ఇదేం ఆచారం.. కొండ మీద తెలియనివారితో ఆ పని చేస్తే అదృష్టమట..

Sex Festival | ఒక్కో చోట ఒక్కో ఆచారం ఉంటుంది. కొన్నిసార్లు వాటిని వింటేనే విచిత్రంగా అనిపిస్తోంది. ఇండోనేసియాలోని జావా ద్వీపంలో ఉన్న కొండపై అపరిచితులు సెక్స్ చేస్తే అదృష్టం కలిసి వస్తుందని ఓ ఆచారం ఉంది.

news18-telugu
Updated: April 17, 2019, 9:52 AM IST
ఇదేం ఆచారం.. కొండ మీద తెలియనివారితో ఆ పని చేస్తే అదృష్టమట..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొండ మీద సెక్స్ ఏంటి చోద్యం కాకపోతే.. అంటారా.. అవునండి నిజమే.. ఇండోనేసియాలో జావా ద్వీపంలో ఉన్న కిముకస్ పర్వతంపై అపరిచితులతో సెక్స్ చేస్తే అదృష్టమని కలిసి వస్తుందని ఓ నమ్మకం ఉందట. దీంతో ఆ కొండపైకి చాలా మంది వెళ్తుంటారు. ముస్లింల జనాభా ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో కొన్నిరోజులు సెక్స్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఆ సమయంలో కొండపై తెలియనివారితో సెక్స్ చేయాలట. ఇందులో పెళ్లి అయిన వారైనా, కాని వారైనా కూడా పాల్గొనొచ్చు. అది కూడా వేర్వేరు వ్యక్తులతో చేయొచ్చట. ఇలా చేయడం వల్ల అదృష్టం తన్నుకు వస్తుందని అక్కడి ప్రజల గట్టి నమ్మకం.

వందల ఏళ్లుగా కెముకస్ పర్వతంపై జరుగుతున్న ఈ ఆచారం వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. 16వ శతాబ్దంలో జావా ప్రాంతాన్ని ఓ రాజు పాలించేవాడు. ఆయనకు పంగేరన్ సముద్రో అనే కుమారుడు ఉండేవాడు. ఆ రాకుమారుడికి సవితి తల్లి న్యాయి ఓంట్రోవులాన్‌తో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం రాజుకు తెలియడంతో.. వారిద్దరూ సోలో అనే ప్రాంతానికి పారిపోయారు. అక్కడే వారిద్దరూ ఉంటున్న సమయంలో స్థానికులు చూసి దాడి చేసి చంపేశారు. ఆ సమయంలో తమ సమాధి దగ్గర ఎవరైతే కలుస్తారో.. వారికి మంచి జరుగుతుందని చెప్పి సముద్రో చనిపోయాడట.. దీంతో ఈ ఆచారం పుట్టుకొచ్చిందని చెబుతారు.

విషయం ఒకరి నోట మరొకరికి తెలయిడంతో చాలామంది ఇక్కడికి వస్తూ అపరిచితులతోనే ఆ పని కానిచ్చేస్తారట.. అయితే, ఇది ఒక్కసారి చేస్తే సరిపోదు.. ఏడుసార్లు చేయాలి.. 35 రోజుల సమయం తీసుకుంటూ.. ఇలా చేస్తేనే ఆచారం పూర్తైనట్టు. అందుకే సెక్స్ చేయాలనుకునేవారిని ఏరికోరుకుంటారు. వారి ఫోన్ నెంబర్స్, అడ్రస్‌లు మార్చుకుంటారు. ఇందులో సెక్స్ వర్కర్స్ కూడా ఉంటారు. ఇలా విచ్చలవిడిగా చేయడం వల్ల సుఖవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. వీటి బారిన పడకుండా ుండేందుకు ప్రభుత్వం, అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
First published: April 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading