Home /News /international /

SEVERE PUNISHMENTS IMPOSED UNDER TALIBAN RULING IN AFGHANISTAN SSR

Taliban: ఆఫ్ఘనిస్తాన్‌లో ఇన్నాళ్లూ ఏమో గానీ.. ఇకపై ఎవరైనా అఫైర్ పెట్టుకుని ఇలా తాలిబన్లకు కనిపిస్తే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుత సమాజంలో వివాహేతర సంబంధాలు రోజుకు ఎన్నో వెలుగుచూస్తున్నాయి. ఈ ధోరణి రోజురోజుకూ పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయం. వివాహం అనే పవిత్ర బంధానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా పర స్త్రీ, పర పురుషుడి వ్యామోహంలో పడి కొందరు బంగారం లాంటి కాపురాలను నాశనం చేసుకుంటున్నారు.

ఇంకా చదవండి ...
  కాబూల్: ప్రస్తుత సమాజంలో వివాహేతర సంబంధాలు రోజుకు ఎన్నో వెలుగుచూస్తున్నాయి. ఈ ధోరణి రోజురోజుకూ పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయం. వివాహం అనే పవిత్ర బంధానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా పర స్త్రీ, పర పురుషుడి వ్యామోహంలో పడి కొందరు బంగారం లాంటి కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. ఇంకొందరైతే పెళ్లికి ముందే సంబంధాలు కొనసాగిస్తూ ఆ బంధానికి ప్రేమ అనే పేరు పెట్టి శారీరక అవసరాలను తీర్చుకుంటున్న పోకడ కూడా ప్రస్తుత సమాజంలో కనిపిస్తుంది. అయితే.. ఇకపై ఆఫ్ఘనిస్తాన్‌లో ఎవరైనా ఇలా పెళ్లికి ముందు లవ్ అఫైర్ గానీ, పెళ్లయిన తర్వాత వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు గానీ తెలిస్తే వాళ్లకు మూడినట్టే. వ్యభిచారం చేసినట్టు తెలిసినా వాళ్లకు అదే జీవితంలో చివరి రోజవుతుంది. ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం. ఈ తప్పులకు ఇతర దేశాల్లో శిక్షల సంగతేమో గానీ ఇకపై ఆప్ఘనిస్తాన్‌లో దొంగతనం, వ్యభిచారం, లవ్ అఫైర్, వివాహేతర సంబంధం.. ఈ నాలుగు తప్పుల్లో ఏ తప్పు చేస్తూ దొరికిపోయినా అలాంటి వాళ్లు చిక్కుల్లో పడ్డట్టే.

  అందుకు కారణం ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ తాలిబన్ల నియంత్రణలోకి రావడమే. గతంలో తాలిబన్లు ఆఫ్ఘన్‌లో పెత్తనం చలాయించిన సమయంలో ఇలాంటి తప్పులకు శిక్షలు కఠినంగా ఉండేవి. ఎంత కఠినంగా అంటే.. మరొకరికి అలాంటి తప్పు చేయాలన్న ఆలోచన రావాలన్న వెన్నులో వణుకు పుడుతుంది. తాలిబన్లు గతంలో ఆఫ్ఘన్‌ను పాలించిన సమయంలో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అనుమానం ఉంటే సదరు స్త్రీపురుషులను అందరి ముందు తలలు నరికేవారు. కొందరిని ఉరి తీసేవారు. దొంగతనాలు చేస్తూ తాలిబన్ల కంటపడితే చేతులూకాళ్లూ నరికేవారు. తాలిబన్లు తమ ప్రాభవం కోల్పోయిన సమయంలో కూడా ఇలాంటి తప్పులను ఏమాత్రం ఉపేక్షించలేదు.  2010లో జరిగిన ఈ ఘటనే అందుకు నిదర్శనం. కుందుజ్ ప్రావిన్స్‌ పరిధిలోని 23 ఏళ్ల యువతి, 28 ఏళ్ల యువకుడు పెళ్లి కాకుండానే ప్రేమ పేరుతో శారీరక సంబంధం కొనసాగించారు. ఈ విషయం తాలిబన్లకు తెలియడంతో ఆ యువతీయువకుడి సొంతూరైన ముల్లా ఖులీ అనే గ్రామంలో దాదాపు 100 మంది చూస్తుండగా వాళ్లిద్దరినీ లాక్కొచ్చారు. విచారించగా.. ఆ యువకుడికి అప్పటికే పెళ్లయిందని, ఆ యువతికి కూడా వేరే యువకుడితో నిశ్చితార్థం జరిగిందని.. అలాంటి వాళ్లిద్దరూ అఫైర్ పెట్టుకున్నారని తేలింది. తాలిబన్లు వాళ్లిద్దరికీ మరణ దండన విధించారు. ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి.. చేతులు వెనక్కు కట్టేసి.. అక్కడున్న స్థానికులతో రాళ్లు విసిరించి.. ఆ ఇద్దరూ చనిపోయే దాకా రాళ్ల దాడి చేయించారు. ఆ మరణాలను స్థానికంగా ఉన్న తాలిబన్ కమాండర్ కూడా ధ్రువీకరించాడు.

  ఇది కూడా చదవండి: Zarifa Ghafari: ‘తాలిబన్ల కోసం ఫ్యామిలీతో కూర్చున్నా.. నా కోసం వస్తారు.. చంపేస్తారు’.. ఈమె ఎందుకిలా అన్నారంటే..

  ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం.. పెళ్లి కాకుండా శృంగారంలో పాల్గొనడం, పెళ్లయిన వారు మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగించడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. అలా చేస్తున్న వారిని రాళ్లతో కొట్టి చంపుతారు. 2015లో కూడా ఈ తరహా ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. తాలిబన్ల నియంత్రణలో ఉన్న ఓ గ్రామంలో తనకు ఇష్టం లేని పెళ్లి కుదిర్చారని 19 ఏళ్ల యువతి తనకు నచ్చిన యువకుడితో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. రెండు రోజులకు ఆ ఇద్దరిని పట్టుకుని గ్రామానికి తీసుకొచ్చిన స్థానిక తాలిబన్లు దారుణమైన శిక్ష విధించారు. ఆమెను గొయ్యి తీసి తల మాత్రమే బయటకు ఉంచి మిగతా శరీర భాగాన్ని కప్పెట్టారు. ఆమె చనిపోయేదాకా ఆమె తలపైకి రాళ్లు విసురుతూ కొట్టి చంపారు. అంతేకాదు.. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. అప్పట్లో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ యువతిని తీసుకెళ్లిన యువకుడిని కొన్ని కొరడా దెబ్బలు కొట్టి.. హెచ్చరించి పంపించేశారు.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Afghanistan, Couple affair, Extra marital affair, Taliban

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు