Home /News /international /

Suez Canal: ఆ బాహుబలి నౌక కదులుతోది.. కాలువలో చిక్కుకున్న 6 రోజులకు పురోగతి

Suez Canal: ఆ బాహుబలి నౌక కదులుతోది.. కాలువలో చిక్కుకున్న 6 రోజులకు పురోగతి

సూయజ్ కాలువలో చిక్కుకున్న నౌక

సూయజ్ కాలువలో చిక్కుకున్న నౌక

ఎవర్ గివెన్ అనే భారీ సరుకు రవాణా నౌక బలమైన గాలులతో సూయజ్ కాలువలో అడ్డంగా చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. 2,20,000 టన్నుల సరకుతో.. చైనా నుంచి నెదర్లాండ్స్ వెళ్తుండగా, మార్చి 23న చిక్కుకుపోయింది.

    ఆరు రోజులవుతోంది. సూయజ్ కాలువలో ట్రాఫిక్ ఇంకా క్లియర్ కాలేదు. కెనాల్‌లో అడ్డంగా చిక్కుపోయి ..వాణిజ్య నౌకల రాకపోకలను స్తంభింపచేసిన ఎవర్ గ్రీన్ నౌకను.. తిరిగి సరైన మార్గంలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఐతే ఎట్టకేలకు ఆరు రోజుల తర్వాత ఆ బాహుబలి నౌక కాస్త ముందుకు కదిలింది. ఈ విషయాన్ని సూయజ్ కెనాల్ అథారిటీ ప్రకటించిది. సూయజ్ కాలువలో జరుగుతున్న పనుల వివరాలను అథారిటీ ఛైర్మన్ ఒసామా రబీ మీడియాకు వివరించారు.

    ''ఎవర్ గ్రీన్ సంస్థకు చెందిన ఎవర్‌గివెన్ నౌకను కదిలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రయాణానికి అనువుగా తిప్పేందుకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఒక మూల నుంచి మరొక మూలకు చిక్కుకుపోవడంతో ప్రపంచంలో రద్దీగా ఉండే సూయజ్ కాలువలో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఇసుకను తవ్వడం, టగ్‌బోట్స్‌తో లాగడం వంటి చర్యల ద్వారా నౌకను కొద్దిగా కదిలించగలిగాం. ఇది సుమారు 30 డిగ్రీలు కదిలింది. ఐతే దాని ప్రయాణం ఎప్పుడు మొదలువుతుందో ఇప్పుడే చెప్పలేం.'' అని ఒసామా తెలిపారు.

    సూయజ్ కాలువ.. ఈజిప్టు సమీపంలో మధ్యదరా సముద్రం, ఎర్ర సముద్రాలను కలుపుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య మార్గాల్లో ఒకటి. ఆసియా, మధ్యప్రాశ్చం, ఐరోపా దేశాలను కలిపే ఈ ఇరుకైన మార్గం నుంచి పెద్ద మొత్తంలో నౌకలు వెళ్తుంటాయి. గత సంవత్సరం ఈ మార్గం నుంచి 19,000 నౌకలు ప్రయాణించాయని సూయజ్ కెనాల్ అథారిటీ చెబుతోంది. అంటే సగటున రోజుకు 50 నౌకలు సూయజ్ కాలువ ద్వారా ప్రయాణిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్యంలో 12 శాతం సరకు రవాణా ఈ కాలువ ద్వారానే జరుగుతుంది. ముఖ్యంగా చమురు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌ వంటివి ఈ మార్గం నుంచి ఎక్కువగా రవాణా అవుతుంటాయి.

    ఎవర్ గివెన్ అనే భారీ సరుకు రవాణా నౌక బలమైన గాలులతో సూయజ్ కాలువలో అడ్డంగా చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. 2,20,000 టన్నుల సరకుతో.. చైనా నుంచి నెదర్లాండ్స్ వెళ్తుండగా, మార్చి 23న చిక్కుకుపోయింది. ఎవర్ గివెన్ షిప్ 400 మీటర్ల పొడవు, 59 మీటర్ల వెడల్పుతో నాలుగు ఫుట్‌బాల్ మైదానాల విస్తీర్ణంలో ఉంటుంది. తైవాన్‌కు చెందిన ఎవర్‌గ్రీన్ మెరైన్ అనే సంస్థ దీన్ని 2018లో కొనుగోలు చేసింది. ఇది అప్పటి నుంచీ క్లియరెన్స్ ఆపరేషన్ కొనసాగుతోంది. బోటు కొనభాగం కింద ఇసుకను తొలగిస్తున్నారు. అదే సమయంలో టగ్ బోట్ల సాయంతో ఆ నౌకను సరైన మార్గంలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐతే ఆరు రోజులుగా రవాణా నిలిచిపోవడంతో భారీగా నష్టం వాటిల్లుతోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Business, Egypt, International, International news

    తదుపరి వార్తలు