చైనాలో కరోనా కంటే డేంజర్ వైరస్.. ఏడుగురు మృతి, 60 మందికి ఇన్ఫెక్షన్..

చైనాలో మరో వైరస్ వ్యాపిస్తోంది. దీని వల్ల ఏడుగురు చనిపోయారు. సుమారు 60 మంది వైరస్ బారినపడ్డారు.

news18-telugu
Updated: August 5, 2020, 10:31 PM IST
చైనాలో కరోనా కంటే డేంజర్ వైరస్.. ఏడుగురు మృతి, 60 మందికి ఇన్ఫెక్షన్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చైనాలో మరో వైరస్ వ్యాపిస్తోంది. దీని వల్ల ఏడుగురు చనిపోయారు. సుమారు 60 మంది వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని చైనా అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ స్థానిక వార్తాపత్రికలను ఉటంకిస్తూ ప్రసారం చేసింది. ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. తూర్పు చైనాలోని జియాంగ్ సు ప్రావిన్స్ లో ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో సుమారు 37 మంది SFTS వైరస్ బారినపడ్డారు. ఆ తర్వాత అదే వైరస్ తూర్పుచైనాలోని అన్ హుయి ప్రావిన్స్ లో 23 మందికి సోకినట్టు నిర్ధారణ అయింది. జియాంగ్ సు రాజధాని నాన్ జియాంగ్‌కు చెందిన ఓ మహిళకు ఈ SFTS వైరస్ సోకింది. ఆమెకు జ్వరం, దగ్గు లక్షణాలు కనిపించాయి. ఆమె శరరీంలో ల్యూకోసైట్, రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గినట్టు వైద్యులు తెలిపారు. నెల రోజుల చికిత్స అనంతరం ఆమె కోలుకుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఇప్పటి వరకు తూర్పు చైనాలోని అన్ హుయి, జియాంగ్ సు ప్రావిన్స్ లో ఈ వైరస్ వల్ల ఏడుగురు చనిపోయారు. SFTS అనేది కొత్త వైరస్ కాదు. 2011లో చైనాలో ఇది వచ్చింది. ఇది బన్యావైరస్ కేటగిరీకి చెందినది. ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని వైరాలజిస్టులు చెబుతున్నారు. ఇది రక్తం ద్వారా గానీ, శ్లేష్మం ద్వారా కానీ పాకే అవకాశం ఉందని చెప్పారు. కీటకాలు కుట్టడం ద్వారా కూడా ఇది వ్యాపిస్తుందని తెలిపారు. అంతగా భయపడాల్సిన అవసరం లేదని జీ జియాంగ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్లు చెబుతున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 5, 2020, 10:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading