హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

బేకరిలో భారీ పేలుడు..నలుగురు మృతి, 30 మందికి గాయాలు

బేకరిలో భారీ పేలుడు..నలుగురు మృతి, 30 మందికి గాయాలు

ఘటనాస్థలంలో పోలీసులు

ఘటనాస్థలంలో పోలీసులు

పోలీసులు బేకరిని పరిశీలించి పలు ఆధారాలు సేకరించారు. చుట్టుపక్కల ప్రజల భయటకు రాకూడదని పోలీసులు ఆదేశించారు. గ్యాస్ పైప్ లీక్ కావడం వల్లే పేలుడు జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో భారీ పేలుడు సంభవించింది. సిటీలో 9వ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఉన్న ఓ బేకరిలో ఈ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా, 30 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి బేకరి పూర్తిగా ధ్వంసమైంది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. పేలుడు, మంటల కారణంగా చుట్టుపక్కల ఉన్న ఇళ్లు ధ్వంసమయ్యాయి. పార్కింగ్‌లో ఉన్న కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక దళాలు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి.

ప్యారిస్ కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బేకరి పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు బేకరిని పరిశీలించి పలు ఆధారాలు సేకరించారు. చుట్టుపక్కల ప్రజల భయటకు రాకూడదని పోలీసులు ఆదేశించారు. గ్యాస్ పైప్ లీక్ కావడం వల్లే పేలుడు జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కాగా,పేలుడుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

First published:

Tags: Bomb blast, France

ఉత్తమ కథలు