అంగారక గ్రహం మీద అది సాధ్యమేనంట... అయితే పిల్లలెలా పుడతారంటే...

అంగారకుడిపై నివాసం ఏర్పరచుకున్న తర్వాత జరగబోయే పరిణామాల గురించి అధ్యయనం చేస్తున్న ఖగోళ శాస్త్రవేత్తలు... సంతానోత్పత్తిపై దృష్టి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 6, 2019, 6:07 PM IST
అంగారక గ్రహం మీద అది సాధ్యమేనంట... అయితే పిల్లలెలా పుడతారంటే...
అంగారక గ్రహం (నమూనా చిత్రం)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 6, 2019, 6:07 PM IST
మనిషి మేధస్సు భూమి సరిహద్దులను ఎప్పుడో దాటేసింది. దశాబ్దాల కిందటే చంద్రుడి మీద కాలుమోపిన మానవుడు, త్వరలో అంగారక గ్రహం మీద ఇళ్లు కట్టుకోవాలనే గట్టి సంకల్పంతో ఉన్నాడు. మార్స్ మీద మనిషి నివసించేందుకు అనువుగా అన్ని ఏర్పాట్లు చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. త్వరలోనే స్పేస్ షిప్‌లో కుజుడిపైకి దూసుకుపోవాలని చాలామంది ఫ్లాట్లు కూడా బుక్ చేసుకుంటున్నారు. అయితే మార్స్ మీద మనిషి నివాసం ఏర్పరచుకున్న తర్వాత జరగబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి... గ్రహాంతరాలు దాటి వెళ్లిన మనిషి, అక్కడ సంతానోత్పత్తి ఎలా సాగిస్తాడు... సెక్స్ జరిపినా పుట్టే పిల్లలు ఎలా ఉండబోతున్నరనే విషయాలపై ఇప్పుడు మేధావి వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Sex on a Mars colony could result in a new species of humans, Research Study Details అంగారక గ్రహం మీద సెక్స్ సాధ్యమే... అయితే పిల్లలెలా పుడతారంటే...
అంగారక గ్రహంపై వ్యోమగాములు (నమూనా చిత్రం)

సెక్స్, సంతానోత్పత్తి ప్రక్రియలో మనకి తెలియకుండానే మనచుట్టూ ఉన్న గాలి, నీరు, వాతావరణం కూడా భాగమవుతాయి. సెక్స్ ప్రక్రియలో కీలకమైన భూగురుత్వాకర్షణ శక్తి సంతానోత్పత్తికి కూడా తోడ్పడుతుంది. అయితే భూగ్రహంతో పోలిస్తే కుజ గ్రహం మీద గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఈ ప్రభావం సెక్స్ మీద పడే అవకాశం కచ్చితంగా ఉంటుంది. ఒకవేళ సెక్స్ సక్సెస్ ఫుల్ గా జరిపినా ఆ తర్వాత పుట్టే పిల్లలపై ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. మామూలు మనుషుల్లా కాకుండా వింత ఆకారాల్లో ఏలియన్స్ జన్మించే ప్రమాదం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Sex on a Mars colony could result in a new species of humans, Research Study Details అంగారక గ్రహం మీద సెక్స్ సాధ్యమే... అయితే పిల్లలెలా పుడతారంటే...
అంగారక గ్రహ ఉపగ్రహ చిత్రం

మనిషి శరీర నిర్మాణంలో పూర్తిగా భూ పర్యావరణంలోని అంశాలే ఉంటాయి. భూమిని దాటి గ్రహాంతరాల దూరం ప్రయాణం చేసిన తర్వాత పుట్టే పిల్లలో మనిషి లక్షణాలు దాదాపు కనుమరుగు అవుతాయని ఓ అంచనా వేస్తున్నారు ఖగోళ పండితులు. అంతేకాకుండా కుజ గ్రహం మీద నెలల తరబడి నివాసం ఏర్పరచుకున్న తర్వాత మనుషుల్లో కూడా చాలా మార్పులు జరుగుతాయని, శారీరకంగానూ, మానసికంగానూ జరిగే మార్పులు ఉనికిని ప్రశ్నార్థకంలో పడేసే ప్రమాదమూ ఉందనే కోణంలో రీసెర్చ్ చేస్తున్నారు. గురుత్వాకర్షణకి దూరమైన మనిషి ఎముకల్లో పటుత్వం కోల్పోవడం, కండరాలు దృఢ‌త్వం నశించి క్రమంగా క్షీణించే ముప్పు ఉంటుంది. మెదడు రూపం కూడా మారిపోవచ్చు. వీటన్నింటిని అధిగమించేందుకు అవసరమైన చర్యలు ఏం తీసుకోవాలనే కోణంలో అధ్యయనాలు జరుగుతున్నాయి.
Sex on a Mars colony could result in a new species of humans, Research Study Details అంగారక గ్రహం మీద సెక్స్ సాధ్యమే... అయితే పిల్లలెలా పుడతారంటే...
అంగారకుడిపై ఉపగ్రహం (నమూనా చిత్రం)మార్స్ మీద అనువైన జీవితానికి అలవాటు పడిన మనిషి, తిరిగి భూమ్మీద బ్రతకడం మాత్రం సాధ్యం కాదు అంటున్నాడు ఖగోళ పండితులు. మార్స్ మీదకి వెళ్లిన తర్వాత అక్కడ పుట్టే భవిష్యత్ తరాలు కొత్త జీవులుగా, భూమి మీద మనుషులకు గ్రహాంతర వాసులుగానే బ్రతకగలరు కానీ వారికి భూమి ఏ మాత్రం నివాసయోగం కాదని భావిస్తున్నారు.
First published: March 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...