• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • SEX IN VIDEO CONFERENCE COUPLE CAUGHT RED HANDED DURING SEX IN VIDEO CONFERENCE NK

Sex In Video Conference: వీడియో కాన్ఫరెన్స్‌లో బుక్కైన జంట... లైవ్‌లో ఆ పని చేస్తూ...

Sex In Video Conference: వీడియో కాన్ఫరెన్స్‌లో బుక్కైన జంట... లైవ్‌లో ఆ పని చేస్తూ...

వీడియో కాన్ఫరెన్స్‌లో బుక్కైన జంట... లైవ్‌లో ఆ పని చేస్తూ...

Sex At Party Video Meeting Trapped Couple: ఓవైపు పార్టీ వీడియో మీటింగ్ జరుగుతుంటే... ఆ జంట మాత్రం... దానితో తమకే సంబంధమూ లేనట్లు శృంగార కార్యకలాపాల్లో మునిగి తేలింది.

  • Share this:
    Sex In Video Conference: రాన్రానూ మన ప్రపంచంలో విలువలు పడిపోతున్నాయా... అనే డౌట్ వస్తుంది ఇలాంటి వార్తలు తెలుసుకున్నప్పుడు. దేనికైనా ఓ సమయం, సందర్భం ఉండాలంటారు పెద్దలు. కానీ... ఈ రోజుల్లో చాలా మంది... పెద్దల మాటలు పట్టించుకోవట్లేదు. ఇది అలాంటి కోవకు చెందినదే. కరోనా వైరస్ వచ్చాక... చాలా మీటింగ్‌లు వీడియో కాన్ఫరెన్సుల ద్వారానే జరుగుతున్నాయి. ఎవరి ఇళ్లలో వారు ఉంటూ... అక్కడి నుంచే సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఏం చెప్పాలన్నా, ఏ సూచన చెయ్యాలన్నా అంతా... ఆన్‌లైన్ లైవ్ లోనే జరుగుతోంది. ఐతే.. ఇలాంటి వీడియో కాన్ఫరెన్సుల్లో అప్పుడప్పుడూ అపశ్రుతులు దొర్లుతున్నాయి. ఇంట్లో పిల్లలు ఆటంకం కలిగించడం, కుటుంబ సభ్యులు డిస్టర్బ్ చెయ్యడం వంటివి జరిగితే... పోనీలే అనుకోవచ్చు... కానీ... ఒక్కోసారి ప్రైవేట్ విషయాలు కూడా పబ్లిక్ అయిపోతున్నాయి. నగ్న దృశ్యాలు లైవ్ అవుతున్నాయి.

    ఇప్పటికే ఇలాంటి ఎన్నో వీడియోలు, ఫొటోలు నెట్‌లో వైరల్ అయ్యాయి. తాజాగా వాటిలో మరొకటి వచ్చి చేరింది. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బ్రెజిల్‌లో సోషలిజం అండ్ లిబర్టీ పార్టీ... సిటీ కౌన్సిలర్ల కోసం వీడియో మీటింగ్ పెట్టింది. అందరూ అందులో పాల్గొన్నారు. వర్చువల్ సమావేశం వాడివేడిగా సాగుతోంది. ఇంతలో... అందరి దృష్టిని మరల్చింది ఓ ఘటన. సమావేశం జరుగుతుంటే... కెమెరా ఆఫ్ చెయ్యడం మర్చిపోయిన ఓ వ్యక్తి... తన భార్యతో సెక్స్‌లో పాల్గొన్నాడు. అది కాస్తా లైవ్ అయ్యింది. "ఏంటది... అరే అక్కడ ఏం జరుగుతోంది... ఓ... నో..." అంటూ అందరూ షాక్ అయ్యారు.

    సాధారణంగా ఇలాంటివి జరిగితే... మీటింగ్ మధ్యలోనే ఆపేస్తుంటారు. కానీ ఈ మీటింగ్ మాత్రం ఆగలేదు. "వాళ్లు అంత ఒళ్లు తెలియకుండా ఉంటారా... కెమెరా ఆఫ్ చేసుకోవాలనే జ్ఞానం కూడా ఉండదా... వాళ్లకు బుద్ధి రావాలంటే... మనం మీటింగ్ కంటిన్యూ చెయ్యాలి" అనుకున్నారు నేతలు. ఇటు మీటింగ్ జరుగుతుంటే... అటు అది కంటిన్యూ అయ్యింది.

    వీడియో కాన్ఫరెన్స్‌లో బుక్కైన జంట..


    ఉదయం 10 గంటలకు మీటింగ్ మొదలైంది. కాసేపటి తర్వాత ఈ బూతు పురాణం మొదలైంది. ఆ వ్యక్తి తన భార్యతో శృంగారంలో పాల్గొన్నాడు. ఈ మీటింగ్‌లో చాలా మంది సీనియర్లు పాల్గొన్నారు. "అతనికి ఎందుకు అంత తొందర... మీటింగ్ అంటే అంత చులకనా... ఆగలేకపోతున్నాడా" అని ఓ సీనియర్ మండిపడ్డారు. ఈ వీడియోను మీటింగ్‌లో పాల్గొన్న కొందరు రికార్డ్ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే సంబంధిత క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు