హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Kabul : ఆర్మీ ఆస్పత్రిపై ఉగ్రదాడి -జంట పేలుళ్లలో 20మంది మృతి -Taliban పాలనలోనూ Afghan తలరాత అదే

Kabul : ఆర్మీ ఆస్పత్రిపై ఉగ్రదాడి -జంట పేలుళ్లలో 20మంది మృతి -Taliban పాలనలోనూ Afghan తలరాత అదే

కాబూల్ ఆర్మీ ఆస్పత్రిలో పేలుడు

కాబూల్ ఆర్మీ ఆస్పత్రిలో పేలుడు

కాబూల్ లోని మిలటరీ ఆస్పత్రిపై ఉగ్రవాదులు భీకర దాడికి పాల్పడ్డారు. అఫ్గాన్ లోనే అతిపెద్ద మిలటీ ఆస్పత్రి అది. జంట పేలుళ్లలో ఇప్పటిదాకా 20 మంది చనిపోయారని, 50 మందికిపైగా గాయపడ్డారని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. పేలుడు తర్వాత పారిపోతున్న జనంపై కాల్పులు కూడా జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు..

ఇంకా చదవండి ...

ఇండియాతో సరిహద్దును పంచుకునే అఫ్గానిస్థాన్ లో అశాంతి రాజ్యమేలుతోంది. పరిపాలన తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత కూడా రక్తపాతం కొనసాగుతోంది. వరుస దాడులకు దిగుతోన్న ఉగ్రవాదులు ఈసారి ఏకంగా సైనిక ఆస్పత్రిని టార్గెట్ చేసుకున్నారు. కాబూల్ లోని మిలటరీ ఆస్పత్రిపై ఉగ్రవాదులు భీకర దాడికి పాల్పడ్డారు. అఫ్గాన్ లోనే అతిపెద్ద మిలటీ ఆస్పత్రి అయిన సర్దార్ మొహమ్మద్ దావూద్ ఖాన్ ఆస్పత్రి వద్ద మంగళవారం ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. జంట పేలుళ్లలో 20 మందికిపైగా మరణించగా, 50మందికిపైగా గాయపడ్డారు. తాలిబన్ అధికార ప్రతినిధులు వెల్లడించిన వివరాలివి..

అఫ్గాన్ రాజధాని కాబూల్ నగరం మంగళవారం మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది. సెంట్రల్ కాబూల్ లోని వజీర్ అక్బర్ ప్రాంతంలో కొలువైన మిలటరీ ఆస్పత్రి (సర్దార్ మొహమ్మద్ దావూద్ ఖాన్ ఆస్పత్రి) ప్రవేశ ద్వారం వద్ద రెండు శక్తిమంతమైన బాంబులు పేలాయి. పేలుడు ధాటికి అక్కడున్నవారి శరీరాలు తునాతునకలుకాగా, పేలుడు నుంచి దూరంగా పారిపోతున్నవారిపై కాల్పులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుడు తర్వాత ఆస్పత్రిలోని పేషెంట్లను వారి కుటుంబీకులు మోసుకెళుతోన్న దృశ్యాలు కనిపించాయి. ఇది దేశంలోనే అతిపెద్ద మిలటరీ ఆస్పత్రి కావడంతో నిత్యం వేల సంఖ్యలో జనసంచారం ఉందక్కడ.

కాబూల్ లోని మిలటరీ ఆస్పత్రిపై ఉగ్రదాడికి సంబంధించిన విషయాలను తాలిబన్ అంతర్గతశాఖ అధికార ప్రతినిధి ఖరీ సయీద్ ఖోస్తీ మీడియాకు వెల్లడించారు. జంట పేలుళ్లలో ఇప్పటిదాకా 20 మంది చనిపోయారని, 50 మందికిపైగా గాయపడ్డారని, ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని సైన్యం స్వాధీనంలోకి తీసుకుని సహాయక చర్యలు ముమ్మరం చేసిందని తాలిబన్ ప్రతినిధి ఖోస్తీ తెలిపారు. అప్గాన్ లో తాలిబన్ పాలన మొదలైన తర్వాత జరిగిన రెండో అతిపెద్ద పేలుడు ఘటన ఇది.

ఈ ఏడాది ఆగస్టులో కాబూల్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత.. అఫ్గాన్ ను ప్రధాన స్థావరంగా మార్చుకున్న ఇస్లామిక్ సేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థ వరుస దాడులకు పాల్పడుతున్నది. మసీదులు, ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతోంది. గత నెలలో కుందుజ్ ప్రాంతంలో ఓ మసీదులో ఐసిస్ జరిపిన పేలుళ్లలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు కాబూల్ ఆర్మీ ఆస్పత్రి పేలుడు ఘటనలోనూ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 2017లోనూ ఈ ఆసుపత్రిపై ఉగ్రదాడి జరగ్గా, 30 మంది మరణించారు. తాజా ఘటనపై ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత ప్రకటించలేదు.

First published:

Tags: Afghanistan, Kabul, Kabul blast, Taliban

ఉత్తమ కథలు