా ఇస్కాన్ ఆలయం, భక్తులపై 200 మందికి పైగా దుండగులు దాడి చేశారు. హింసాత్మక దాడిలో 3 మంది భక్తులు మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు. దాడి చేసిన వారు మెజారిటీ వర్గానికి చెందిన వాళ్లు.. గూండాల్లా ప్రవర్తించారు. ముగ్గురు భక్తులు మరణించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంటూ హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి..

  కాగా మరణించిన వారిలో ఒకరు శ్రీ పార్థ దాస్ (25) గా గుర్తించారు, అతను దుండగుల చేతిలో దారుణంగా చంపబడ్డాడు. బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా హిందూ దేవాలయాలపై దాడి చేసిన వారిని శిక్షిస్తామని హామీ ఇచ్చిన కొన్ని గంటల తర్వాత ఈ దాడి జరిగింది. దుర్గా పూజ వేడుకల సందర్భంగా కొంతమంది గుర్తు తెలియని దుండగులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత జరిగిన అల్లర్లలో ముగ్గురు మరణించారు మరియు అనేక మంది గాయపడ్డారు. దీంతో బంగ్లాదేశ్ లోని హిందువులు ( Hindus ) భయం భయంగా బ్రతుకుతున్నట్టు తెలుస్తోంది.
  Published by:yveerash yveerash
  First published: